Rashmi: నేను మోదీకే సపోర్టు చేస్తా..రేపిస్టులది కాదు..!
Rashmi: తన రాజకీయ మద్దతుపై, సామాజిక అంశాలపై వస్తున్న విమర్శలకు యాంకర్ రష్మీ గౌతమ్ ఘాటుగా స్పందించారు.
Rashmi
Rashmi Gautam: యాంకర్ రష్మీ గౌతమ్ అనగానే అందరికీ గుర్తొచ్చేది 'జబర్దస్త్' గ్లామర్, చలాకీ మాటలు. కానీ, తెర వెనుక ఆమెలోని మరో కోణం ఇప్పుడు సోషల్ మీడియాలో సెన్సేషన్‌గా మారింది. తన రాజకీయ మద్దతుపై వస్తున్న విమర్శలకు, తనను ట్యాగ్ చేస్తూ వేధిస్తున్న ట్రోలర్లకు రష్మీ తనదైన శైలిలో చురకలు అంటించింది. గత కొంతకాలంగా సోషల్ మీడియాలో రష్మీపై జరుగుతున్న ట్రోలింగ్‌కు ఆమె ఫుల్ స్టాప్ పెట్టాలని నిర్ణయించుకుంది. తాను ఒక రాజకీయ పార్టీకి మద్దతు ఇస్తున్నాననే కారణంతో, సమాజంలో జరిగే ప్రతి దారుణానికి తనను బాధ్యురాలిని చేస్తూ విమర్శించడంపై ఆమె ఘాటుగా స్పందించింది.
రష్మీ మాటల్లో..అవును, నేను బీజేపీకి, మోదీ జీకి మద్దతు ఇస్తాను. కానీ నా మద్దతు మోదీకి మాత్రమే.. రేపిస్టులకు లేదా లైంగిక వేధింపులకు పాల్పడేవారికి కాదు. బూతులు తిట్టేవారికి నేను సమాధానం చెప్పను. మీ ఎనర్జీని నన్ను దూషించడానికి వాడకండి అంటూ ఘాటు వ్యాఖ్యలు చేసింది. నేటి కాలంలో ఏ చిన్న సమస్య జరిగినా సెలబ్రిటీలను ట్యాగ్ చేయడం, వారు స్పందించకపోతే బూతులు తిట్టడం ఒక ట్రెండ్‌గా మారిందని రష్మీ ఆవేదన వ్యక్తం చేసింది. నటీనటులను ట్యాగ్ చేయడం వల్ల ఎలాంటి మార్పు రాదని, నిజమైన న్యాయం కావాలంటే ప్రభుత్వం మరియు న్యాయవ్యవస్థను ప్రశ్నించాలని ఆమె సూచించింది. సామాజిక సమస్యలపై తాను కేవలం సానుభూతి మాత్రమే చూపగలనని, ప్రతి దాని కోసం క్షేత్రస్థాయిలో పోరాడడం సాధ్యం కాదని కుండబద్ధలు కొట్టింది.
రష్మీ గౌతమ్ వ్యక్తిత్వంలో అందరినీ ఆకట్టుకునే అంశం ఆమె జంతు ప్రేమికురాలు కావడం. మనుషుల సమస్యల గురించి మాట్లాడటానికి కోట్లాది గొంతులు ఉన్నాయని, కానీ ఏమీ చెప్పలేని మూగజీవాల కోసం తాను అండగా నిలబడతానని ఆమె స్పష్టం చేసింది. స్ట్రీట్ డాగ్స్ మాస్ కిల్లింగ్‌పై గతంలో రేణూ దేశాయ్‌తో కలిసి పోరాటం చేసింది. ఇటీవల తిరుపతిలో ఎద్దుల బండిపై ఆటోను ఎక్కించి హింసించడాన్ని ఆమె తీవ్రంగా ఖండించింది. ఈ క్రమంలోనే వైసీపీ నేతలపై విమర్శలు రావడంతో రాజకీయ రంగు పులుముకుంది.
బుల్లితెరపై గ్లామరస్ డ్రెస్సులతో అలరించే రష్మీ, నిజ జీవితంలో సమాజం పట్ల ఎంతటి బాధ్యతగా ఉంటుందో ఆమె పోస్టులు నిరూపిస్తున్నాయి. సామాజిక అంశాలపై స్పందించినప్పుడు వచ్చే విమర్శలను చూసి భయపడకుండా, తన అభిప్రాయాలను నిర్భయంగా చెప్పడం రష్మీ ప్రత్యేకత.
Yes I Support BJP ( Modi Ji )
— rashmi gautam (@rashmigautam27) May 10, 2026
NOT rapists or molesters
And I will also not respond or reply to abusive posts
Also I have repeatedly said this
I can only sympathise on issues
but can’t fight for all of them
And issues related to humans have tons of voices
I stand and…




