Rashmika Mandanna : రష్మిక ‘మైసా’ వచ్చేది అప్పుడే.. డేట్ ఫిక్స్.!
Rashmika Mandanna : నేషనల్ క్రష్ రష్మిక మందన్న లీడ్ రోల్‌లో నటిస్తున్న మోస్ట్ అవైటెడ్ లేడీ ఓరియెంటెడ్ ఫిల్మ్ ‘మైసా’ (Mysaa) నుంచి మైండ్ బ్లావింగ్ అప్‌డేట్
rashmika mandanna mysaa
Rashmika Mandanna : నేషనల్ క్రష్ రష్మిక మందన్న లీడ్ రోల్‌లో నటిస్తున్న మోస్ట్ అవైటెడ్ లేడీ ఓరియెంటెడ్ ఫిల్మ్ ‘మైసా’ (Mysaa) నుంచి మైండ్ బ్లావింగ్ అప్‌డేట్ బయటకు వచ్చింది. అన్‌ఫార్ములా ఫిల్మ్స్ బ్యానర్‌పై పాన్ ఇండియా స్థాయిలో భారీ బడ్జెట్‌తో తెరకెక్కుతున్న ఈ యాక్షన్ అండ్ ఎమోషనల్ డ్రామా రిలీజ్ డేట్‌ను మేకర్స్ అఫీషియల్‌గా అనౌన్స్ చేశారు. వరల్డ్‌వైడ్‌గా ఈ సినిమాను 2026 నవంబర్ 27న గ్రాండ్‌గా థియేటర్లలో రిలీజ్ చేయబోతున్నట్లు చిత్ర యూనిట్ సోషల్ మీడియా వేదికగా ప్రకటించింది.
టాలెంట్ ఉన్న డైరెక్టర్.. గ్రాండ్ ప్రొడక్షన్ వాల్యూస్
ఈ సినిమా ద్వారా టాలెంటెడ్ డైరెక్టర్ రవీంద్ర పుల్లె టాలీవుడ్‌కి దర్శకుడిగా పరిచయం కాబోతున్నాడు. బ్లాక్‌బస్టర్ డైరెక్టర్ హను రాఘవపూడి దగ్గర అసిస్టెంట్ డైరెక్టర్‌గా పనిచేసిన ఎక్స్‌పీరియన్స్ ఉన్న రవీంద్ర, 'మైసా'ను ఒక సరికొత్త కాన్సెప్ట్‌తో మలచుతున్నాడు. ఇక గతంలో ఎన్నో సూపర్ హిట్ చిత్రాలను అందించిన అజయ్ , అనిల్ సయ్యపురెడ్డి ఈ సినిమాను ఎక్కడా కాంప్రమైజ్ కాకుండా నిర్మిస్తుండగా, సాయి గోపా కో-ప్రొడ్యూసర్‌గా వ్యవహరిస్తున్నారు. ఇప్పటికే రిలీజైన ఈ మూవీ పాన్ ఇండియా గ్లింప్స్‌కు ఆడియన్స్ నుంచి మైండ్ బ్లోయింగ్ రెస్పాన్స్ వచ్చింది.
గాయం నుంచి రికవరీ.. జెట్ స్పీడ్‌తో షూటింగ్ స్టార్ట్..!
ఇటీవల షూటింగ్ సమయంలో రష్మికకు చిన్న ఇంజ్యూరీ కావడంతో మేకర్స్ షూటింగ్‌కు తాత్కాలికంగా బ్రేక్ ఇచ్చారు. అయితే ప్రస్తుతం గాయం నుంచి కంప్లీట్‌గా కోలుకున్న రష్మిక, త్వరలోనే మైసా కొత్త షెడ్యూల్ సెట్స్‌లో అడుగుపెట్టనుంది. ఆమె జాయిన్ అయిన వెంటనే ఎలాంటి గ్యాప్ లేకుండా జెట్ స్పీడ్‌లో మిగతా టాకీ పార్ట్ అండ్ యాక్షన్ సీక్వెన్సెస్‌ను ఫినిష్ చేసేలా డైరెక్టర్ ప్లాన్ చేశారు.
రష్మిక కెరీర్‌లోనే మైలురాయిలా 'మైసా'.?
ఈ సినిమాలో రష్మిక నటన, ఆమె లుక్ , క్యారెక్టర్‌లో ఉన్న వేరియేషన్స్ ఆడియన్స్‌ను కట్టిపడేస్తాయని ఇన్సైడ్ టాక్. మునుపెన్నడూ చూడని డిఫరెంట్ షేడ్స్‌లో రష్మిక ఈ రోల్‌ను పోషిస్తోంది. ఒక పవర్‌ఫుల్ అండ్ వినూత్నమైన కథాంశంతో వస్తున్న ఈ పాన్ ఇండియా మూవీ 2026 నవంబర్ 27న బాక్సాఫీస్ వద్ద ఎలాంటి రికార్డులు క్రియేట్ చేస్తుందో వేచి చూడాలి.




