Ramayana: వీకెండ్‌కు రామాయణ మూవీ ప్లాన్ చేస్తున్నారా.? ఇలా చేస్తే టికెట్లపై రూ. 840 వరకు ఆదా..
Ramayana: దీపావళి వీకెండ్‌లో రామాయణ సినిమా చూడాలనుకునేవారు బుక్‌మైషోలో కొన్ని బ్యాంకుల క్రెడిట్, డెబిట్ కార్డులతో బై వన్ గెట్ వన్ ఫ్రీ ఆఫర్లు, రూ. 840 వరకు డిస్కౌంట్ పొందవచ్చు.
Ramayana: వీకెండ్‌కు రామాయణ మూవీ ప్లాన్ చేస్తున్నారా.? ఇలా చేస్తే టికెట్లపై రూ. 840 వరకు ఆదా..
Ramayana: దీపావళి వీకెండ్ వచ్చింది. రామాయణ సినిమాను థియేటర్లలో చూడాలనుకునేవారు బుక్‌మైషోలో కొన్ని బ్యాంక్ క్రెడిట్, డెబిట్ కార్డుల ఆఫర్లతో టికెట్లపై డబ్బు ఆదా చేసుకోవచ్చు. వీటిలో బై వన్ గెట్ వన్ ఫ్రీ డీల్స్, అర్హత ఉన్న బుకింగ్స్‌పై తక్షణ డిస్కౌంట్లు ఉన్నాయి. నితేష్ తివారీ దర్శకత్వంలో తెరకెక్కిన రామాయణ పార్ట్ 1 నవంబర్ 5న థియేటర్లలోకి వచ్చింది. రణ్‌బీర్ కపూర్ రాముడిగా, సాయి పల్లవి సీతగా, యష్ రావణుడిగా నటించారు. నమిత్ మల్హోత్రా నిర్మించిన ఈ చిత్రం మంచి మౌత్ టాక్‌తో దూసుకుపోతోంది.
క్రెడిట్ కార్డుల విషయానికి వస్తే, కొన్ని కార్డులపై రూ. 840 వరకు ఆదా చేసుకోవచ్చు. యాక్సిస్ బ్యాంక్, హెచ్‌డీఎఫ్‌సీ బ్యాంక్, ఐసీఐసీఐ బ్యాంక్, ఎస్‌బీఐ, హెచ్‌ఎస్‌బీసీ, ఏయూ బ్యాంక్ బై వన్ గెట్ వన్ ఫ్రీ డీల్స్ అందిస్తున్నాయి. ఐడీఎఫ్‌సీ ఫస్ట్ బ్యాంక్ ప్రైవేట్ క్రెడిట్ కార్డ్ అర్హత ఉన్న బుకింగ్స్‌పై రూ. 750 వరకు తగ్గింపు ఇస్తోంది. ఇండస్‌ఇండ్, యెస్ బ్యాంక్ కార్డుల్లో కొన్ని వేరియంట్లకు రూ. 840 వరకు ఆఫర్ ఉంది. హెచ్‌డీఎఫ్‌సీ టైమ్స్ కార్డుపై 25 శాతం తగ్గింపు, ఆర్‌బీఎల్ ప్లే కార్డుపై నెలకు రూ. 500 వరకు డిస్కౌంట్ అందుబాటులో ఉన్నాయి.
డెబిట్ కార్డ్ యూజర్లకు కూడా ఆఫర్లు ఉన్నాయి. కొన్ని కార్డులపై రూ. 500 వరకు, ఎంపిక చేసిన యెస్ బ్యాంక్ డెబిట్ కార్డులపై రూ. 840 వరకు ఆదా చేసుకోవచ్చు. ఇండస్‌ఇండ్ డెబిట్ కార్డుల్లో బై వన్ గెట్ వన్ ఆఫర్ ఉంది. అమెజాన్ పే లేటర్‌తో చెల్లించేవారికి రూ. 399 కనీస లావాదేవీపై రూ. 20 నుంచి రూ. 100 వరకు క్యాష్‌బ్యాక్ వస్తుంది. ఈ ఆఫర్ 2026 నవంబర్ 30 వరకు వెబ్, యాప్ బుకింగ్స్‌కు చెల్లుతుంది. ఒక్కో యూజర్‌కు ఒకసారి మాత్రమే వర్తిస్తుంది. ఇతర ఆఫర్లతో కలపలేరు. క్యాష్‌బ్యాక్ 24 గంటల్లో అమెజాన్ పే బ్యాలెన్స్‌లో జమ అవుతుంది.
ఈ ఆఫర్లకు కొన్ని షరతులు ఉన్నాయి. బుక్‌మైషో బుకింగ్స్‌కు అదనపు ప్రాసెసింగ్ ఫీజులు వర్తిస్తాయి. చాలా బై వన్ గెట్ వన్ ఫ్రీ ఆఫర్లకు ఒకే లావాదేవీలో కనీసం రెండు టికెట్లు బుక్ చేయాలి. కార్డుల వేరియంట్‌ను బట్టి గరిష్ఠ డిస్కౌంట్, నెలవారీ పరిమితులు మారతాయి. కాబట్టి బుకింగ్ చేసే ముందు మీ కార్డ్ ఆఫర్ వివరాలను యాప్‌లో చూసుకోవడం మంచిది.




