Ramayana Release Date: 'రామాయణ' విడుదలపై బిగ్ అప్‌డేట్.. విదేశాల్లో ముందే.. ఇండియాలో దీపావళికి రిలీజ్!

Ramayana Release Date: రణ్‌బీర్ కపూర్ 'రామాయణ' సినిమా విడుదలపై నిర్మాత నమిత్ మల్హోత్రా కీలక అప్‌డేట్ ఇచ్చారు.

Arun Chilukuri
Published on: 8 Aug 2026 2:22 PM IST
Ramayana Release Date
X

Ramayana Release Date: 'రామాయణ' విడుదలపై బిగ్ అప్‌డేట్.. విదేశాల్లో ముందే.. ఇండియాలో దీపావళికి రిలీజ్!

Ramayana Release Date: రణ్‌బీర్ కపూర్, సాయి పల్లవి ప్రధాన పాత్రల్లో నితీశ్ తివారీ దర్శకత్వంలో తెరకెక్కతున్న దృశ్యకావ్యం ‘రామాయణ’ విడుదల తేదీపై నిర్మాత నమిత్ మల్హోత్రా స్పష్టత ఇచ్చారు. ఈ సినిమా అంతర్జాతీయ మార్కెట్‌లో మరియు భారతదేశంలో వేర్వేరు తేదీల్లో థియేటర్లలోకి రానుందని వెల్లడించారు.

విదేశీ మార్కెట్లలో సినిమాల విడుదల సాధారణంగా శుక్రవారం ప్రారంభమవుతుంది. అందువల్ల అంతర్జాతీయంగా నవంబర్ 6న ఈ చిత్రాన్ని ప్రేక్షకుల ముందుకు తీసుకువస్తున్నట్లు తెలిపారు. భారతదేశంలో పండుగ సెంటిమెంట్‌ను దృష్టిలో ఉంచుకుని దీపావళి రోజైన నవంబర్ 8న వినూత్న వ్యూహంతో విడుదల చేయనున్నట్లు నమిత్ మల్హోత్రా వెల్లడించారు.

శ్రీరాముడిగా రణ్‌బీర్ కపూర్, సీతగా సాయి పల్లవి, రావణాసురుడిగా యష్, హనుమంతుడిగా సన్నీ దేవోల్, లక్ష్మణుడిగా రవి దూబే అలరించనున్నారు. ఆస్కార్ విజేతలు ఏ.ఆర్. రెహమాన్, హన్స్ జిమ్మర్ కలిసి ఈ చిత్రానికి స్వరాలు అందిస్తున్నారు. భారత్‌లో ధర్మ ప్రొడక్షన్స్ పంపిణీ బాధ్యతలు తీసుకోగా, ఓవర్సీస్ హక్కులను సోనీ పిక్చర్స్ దక్కించుకుంది. సంగీత హక్కులను టీ-సిరీస్ సంస్థ రూ. 75 కోట్లకు సొంతం చేసుకుంది.

Arun Chilukuri

Arun Chilukuri

వెబ్ జర్నలిస్ట్ గా నా కెరీర్ HMTV ద్వారా పదేళ్ల క్రితం ప్రారంభం అయింది. పదేళ్లుగా HMTV లోనే వెబ్సైట్ కు ఆర్టికల్స్ రాస్తున్నాను. దాదాపుగా అన్ని కేటగిరీల్లోనూ ముఖ్యంగా తెలంగాణ, ఆంధ్రప్రదేశ్ రాష్ట్రాల వార్తలతో పాటు వివిధ కేటగిరీల్లో అవసరాన్ని బట్టి ఆర్టికల్స్, బ్రేకింగ్ న్యూస్ ను ఇవ్వడం చేస్తున్నాను.

Next Story