Ramayana: 'రామాయణ' ఫస్ట్ డే కలెక్షన్లు .. ఆదిపురుష్ కంటే తక్కువే..!

Ramayana: 'రామాయణ' పార్ట్-1 తొలి రోజు బాక్సాఫీస్ కలెక్షన్లు రికార్డు స్థాయికి చేరాయి.

Gagan kumar
Published on: 6 Nov 2026 10:28 AM IST
Ramayana
X

Ramayana: 'రామాయణ' ఫస్ట్ డే కలెక్షన్లు .. ఆదిపురుష్ కంటే తక్కువే..!

Ramayana: రణ్‌బీర్ కపూర్ (రాముడు), సాయి పల్లవి (సీత), అసురరాజు రావణాసురుడిగా రాకింగ్ స్టార్ యష్ నటించిన అత్యంత ప్రతిష్టాత్మక చిత్రం ‘రామాయణ’ (పార్ట్-1) ప్రపంచవ్యాప్తంగా భారీ అంచనాల నడుమ థియేటర్లలోకి వచ్చి తొలిరోజే బాక్సాఫీస్ వద్ద సునామీ సృష్టించింది. విమర్శకుల నుంచి ప్రశంసలతో పాటు ప్రేక్షకుల నుంచి పాజిటివ్ టాక్ తెచ్చుకున్న ఈ చిత్రం మొదటి రోజు వీరవిహారం చేస్తూ సరికొత్త రికార్డులను నెలకొల్పింది.

పాపులర్ ట్రేడ్ ట్రాకింగ్ పోర్టల్ సాక్‌నిల్క్ లెక్కల ప్రకారం, 'రామాయణ' పార్ట్-1 భారతదేశంలో తొలి రోజు ఏకంగా రూ. 64.85 కోట్ల నెట్ వసూళ్లను (గ్రాస్ రూ. 77.50 కోట్లు) రాబట్టింది. దేశవ్యాప్తంగా వివిధ భాషల్లో కలిపి మొత్తం 25,200 షోలలో ప్రదర్శితమైన ఈ చిత్రానికి హిందీ బెల్ట్‌లో ఊహించని రీతిలో రెస్పాన్స్ వచ్చింది.

హిందీ: రూ. 47.50 కోట్లు

కన్నడ: 7.25 కోట్లు

తెలుగు: రూ. 6.00 కోట్లు

తమిళం: రూ. 2.60 కోట్లు

మలయాళం: రూ. 1.50 కోట్లు

ఇండియాలో రాబట్టిన రూ. 77.50 కోట్ల గ్రాస్ కలెక్షన్లకు తోడు ఓవర్సీస్ నుంచి మరో రూ. 20 కోట్ల నుంచి రూ. 40 కోట్ల వరకు ప్రీమియర్లు, తొలిరోజు వసూళ్లు వచ్చాయని ట్రేడ్ వర్గాలు అంచనా వేస్తున్నాయి. దీంతో ప్రపంచవ్యాప్తంగా ఫస్ట్ డేనే ఈ చిత్రం రూ. 100 కోట్ల క్లబ్‌లోకి సునాయాసంగా అడుగుపెట్టింది.

తొలిరోజు వసూళ్లతో 'రామాయణ' చిత్రం బాలీవుడ్ ఆల్-టైమ్ రికార్డులను తిరగరాసింది. షారుఖ్ ఖాన్ ‘పఠాన్’, రణ్‌బీర్ సొంత సినిమా ‘యానిమల్’ కలెక్షన్లను ఇది దాటేసింది. అయితే, గతంలో రాముడి కథాంశంతో ప్రభాస్ కథానాయకుడిగా వచ్చిన ‘ఆదిపురుష్’ ఫస్ట్ డే ఇండియా నెట్ వసూళ్లను (రూ. 86.75 కోట్లు) మాత్రం ‘రామాయణ’ దాటలేకపోవడం విశేషం.

ఇక 2026లో అత్యధిక ఓపెనింగ్స్ సాధించిన చిత్రాల్లో రజనీకాంత్ 'జైలర్ 2'ని దాటేసిన ‘రామాయణ’.. టాప్ ప్లేస్‌లో ఉన్న ‘ధురంధర్: ది రివెంజ్’ (రూ. 102.55 కోట్ల నెట్) తర్వాత స్థానంలో నిలిచింది. ఈ సినిమాకు మొదటి రోజే పాజిటివ్ టాక్, సూపర్ రివ్యూస్ రావడం బాక్సాఫీస్ వద్ద పెద్ద ప్లస్ పాయింట్‌గా మారింది.

శని, ఆదివారాలతో పాటు రాబోయే దీపావళి పండుగ సెలవులు, సోమవారం వచ్చే గోవర్ధన పూజ హాలిడే ఈ చిత్రానికి మరింత ఊపునివ్వనున్నాయి. లాంగ్ వీకెండ్‌లో 'రామాయణ' సరికొత్త బాక్సాఫీస్ రికార్డులను సృష్టించడం ఖాయమని సినీ విశ్లేషకులు భావిస్తున్నారు.

Gagan kumar

Gagan kumar

2014లో జర్నలిస్ట్‌గా నా కెరీర్ ప్రారంభించాను. పలు వెబ్‌సైట్‌లలో సబ్-ఎడిటర్‌గా పని చేశాను. డిజిటల్‌ రంగాల్లో 11 ఏళ్లకు పైగా అనుభవం ఉంది. బిజినెస్, స్పోర్ట్స్, మూవీస్, నేషనల్ అండ్ ఇంటర్నేషనల్, పాలిటిక్స్ , వైరల్ న్యూస్‌కు సంబంధించిన కంటెంట్‌ను రాయగలను. ముఖ్యంగా బిజినెస్, స్పోర్ట్స్, మూవీస్, బ్రేకింగ్ న్యూస్ రాయడంలో నైపుణ్యం ఉంది.