Regina Cassandra: అతనితో నా బంధం ముగిసింది..వ్యక్తిగత జీవితంపై రెజీనా షాకింగ్ కామెంట్స్..!
Regina Cassandra: నటి రెజీనా కసాండ్రా వ్యక్తిగత జీవితంపై సంచలన వ్యాఖ్యలు చేశారు.
Regina Cassandra: అతనితో నా బంధం ముగిసింది..వ్యక్తిగత జీవితంపై రెజీనా షాకింగ్ కామెంట్స్..!
Regina Cassandra breakup: గ్లామరస్ రోల్స్ మాత్రమే కాకుండా, నటనకు ప్రాధాన్యం ఉన్న పాత్రలతో అలరించే నటి రెజీనా కసాండ్రా. ఇటీవల ఆమె చేసిన వ్యాఖ్యలు ఇప్పుడు నెట్టింట తీవ్ర చర్చనీయాంశంగా మారాయి. సుందర్ సి దర్శకత్వంలో, నయనతార ప్రధాన పాత్రలో రూపుదిద్దుకుంటున్న ‘మూకుత్తి అమ్మన్-2’ చిత్రంలో రెజీనా కీలక పాత్ర పోషిస్తున్నారు. ఈ సినిమా ప్రమోషన్లలో భాగంగా ఇచ్చిన ఓ ఇంటర్వ్యూలో తన వ్యక్తిగత జీవితం గురించి ఆమె పంచుకున్న చేదు అనుభవాలు నెటిజన్లను కలిచివేస్తున్నాయి.
ఈ ఇంటర్వ్యూలో రెజీనా తన జీవితంలోని ఒక చీకటి కోణాన్ని బయటపెట్టారు. 2020లో తన ప్రేమబంధం ముగిసిందని చెబుతూ ఆ సమయంలో తాను ఎదుర్కొన్న నమ్మకద్రోహం తనను తీవ్రంగా కలిచివేసిందని వెల్లడించారు. నమ్మినవాళ్లే మోసం చేయడంతో మానసికంగా పూర్తిగా కుంగిపోయాను. ఆ బాధ నుంచి బయటపడటం నాకు చాలా పెద్ద సవాలుగా మారింది. ఎంతో తీవ్రమైన మానసిక సంఘర్షణను అనుభవించాను అంటూ తన హృదయవేదనను పంచుకున్నారు.
ఆ పీడకల లాంటి రోజుల తర్వాత రెజీనా ఒక దృఢమైన నిర్ణయం తీసుకున్నారు. ప్రేమ, పెళ్లి వంటి బంధాలకు కొంతకాలం పాటు పూర్తిగా దూరంగా ఉండాలని నిర్ణయించుకున్నారు. తనను తాను ప్రేమించుకోవడం, తన సొంత వ్యక్తిత్వంపై దృష్టి పెట్టడం మొదలుపెట్టారు.ఆ మానసిక వేదన నుంచి కోలుకోవడానికి సమయం తీసుకుని, మళ్లీ రెట్టింపు ఉత్సాహంతో కెరీర్‌పై దృష్టి సారించారు.
ప్రస్తుతం తన ప్రపంచం మొత్తం సినిమాలేనని, వైవిధ్యమైన పాత్రలతో ప్రేక్షకులను అలరించడమే తన లక్ష్యమని ఆమె స్పష్టం చేశారు. ఒకవైపు పర్సనల్ లైఫ్‌లో ఎదురైన దెబ్బకు కుంగిపోకుండా, మళ్లీ తన కాళ్లపై తాను నిలబడి కెరీర్‌లో ముందుకు సాగుతున్న రెజీనా ధైర్యాన్ని ఆమె అభిమానులు, నెటిజన్లు ప్రశంసిస్తున్నారు.




