Rashmika: ‘నేను రష్మిక మందన్న దేవరకొండలా మాట్లాడుతున్నా’

Rashmika: ‘ది దేవరకొండ ఫౌండేషన్’ ఆధ్వర్యంలో 2026 విద్యా సంవత్సరానికి గానూ సరికొత్త సామాజిక కార్యక్రమానికి శ్రీకారం చుట్టారు.

Srinivas Rao
Published on: 14 Jun 2026 6:54 PM IST
Rashmika
X

Rashmika: ‘నేను రష్మిక మందన్న దేవరకొండలా మాట్లాడుతున్నా’

Rashmika: రౌడీ హీరో విజయ్ దేవరకొండ, ఆయన సతీమణి రష్మిక మందన్న సంయుక్తంగా తమ ‘ది దేవరకొండ ఫౌండేషన్’ ఆధ్వర్యంలో 2026 విద్యా సంవత్సరానికి గానూ సరికొత్త సామాజిక కార్యక్రమానికి శ్రీకారం చుట్టారు. తెలంగాణలోని అచ్చంపేట డివిజన్ పరిధిలోని ప్రభుత్వ పాఠశాలల్లో చదువుతూ అత్యుత్తమ ప్రతిభ కనబరిచిన విద్యార్థుల కోసం ‘మెరిట్ స్కాలర్‌షిప్ అవార్డీస్’ జాబితాను వారు అధికారికంగా విడుదల చేశారు.

నాన్న పుట్టిన ఊరిలో ప్రతిభా పురస్కారాలు

గత ఫిబ్రవరి నెలలో ఈ స్టార్ జంట ప్రకటించిన ఒక చిన్న కల ఇప్పుడు నిజమైంది. విజయ్ దేవరకొండ తన తండ్రి జన్మించిన స్వగ్రామమైన అచ్చంపేట మండలం తుమ్మనపేటకు రష్మికతో కలిసి చేరుకున్నారు. అక్కడి ప్రభుత్వ పాఠశాలల్లో 9 , 10వ తరగతుల్లో అత్యుత్తమ మార్కులు సాధించి ప్రథమ, ద్వితీయ స్థానాల్లో నిలిచిన 180 మంది విద్యార్థులకు ఈ ప్రత్యేక ఉపకారవేతనాలను విజయ్ స్వహస్తాలతో అందజేశారు. ముఖ్యంగా జడ్పీహెచ్‌ఎస్ తుమ్మన్‌పేట పాఠశాల నుంచి 9వ తరగతిలో బి. హేమలత (మొదటి ర్యాంక్), పి. ప్రణీత (రెండో ర్యాంక్) స్కాలర్‌షిప్ సాధించారు. అలాగే 10వ తరగతిలో కె. గణేష్ (మొదటి ర్యాంక్), బి. అనిల్ (రెండో ర్యాంక్) ఈ అవార్డులను దక్కించుకోవడం విశేషం.

రష్మిక మందన్న దేవరకొండగా ప్రసంగం..

ఈ అవార్డుల ప్రధానోత్సవ వేదికపై రష్మిక మందన్న ఇచ్చిన స్పీచ్ ప్రస్తుతం అంతటా సంచలనంగా మారింది. మైక్ అందుకున్న ఆమె మాట్లాడుతూ, “ఈరోజు నేను ఇక్కడ రష్మిక మందన్న దేవరకొండలా మాట్లాడుతున్నాను. మన జీవితంలో కొన్నిసార్లు గెలుస్తాం, కొన్నిసార్లు ఓడిపోతాం.. కానీ ప్రతి అనుభవం నుండి ఏదో ఒకటి నేర్చుకుంటాం. మీరంతా మీ తల్లిదండ్రులు, ఉపాధ్యాయుల నుండి మంచి విషయాలను నేర్చుకుని భవిష్యత్తులో గొప్పగా ఎదగాలి” అని విద్యార్థులకు హితబోధ చేశారు. వివాహం తర్వాత ఆమె తన పేరును ‘రష్మిక మందన్న దేవరకొండ’గా పేర్కొనడం , ఆమె చెప్పిన స్ఫూర్తిదాయకమైన మాటలు ఇప్పుడు సామాజిక మాధ్యమాల్లో విపరీతంగా ట్రెండ్ అవుతున్నాయి.

వెండితెరపైన.. నిజ జీవితంలోనూ అద్భుత బంధం

ప్రస్తుతం విజయ్ దేవరకొండ, రష్మిక మందన్న జంటగా ‘రణబాలి’అనే ప్రతిష్టాత్మక చిత్రంలో నటిస్తున్నారు. వివాహం తర్వాత వీరిద్దరి కలయికలో వస్తున్న మొదటి సినిమా ఇదే కావడం విశేషం. ఒకవైపు సినిమా రంగంలో వరుస ప్రాజెక్టులతో బిజీగా ఉంటూనే, మరోవైపు సమాజం పట్ల బాధ్యతతో తమ సొంత గ్రామంలోని ప్రభుత్వ పాఠశాల విద్యార్థుల చదువుకు అండగా నిలవడంపై సర్వత్రా హర్షం వ్యక్తమవుతోంది. ఈ సేవా కార్యక్రమం ద్వారా ఈ స్టార్ జంట కేవలం రీల్ లైఫ్ లోనే కాకుండా రియల్ లైఫ్ లో కూడా ఆదర్శ దంపతులుగా నిలిచారు.

Srinivas Rao

Srinivas Rao

శ్రీనివాస్ రావు జర్నలిజం రంగంలో దశాబ్దానికి పైగా అనుభవం కలిగిన కంటెంట్ రైటర్, సబ్ ఎడిటర్. రాజకీయాలు, ప్రాంతీయ, జాతీయ, అంతర్జాతీయ, లైఫ్ స్టైల్, క్రైమ్ వంటి విభిన్న అంశాల్లో లోతైన అవగాహనతో స్పష్టమైన, పాఠకులకు సులభంగా అర్థమయ్యే శైలిలో వార్తలను అందిస్తున్నారు. ప్రముఖ మీడియా సంస్థలు అయిన ఈనాడు, ఆంధ్రజ్యోతి, ఏపీ7 ఏఎంలో పనిచేసి విలువైన అనుభవాన్ని సంపాదించారు. విశ్లేషణాత్మక దృక్పథంతో వార్తలకు కొత్త కోణాన్ని జోడిస్తూ పాఠకుల విశ్వాసాన్ని పొందుతున్నారు.

Next Story