Ramayana Trailer: ఇది కదా ట్రైలర్ అంటే.. 'రామాయణ' విజువల్ వండర్..!

Ramayana Trailer: దాదాపు రూ. 4,000 కోట్ల భారీ బడ్జెట్‌తో నితేష్ తివారీ దర్శకత్వంలో తెరకెక్కుతున్న ‘రామాయణ’ చిత్రం విశేషాలు.

Naresh.k
Published on: 30 July 2026 7:34 AM IST
Ramayana Trailer
X

Ramayana Trailer: ఇది కదా ట్రైలర్ అంటే.. 'రామాయణ' విజువల్ వండర్..!

Ranbir Kapoor Ramayana: భారతీయ చలనచిత్ర పరిశ్రమ మునుపెన్నడూ చూడని, వినని రీతిలో ఒక మహోన్నత కావ్య దృశ్యరూపం సిద్ధమవుతోంది. దాదాపు రూ. 4,000 కోట్ల భారీ బడ్జెట్‌తో తెరకెక్కుతున్న ఈ ‘రామాయణ’ కేవలం ఒక సినిమా మాత్రమే కాదు... ప్రపంచ సినిమా వేదికపై భారతీయ సంస్కృతి, సాంకేతిక సత్తాను సగర్వంగా చాటిచెప్పే ఒక చారిత్రాత్మక ప్రయత్నం. దంగల్ వంటి ఆల్-టైమ్ హిట్ చిత్రాన్ని అందించిన ప్రముఖ దర్శకుడు నితేష్ తివారీ దర్శకత్వంలో ఈ పాన్-ఇండియన్ పౌరాణిక దృశ్యకావ్యం రూపొందుతోంది. నటీనటుల ఎంపికే ఈ సినిమాపై అంచనాలను ఆకాశాన్ని తాకేలా చేసింది.

రాముడికి ఉండాల్సిన గాంభీర్యం, శాంతం, తేజస్సును తన నటనతో రణబీర్ అద్భుతంగా ఆవిష్కరించారు. తన సహజసిద్ధమైన అభినయంతో సీతమ్మ పాత్రకు పూర్తి న్యాయం చేస్తూ ప్రేక్షకులను కట్టిపడేసింది. కన్నడ రాకింగ్ స్టార్ యశ్ తన గంభీరమైన వాయిస్, రాయల్ లుక్‌తో రావణాసురుడి పాత్రలో అదరగొట్టేశాడు. పంచదార బొమ్మ కాజల్ మండోదరి పాత్రలో తనదైన ప్రత్యేకతను చాటుకోనుంది. ఈ చిత్రాన్ని అంతర్జాతీయ ఆడియన్స్‌కు సైతం చేరువ చేసేలా మేకర్స్ ఎక్కడా కాంప్రమైజ్ కాకుండా తెరకెక్కిస్తున్నారు.ఆస్కార్ విజేత, ప్రఖ్యాత హాలీవుడ్ సంగీత దర్శకుడు హ్యాన్స్ జిమ్మర్ అందిస్తున్న స్వరాలు ఈ చిత్రానికి ప్రధాన ఆకర్షణగా నిలవనున్నాయి. హాలీవుడ్ స్థాయి విజువల్ ఎఫెక్ట్స్, గ్రాఫిక్స్‌తో మన పౌరాణిక కథను కళ్లకు కట్టినట్లు విజువల్ ఫీస్ట్‌గా మలిచారు.

తాజాగా విడుదలైన ఈ సినిమా ట్రైలర్ సోషల్ మీడియాను ఊపేస్తోంది. ప్రతి ఫ్రేమ్‌లో మేకర్స్ పడ్డ కష్టం, క్వాలిటీ స్పష్టంగా కనిపిస్తున్నాయి. అద్భుతమైన లొకేషన్లు, పవర్ ఫుల్ డైలాగులు, నటీనటుల పర్‌ఫార్మెన్స్ చూస్తుంటే ఇది భారతీయ సినిమా చరిత్రలోనే ఒక బెంచ్ మార్క్ మూవీగా నిలిచిపోవడం ఖాయంగా కనిపిస్తోంది. గ్లోబల్ మార్కెట్‌లో భారతీయ సినిమా రేంజ్‌ను తదుపరి స్థాయికి తీసుకెళ్లబోతున్న ఈ అద్భుత దృశ్యకావ్యం కోసం ప్రపంచవ్యాప్తంగా ఉన్న సినీ ప్రియులు ఎంతగానో ఎదురుచూస్తున్నారు.



Naresh.k

Naresh.k

2014లో జర్నలిస్ట్‌గా నా కెరీర్ ప్రారంభించాను. పలు వెబ్‌సైట్‌లలో సబ్-ఎడిటర్‌గా పని చేశాను. డిజిటల్‌ రంగాల్లో 11 ఏళ్లకు పైగా అనుభవం ఉంది. బిజినెస్, స్పోర్ట్స్, మూవీస్, నేషనల్ అండ్ ఇంటర్నేషనల్, పాలిటిక్స్ , వైరల్ న్యూస్‌కు సంబంధించిన కంటెంట్‌ను రాయగలను. ముఖ్యంగా బిజినెస్, స్పోర్ట్స్, మూవీస్, బ్రేకింగ్ న్యూస్ రాయడంలో నైపుణ్యం ఉంది.

Next Story