Rashmika: రష్మికకు అరుదైన గౌరవం.. తొలి భారతీయ సినీ సెలబ్రిటీగా గుర్తింపు
Rashmika: పాన్ ఇండియా సినీ ప్రపంచంలో తనకంటూ ప్రత్యేక గుర్తింపు సంపాదించిన నటి రష్మిక మందన్నా మరోసారి వార్తల్లో నిలిచారు.
Rashmika: రష్మికకు అరుదైన గౌరవం.. తొలి భారతీయ సినీ సెలబ్రిటీగా గుర్తింపు
Rashmika: పాన్ ఇండియా సినీ ప్రపంచంలో తనకంటూ ప్రత్యేక గుర్తింపు సంపాదించిన నటి రష్మిక మందన్నా మరోసారి వార్తల్లో నిలిచారు. ఓవైపు సినిమాలు, మరోవైపు వ్యక్తిగత జీవితంలో సక్సెస్‌ను లీడ్ చేస్తున్న రష్మికకు తాజాగా మరో అంతర్జాతీయ గౌరవం లభించింది.
రష్మిక మందన్నా సినీ ఇండస్ట్రీలోకి ఎలాంటి కుటుంబ నేపథ్యం లేకుండా అడుగుపెట్టింది. కానీ తన ప్రతిభ, కష్టంతో తక్కువ కాలంలోనే స్టార్ హీరోయిన్‌గా ఎదిగింది. తెలుగు, తమిళం, హిందీ భాషల్లో వరుసగా సినిమాలు చేస్తూ ప్రేక్షకుల మనసు గెలుచుకుంది. తన సహజమైన నటన, ఆకట్టుకునే వ్యక్తిత్వంతో యువతలో ప్రత్యేక క్రేజ్ సంపాదించింది. అందుకే అభిమానులు ఆమెను ప్రేమగా “నేషనల్ క్రష్” అని పిలుస్తుంటారు.
వైవాహిక జీవితంలో కొత్త అధ్యాయం
వ్యక్తిగత జీవితంలో కూడా రష్మిక కొత్త ప్రయాణం ప్రారంభించింది. చాలాకాలంగా హీరో విజయ్ దేవరకొండతో ప్రేమలో ఉన్న ఆమె, ఈ ఏడాది కుటుంబ సభ్యుల సమక్షంలో వివాహం చేసుకున్న విషయం తెలిసిందే. కాగా వివాహం తర్వాత రష్మిక కెరీర్‌లో అరుదైన గౌరవం లభించింది. జపాన్‌లో నిర్వహించే ప్రతిష్టాత్మక క్రంచీరోల్ యానిమే అవార్డ్స్ కార్యక్రమంలో ఆమెకు ప్రెజంటర్‌గా వ్యవహరించే అవకాశం వచ్చింది. ఇది వరుసగా రెండోసారి ఆమెకు దక్కిన గౌరవం. ఇప్పటికే 2024లో కూడా ఈ వేడుకలో పాల్గొని ప్రపంచ ప్రేక్షకుల దృష్టిని ఆకర్షించింది. ఇప్పుడు మరోసారి అదే వేదికపై కనిపించనుంది.
రెండు సార్లు ఈ గౌరవం పొందిన తొలి భారతీయ సెలబ్రిటీ
రష్మిక ఈ అవకాశంతో మరో ప్రత్యేక రికార్డు కూడా సృష్టించింది. క్రంచీరోల్ యానిమే అవార్డ్స్‌లో రెండుసార్లు ప్రెజంటర్‌గా పాల్గొన్న తొలి భారతీయ సినీ ప్రముఖురాలుగా నిలిచింది. యానిమేటెడ్ సినిమాలు, వెబ్ సిరీస్‌లలో ప్రతిభ చూపిన వారికి అందించే ఈ అవార్డుల 10వ ఎడిషన్ కార్యక్రమం మే 23న టోక్యోలో జరగనుంది. ఈ వేడుకలో హాలీవుడ్ ప్రముఖులతో కలిసి రష్మిక విజేతలకు అవార్డులు అందజేయనుంది.
ఇదిలా ఉంటే రష్మికకు జపాన్‌లో కూడా మంచి అభిమాన వర్గం ఉంది. ముఖ్యంగా ‘పుష్ప’ సినిమాలో శ్రీవల్లి పాత్ర ఆమెకు అక్కడ భారీ గుర్తింపు తీసుకొచ్చింది. ఇటీవల యానిమల్, పుష్ప 2, కుబేర, గర్ల్‌ఫ్రెండ్, తమ్మ వంటి చిత్రాలతో ప్రేక్షకులను ఆకట్టుకుంది. ప్రస్తుతం ఆమె మైసా, రణబాలి అనే సినిమాల్లో నటిస్తోంది. రణబాలి చిత్రంలో మరోసారి విజయ్ దేవరకొండ – రష్మిక జంటగా కనిపించనున్నారు. గతంలో వీరిద్దరి కాంబినేషన్‌లో వచ్చిన గీతా గోవిందం, డియర్ కామ్రేడ్ సినిమాలు మంచి విజయాన్ని సాధించాయి. అందుకే ఈ కొత్త సినిమాపై కూడా అభిమానుల్లో ఆసక్తి పెరిగింది. అందులోనూ వివాహం తర్వాత ఈ జంట తెరపై కలిసి కనిపించడం ఇదే తొలిసారి కావడం విశేషం.




