Lenin: అఖిల్ అక్కినేని 'లెనిన్' విడుదల మరోసారి వాయిదా.. కారణం ఇదేనా !

Lenin: అక్కినేని అఖిల్ కథానాయకుడిగా నటిస్తున్న అత్యంత ప్రతిష్టాత్మక చిత్రం 'లెనిన్' విడుదల మూడోసారి వాయిదా పడింది.

Srinivas Rao
Published on: 14 Jun 2026 11:50 AM IST
Lenin
X

Lenin: అఖిల్ అక్కినేని 'లెనిన్' విడుదల మరోసారి వాయిదా.. కారణం ఇదేనా !

Lenin: అక్కినేని అఖిల్ కథానాయకుడిగా నటిస్తున్న అత్యంత ప్రతిష్టాత్మక చిత్రం 'లెనిన్' విడుదల మూడోసారి వాయిదా పడింది. మురళి కిషోర్ అబ్బురు దర్శకత్వంలో, భాగ్యశ్రీ బోర్సే కథానాయికగా తెరకెక్కుతున్న ఈ యాక్షన్ డ్రామా జూన్ 26న ప్రేక్షకుల ముందుకు రావాల్సి ఉంది. అయితే, ఈ చిత్రాన్ని జూలై 10వ తేదీన ప్రపంచవ్యాప్తంగా విడుదల చేయనున్నట్లు చిత్రబృందం అధికారికంగా ప్రకటించింది.

నాణ్యత కోసమే వాయిదా నిర్ణయం.. అక్కినేని నాగార్జున వెల్లడి

మనం ఎంటర్‌ప్రైజెస్ ఎల్‌ఎల్‌పి , సితార ఎంటర్‌టైన్‌మెంట్స్ పతాకాలపై అక్కినేని నాగార్జున, సూర్యదేవర నాగవంశీ సంయుక్తంగా నిర్మిస్తున్న ఈ చిత్రంపై ఇండస్ట్రీలో భారీ అంచనాలు ఉన్నాయి. ప్రేక్షకులకు ఒక అద్భుతమైన థియేట్రికల్ అనుభూతిని అందించాలనే ఉద్దేశంతోనే చిత్ర విడుదల తేదీని ముందుకు జరిపినట్లు నిర్మాతలు తెలిపారు. ఈ కొత్త విడుదల తేదీని అక్కినేని నాగార్జున తన అధికారిక సామాజిక మాధ్యమ ఖాతా ద్వారా స్వయంగా ప్రకటించారు. చిత్ర యూనిట్ తమ వంద శాతం శ్రమను పెట్టి, మరింత మెరుగైన ఔట్‌పుట్ ఇవ్వడం కోసమే అదనపు సమయం అడిగిందని ఆయన పేర్కొన్నారు.

సరికొత్త అవతారంలో మనోడు.. అభిమానుల్లో పెరిగిన జోష్

ఈ వాయిదా ప్రకటనపై నాగార్జున స్పందిస్తూ, "లెనిన్ చిత్రబృందం నన్ను ఒక చిన్న విజ్ఞప్తితో సంప్రదించింది. వారు తమ పూర్తి సామర్థ్యాన్ని ఉపయోగించి, సినిమాను మరింత ప్రత్యేకంగా మలిచేందుకు మరికొంత సమయం కావాలని కోరారు. వారిలో ఉన్న పట్టుదల, ఉత్సాహం చూసి నేను అందుకు అంగీకరించాను. మనోడు జూలై 10వ తేదీన థియేటర్లలోకి వస్తున్నాడు. నేను ఈ మాట మరోసారి చెప్తున్నాను.. ఈ సినిమాలో మీరు సరికొత్త అఖిల్‌ను చూస్తారు. లెనిన్ అనుభూతికి సిద్ధంగా ఉండండి" అని ట్వీట్ చేశారు. ఈ ప్రకటనతో అఖిల్ అక్కినేనిని ఒక విభిన్నమైన పాత్రలో చూడబోతున్నామని అభిమానులు ఎంతో ఆసక్తిగా ఎదురుచూస్తున్నారు.

ఇప్పటివరకు ఈ సినిమా నుండి విడుదలైన పోస్టర్లు, గ్లింప్స్ , పాటలు ప్రేక్షకులలో మంచికుతూహలాన్ని రేకెత్తించాయి.

క్లైమాక్స్ రీషూట్ , పెరిగిన అంచనాలు

అక్కినేని యంగ్ హీరో అఖిల్ ప్రస్తుతం చేస్తున్న ఈ సినిమా విడుదల జూలై 10వ తేదీకి వాయిదా పడటం వెనుక అసలు కారణం ఇప్పుడు ఫిలిం నగర్ వర్గాల్లో ఆసక్తికరంగా మారింది. ఈ సినిమా విడుదలను సడెన్ గా వాయిదా వేయడానికి ప్రధాన కారణం క్లైమాక్స్ సీన్స్ రీషూట్ అని తెలుస్తోంది. నాగార్జున ఇచ్చిన కీలక సలహాలకు అనుగుణంగా క్లైమాక్స్ లో కొన్ని డైలాగ్స్ , సీన్స్ ను మళ్లీ చిత్రీకరిస్తున్నారట. ఈ ప్రత్యేక షూట్ లో అఖిల్ తో పాటు మిగిలిన ముఖ్య తారాగణం కూడా పాల్గొంటున్నట్లు సమాచారం.

ఈ సినిమాలో అందాల భామ భాగ్యశ్రీ బోర్సే హీరోయిన్ గా నటిస్తుండగా, ముఖ్యంగా అఖిల్ , భాగ్యశ్రీ కలయికలో వచ్చే ప్రేమ సన్నివేశాలు చాలా అద్భుతంగా వచ్చాయని టాక్ వినిపిస్తోంది. ఈ సినిమా అవుట్ ఫుట్ పై చిత్ర యూనిట్ తో పాటు అఖిల్ కూడా చాలా నమ్మకంగా ఉన్నాడు. పరిశ్రమలో మంచి హైప్ ఉన్న ఈ చిత్రంతో అఖిల్ కెరీర్ లోనే అతిపెద్ద విజయాన్ని అందుకుంటాడో లేదో చూడాలి.

Srinivas Rao

Srinivas Rao

శ్రీనివాస్ రావు జర్నలిజం రంగంలో దశాబ్దానికి పైగా అనుభవం కలిగిన కంటెంట్ రైటర్, సబ్ ఎడిటర్. రాజకీయాలు, ప్రాంతీయ, జాతీయ, అంతర్జాతీయ, లైఫ్ స్టైల్, క్రైమ్ వంటి విభిన్న అంశాల్లో లోతైన అవగాహనతో స్పష్టమైన, పాఠకులకు సులభంగా అర్థమయ్యే శైలిలో వార్తలను అందిస్తున్నారు. ప్రముఖ మీడియా సంస్థలు అయిన ఈనాడు, ఆంధ్రజ్యోతి, ఏపీ7 ఏఎంలో పనిచేసి విలువైన అనుభవాన్ని సంపాదించారు. విశ్లేషణాత్మక దృక్పథంతో వార్తలకు కొత్త కోణాన్ని జోడిస్తూ పాఠకుల విశ్వాసాన్ని పొందుతున్నారు.

Next Story