ఓటీటీలో దూసుకెళ్తున్న రవిబాబు 'రేజర్'!
టాలీవుడ్ వెర్సటైల్ డైరెక్టర్ ,నటుడు రవిబాబు దర్శకత్వంలో వచ్చిన డార్క్ యాక్షన్ థ్రిల్లర్ 'రేజర్'. మే 8, 2026న థియేటర్లలో విడుదలైన ఈ చిత్రం బాక్సాఫీస్ వద్ద ఆశించిన స్థాయిలో సత్తా చాటలేకపోయింది. అయితే, తాజాగా డిజిటల్ ప్లాట్‌ఫామ్‌ల విస్తరణతో ఈ చిత్రం మరోసారి వార్తల్లో నిలిచింది.
ఓటీటీలో దూసుకెళ్తున్న రవిబాబు 'రేజర్'!
రేజర్: టాలీవుడ్ వెర్సటైల్ డైరెక్టర్ ,నటుడు రవిబాబు దర్శకత్వంలో వచ్చిన డార్క్ యాక్షన్ థ్రిల్లర్ 'రేజర్'. మే 8, 2026న థియేటర్లలో విడుదలైన ఈ చిత్రం బాక్సాఫీస్ వద్ద ఆశించిన స్థాయిలో సత్తా చాటలేకపోయింది. అయితే, తాజాగా డిజిటల్ ప్లాట్‌ఫామ్‌ల విస్తరణతో ఈ చిత్రం మరోసారి వార్తల్లో నిలిచింది. ఇప్పటికే ప్రముఖ తెలుగు ఓటీటీ 'ఆహా'లో స్ట్రీమింగ్ అవుతున్న ఈ చిత్రం, తాజాగా ఇప్పుడు అమెజాన్ ప్రైమ్ వీడియోలో కూడా అందుబాటులోకి వచ్చింది.
కథాంశం: ఓ చిన్నారి ప్రాణాలను కాపాడే పోరాటం
ఈ సినిమా కథ ఒక సీసీటీవీ ఫుటేజ్ చుట్టూ తిరుగుతుంది. హోంమంత్రి చేసిన ఘోరమైన హత్యకు సంబంధించిన దృశ్యాలు అనుకోకుండా ఒక సాధారణ వ్యక్తి (తనీష్) కెమెరాలో రికార్డ్ అవుతాయి. సాక్ష్యాలు బయటపడతాయని భయపడిన హోంమంత్రి, ఆ వ్యక్తిని చంపేయిస్తాడు. అయితే, తన తండ్రి మరణాన్ని కళ్లారా చూసిన చిన్నారి తేజును కాపాడే బాధ్యతను, డాగ్స్‌ను రక్షించే 'రేజర్' (రవిబాబు) తీసుకుంటాడు. అసలు రేజర్ ఆ చిన్నారిని ఎందుకు కాపాడాలనుకున్నాడు? తనీష్ పాత్రకు, రేజర్‌కు ఉన్న సంబంధం ఏంటి? అన్నదే ఈ ఉత్కంఠభరితమైన కథ.
చిత్ర విశేషాలు
రవిబాబుతో పాటు తనీష్, ఇనయ సుల్తానా, మీనా వాసు, చైల్డ్ ఆర్టిస్ట్ తేజల్ విఖ్యాతి కీలక పాత్రల్లో నటించారు. ఫ్లయింగ్ ఫ్రాంగ్స్ ప్రొడక్షన్ బ్యానర్‌పై రవిబాబు , డి. సురేష్ బాబు సంయుక్తంగా ఈ చిత్రాన్ని నిర్మించారు. ఎస్.ఎస్. రాజేష్ అందించిన నేపథ్య సంగీతం ఈ సినిమాకు ప్రధాన ఆకర్షణగా నిలిచింది.
తొలుత 'ఆహా'లో విడుదలైన ఈ 'ఏ' సర్టిఫైడ్ మూవీ, ఇప్పుడు అమెజాన్ ప్రైమ్ వీడియోలో కూడా స్ట్రీమింగ్ అవుతోంది.
థియేటర్లలో మిక్స్‌డ్ టాక్ పొందినప్పటికీ, ఈ 'డార్క్ యాక్షన్ థ్రిల్లర్' ఓటీటీ ప్రేక్షకులను, ముఖ్యంగా యాక్షన్ సినిమాలను ఇష్టపడే వారిని అలరిస్తుందని చిత్రబృందం భావిస్తోంది. రవిబాబు మార్క్ మేకింగ్‌తో వచ్చిన ఈ చిత్రాన్ని అమెజాన్ ప్రైమ్ వీడియోలో ఇప్పుడు మీరు చూడవచ్చు.




