Vijay Deverakonda: ‘కోబలి’ని చూడటానికి రెండు కళ్లు సరిపోవడం లేదు సామి!
Vijay Deverakonda: విజయ్ దేవరకొండ, రష్మిక మందన్న నటిస్తున్న పీరియాడిక్ యాక్షన్ డ్రామా ‘రణబాలి’ నుంచి సెకండ్ సింగిల్ ‘కోబలి’ లిరికల్ వీడియో విడుదలైంది.
Vijay Deverakonda: ‘కోబలి’ని చూడటానికి రెండు కళ్లు సరిపోవడం లేదు సామి!
Ranabali: విజయ్ దేవరకొండ, రష్మిక మందన్న క్రేజీ కాంబినేషన్లో తెరకెక్కుతున్న మోస్ట్ అంటెసిపేటెడ్ పీరియాడిక్ యాక్షన్ డ్రామా ‘రణబాలి’. ఈ చిత్రం అక్టోబర్ 16న ప్రేక్షకుల ముందుకు రానున్న నేపథ్యంలో, మేకర్స్ ప్రమోషన్స్‌లో జోరు పెంచారు. తాజాగా ఈ సినిమా నుంచి విడుదలైన సెకండ్ సింగిల్ ‘కోబలి’ లిరికల్ వీడియో ఇప్పుడు సోషల్ మీడియాలో ట్రెండింగ్‌గా మారుతూ, సినిమాపై అంచనాలను తారాస్థాయికి చేర్చింది.
మొదటగా స్పాటిఫైలో మ్యూజిక్ లవర్స్‌ను అలరించిన ‘కోబలి’ పాటను, తాజాగా యూట్యూబ్‌లో ఫుల్ లిరికల్ వీడియో రూపంలో విడుదల చేశారు చిత్ర బృందం. ఈ పాట వినడానికి ఎంతో పవర్‌ఫుల్‌గా, సినిమా నేపథ్యానికి సరిగ్గా సరిపోయేలా సాగుతోంది. ఈ పాటకు అందించిన అర్థవంతమైన, శక్తివంతమైన పదాలు శ్రోతలను మంత్రముగ్ధులను చేస్తున్నాయి. స్టార్ మ్యూజిక్ డైరెక్టర్లు అజయ్-అతుల్ అందించిన సంగీతం ఈ పాటకు ప్రాణం పోసింది. వారి ట్యూన్స్, బ్యాక్‌గ్రౌండ్ స్కోర్ సినిమాకు ప్రధాన బలంగా మారనున్నాయని ఈపాట స్పష్టం చేస్తోంది.
టాలీవుడ్లో క్యూటెస్ట్ జోడీగా పేరు తెచ్చుకున్న విజయ్ దేవరకొండ, రష్మిక మందన్న మరోసారి వెండితెరపై మ్యాజిక్ చేయడానికి సిద్ధమయ్యారు. వీరిద్దరి ఆన్-స్క్రీన్ కెమిస్ట్రీ కోసం అభిమానులు ఎంతో ఆసక్తిగా ఎదురుచూస్తున్నారు. పీరియాడిక్ యాక్షన్ డ్రామా బ్యాక్‌డ్రాప్‌లో వస్తున్న ఈ చిత్రంలో వీరి పాత్రలు ఎలా ఉండబోతున్నాయనేది ఇప్పుడు హాట్ టాపిక్‌గా మారింది.
సినిమా విడుదలకు సమయం దగ్గరపడుతుండటంతో మేకర్స్ వరుస అప్డేట్స్తో ప్రేక్షకులను అలరిస్తున్నారు. ప్రమోషనల్ కంటెంట్ ద్వారా అంచనాలను అంతకంతకూ పెంచేస్తున్న ‘రణబాలి’ టీమ్, రానున్న రోజుల్లో మరిన్ని సర్ప్రైజ్లు ఇచ్చేందుకు సిద్ధమవుతోంది. మరి పవర్ఫుల్ కాన్సెప్ట్, అద్భుతమైన మ్యూజిక్, విజయ్-రష్మిక క్రేజీ కాంబినేషన్‌తో వస్తున్న ఈ పీరియాడిక్ యాక్షన్ డ్రామా బాక్సాఫీస్ వద్ద ఎలాంటి సంచలనాలు సృష్టిస్తుందో చూడాలి.




