Rashmika Mandanna: 24 గంటల గడువిస్తున్నా, ఆపై నోటీసులు జారీ చేస్తా.. కొత్త పెళ్లి కూతురు రష్మిక వార్నింగ్!

Rashmika Mandanna: సోషల్ మీడియాలో కొంతకాలంగా తనపై వస్తున్న తప్పుడు ప్రచారాలు, వ్యక్తిగత దూషణలపై స్టార్ హీరోయిన్ రష్మిక మందన్న ఘాటుగా స్పందించారు. గత ఎనిమిదేళ్లుగా తనపై కొన్ని మీడియా సంస్థలు, సోషల్ మీడియాలోని కొందరు వ్యక్తులు అసత్య కథనాలు ప్రచురిస్తున్నారని మండిపడ్డారు.

Rishvik
Published on: 12 March 2026 8:19 PM IST
Rashmika Mandanna
X

Rashmika Mandanna: 24 గంటల గడువిస్తున్నా, ఆపై నోటీసులు జారీ చేస్తా.. కొత్త పెళ్లి కూతురు రష్మిక వార్నింగ్!

Rashmika Mandanna: సోషల్ మీడియాలో కొంతకాలంగా తనపై వస్తున్న తప్పుడు ప్రచారాలు, వ్యక్తిగత దూషణలపై స్టార్ హీరోయిన్ రష్మిక మందన్న ఘాటుగా స్పందించారు. గత ఎనిమిదేళ్లుగా తనపై కొన్ని మీడియా సంస్థలు, సోషల్ మీడియాలోని కొందరు వ్యక్తులు అసత్య కథనాలు ప్రచురిస్తున్నారని మండిపడ్డారు. తన మాటలను తప్పుగా చూపించడం, తాను అనని మాటలను కూడా ప్రచారం చేస్తున్నారని ఆవేదన వ్యక్తం చేశారు. తన పాత ప్రైవేట్‌ ఆడియోను లీక్‌ చేశారని.. తన ఫ్యామిలీ ప్రైవసీని దెబ్బతీస్తున్నారన్నారు. సోషల్‌ మీడియా నుంచి 24 గంటల్లో ఆ కంటెంట్‌ తొలగించాలని, లేదంటే చట్టపరమైన చర్యలు తీసుకుంటా అని రష్మిక వార్నింగ్ ఇచ్చారు.

ముఖ్యంగా కన్నడ మీడియా, ఇన్‌ప్లూయెన్సర్లపై కొత్త పెళ్లి కూతురు రష్మిక మండిపడుతూ.. తన ఎక్స్ ఖాతాలో సుదీర్ఘ పోస్ట్ చేశారు. '8 ఏళ్లుగా నాపై తప్పుడు ప్రచారం చేస్తున్నారు. నా మాటలను వక్రీకరించి నా వ్యక్తిగత ప్రతిష్టను దెబ్బతీస్తున్నారు. నేను మాట్లాడని పదాలతో కొంతమంది వార్తలు రాస్తున్నారు. ఈ తప్పుడు ప్రచారం నన్నెంతో బాధపెట్టినప్పటికీ.. ఇంతకాలం ఎంతో సహనంతో ఉన్నాను. నేను నటిని కాబట్టి విమర్శలు సహజమేనని భావించి నిశ్శబ్దంగా ఉన్నా. 8 ఏళ్ల కిందటి ఒక ప్రైవేటు సంభాషణలోని కొంత భాగాన్ని ఉద్దేశపూర్వకంగా తప్పుడు ప్రచారం చేస్తున్నారు. గడిచిన 24 గంటల్లో నాపై దుష్ప్రచారం చేశారు. నా వ్యక్తిగత గోప్యతపై తీవ్రమైన దాడి చేస్తూ పరువు నష్టం కలిగిస్తున్నారు' అని రష్మిక పేర్కొన్నారు.

'దుష్ప్రచారాల ద్వారా నా కుటుంబ సభ్యులు, నాకు సన్నిహితంగా ఉన్న వ్యక్తులు కూడా బాధపడుతున్నారు. నా వ్యక్తిగత గోప్యతపై తీవ్ర ప్రభావం చూపుతోంది. ఇలా చేయడం చాలా బాధాకరం. ఇంతకాలం ఇవన్నీ నాకే పరిమితమై ఉండటంతో మౌనం పాటించా. కానీ ఇప్పుడు కుటుంబ సభ్యులను కూడా లాగుతున్నారు. ఇక మౌనంగా ఉండలేను. సోషల్ మీడియా, ఇన్ ప్లూయెన్సర్లు వెంటనే తప్పుడు కథనాలను తొలగించాలి. అందుకు 24 గంటల గడువు ఇస్తున్నా. ఆపై సంబంధిత వ్యక్తులపై చట్టపరమైన చర్యలు తీసుకుంటా. నోటీసులు జారీ చేస్తాను. ఇది తేలికగా తీసుకున్న నిర్ణయం కాదు. నా గౌరవం, గోప్యతను కాపాడుకునేందుకే ఈ చర్యలు. నా జీవితం ఎలా ఉండాలో మీరెలా నిర్ణయిస్తారు. మన జీవితాలు మనవి, మనమే నిర్ణయాలు తీసుకోవాలి' అని రష్మిక ఫైర్ అయ్యారు. రష్మిక ఇటీవలే హీరో విజయ్ దేవరకొండను వివాహం చేసుకున్న విషయం తెలిసిందే.

Rishvik

Rishvik

Next Story