Ranbir Kapoor: రణ్‌బీర్ కపూర్ 'రామాయణం' ట్రైలర్ విడుదల వాయిదా… అసలు కారణం అదేనా?
Ranbir Kapoor: భారతీయ సినీ పరిశ్రమలో అత్యంత ప్రతిష్టాత్మకంగా తెరకెక్కుతున్న మైథలాజికల్ పాన్-గ్లోబల్ ప్రాజెక్ట్ 'రామాయణం'.
Ranbir Kapoor: రణ్‌బీర్ కపూర్ 'రామాయణం' ట్రైలర్ విడుదల వాయిదా… అసలు కారణం అదేనా?
Ranbir Kapoor: భారతీయ సినీ పరిశ్రమలో అత్యంత ప్రతిష్టాత్మకంగా తెరకెక్కుతున్న మైథలాజికల్ పాన్-గ్లోబల్ ప్రాజెక్ట్ 'రామాయణం'. నితీష్ తివారీ దర్శకత్వంలో రూపుదిద్దుకుంటున్న ఈ సినిమా ట్రైలర్ లాంచ్ కోసం కోట్లాది మంది అభిమానులు ఎంతో ఆసక్తిగా ఎదురుచూశారు. అయితే, ఎస్డీసీసీ వేదికగా గ్రాండ్‌గా విడుదల కావాల్సిన ట్రైలర్ చివరి నిమిషంలో వాయిదా పడింది.
సోనీ పిక్చర్స్ ఎంటర్‌టైన్‌మెంట్ భాగస్వామ్యమే కారణం!
అనుకున్న షెడ్యూల్ ప్రకారం జూలై 24న ఉదయం రావాల్సిన 'రామాయణం' ట్రైలర్ విడుదల వాయిదా పడినట్లు నిర్మాత నమిత్ మల్హోత్రా సోషల్ మీడియా వేదికగా అధికారికంగా ప్రకటించారు. ఈ సినిమా గ్లోబల్ డిస్ట్రిబ్యూషన్ హక్కులను ప్రముఖ హాలీవుడ్ స్టూడియో 'సోనీ పిక్చర్స్ ఎంటర్‌టైన్‌మెంట్' దక్కించుకుందని, అంతర్జాతీయ స్థాయిలో సినిమాను భారీ ఎత్తున విడుదల చేసే ప్రణాళికలో భాగంగానే ట్రైలర్ లాంచ్‌ను వాయిదా వేసినట్లు తెలిపారు. కొత్త విడుదల తేదీని త్వరలోనే వెల్లడించనున్నారు.
అయితే, సోనీ పిక్చర్స్ రాకతో టామ్ హోలాండ్ నటించిన హాలీవుడ్ బ్లాక్‌బస్టర్ చిత్రం 'స్పైడర్ మ్యాన్: బ్రాండ్ న్యూ డే' స్క్రీనింగ్‌తో పాటు ఈ చిత్ర ట్రైలర్‌ను ప్రపంచవ్యాప్తంగా థియేటర్లలో అటాచ్ చేయనున్నారనే ప్రచారం సినీ వర్గాలలో గట్టిగా వినిపిస్తోంది. దీనివల్ల సినిమాకు అంతర్జాతీయ స్థాయిలో మరింతభారీ ప్రచారం లభిస్తుందని మేకర్స్ భావిస్తున్నట్లు సమాచారం.
భారీ తారాగణం.. దీపావళికి రిలీజ్
రణ్‌బీర్ కపూర్ రాముడిగా, సాయి పల్లవి సీతగా, యష్ రావణాసురుడిగా నటిస్తున్న ఈ ఇతిహాస కావ్యాన్ని ప్రైమ్ ఫోకస్ స్టూడియోస్, మాస్టర్ మైండ్ క్రియేషన్స్ సంయుక్తంగా నిర్మిస్తున్నాయి. ఆస్కార్ విజేత వీఎఫ్ఎక్స్ స్టూడియో 'డీఎన్ఈజీ' ఈ చిత్రానికి విజువల్ ఎఫెక్ట్స్ అందిస్తోంది. ఏదేమైనా ట్రైలర్ వాయిదా అభిమానులకు నిరాశ కలిగించినా, గ్లోబల్ లెవెల్‌లో సినిమాను తీసుకువెళ్తున్న తీరుపై సర్వత్రా హర్షం వ్యక్తమవుతోంది. ఈ చిత్రం 2026 దిపావళి కానుకగా ప్రేక్షకుల ముందుకు రానుంది.




