Janhvi Kapoor: మిమ్మల్ని ఎవరూ అత్యాచారం చేయడం లేదు కదా..? జాన్వీపై తెలుగు హీరోయిన్ షాకింగ్ కామెంట్స్!

Janhvi Kapoor: సౌత్ సినిమాలపై నార్త్ భామలు జాన్వీ కపూర్, రాధికా ఆప్టే వ్యాఖ్యలపై రెజీనా కౌంటర్. 'కేసరి చాప్టర్ 2' ప్రమోషన్లలో కరణ్ జోహార్ వివక్ష చూపారంటూ సంచలన కామెంట్స్.

Gagan kumar
Updated on: 6 Nov 2026 1:53 PM IST
Janhvi Kapoor
X

Janhvi Kapoor: మిమ్మల్ని ఎవరూ అత్యాచారం చేయడం లేదు కదా..? జాన్వీపై తెలుగు హీరోయిన్ షాకింగ్ కామెంట్స్!

Janhvi Kapoor: తెలుగు చలనచిత్ర పరిశ్రమపై నార్త్ భామల కామెంట్స్ ఇప్పుడు సోషల్ మీడియాను ఊపేస్తున్నాయి. ఇటీవల 'పెద్ది' సినిమాలో గ్లామర్ పాత్ర చేయడంపై జాన్వీ కపూర్ చేసిన వ్యాఖ్యలు, మరోవైపు 'లెజెండ్' సినిమాలో నటనపై రాధికా ఆప్టే చేసిన విమర్శలు సౌత్ ఫిల్మ్ వర్గాల్లో తీవ్ర చర్చకు దారితీశాయి.

సినిమా పూర్తయి విడుదలయ్యాక సౌత్ సినిమాలపై, ఇక్కడి నేటివిటీపై నోరు పారేసుకోవడం సరికాదంటూ ఇండస్ట్రీ నుంచి తీవ్ర నిరసనలు వ్యక్తమవుతున్నాయి. ఈ వివాదంపై తాజాగా టాలెంటెడ్ హీరోయిన్ రెజీనా కసాండ్రా అత్యంత ఘాటుగా స్పందించింది.

ఈ సందర్భంగా నార్త్ ప్రొడక్షన్ హౌసెస్ సౌత్ నటీనటుల పట్ల చూపుతున్న వివక్షను ఎండగడుతూ కరణ్ జోహార్‌పై రెజీనా తీవ్రమైన ఆరోపణలు చేసింది. ధర్మ ప్రొడక్షన్స్ నిర్మించిన ‘కేసరి చాప్టర్ 2’ చిత్రంలో అక్షయ్ కుమార్ భార్యగా నేను కీలక పాత్ర పోషించాను.

కానీ కరణ్ జోహార్ ఎలాంటి వివరణ లేకుండానే నన్ను ఆ సినిమా ప్రమోషన్లకు దూరంగా ఉంచారు. నాపై ఉన్న పాటను విడుదల చేశారు కానీ, కనీసం నన్ను సోషల్ మీడియాలో ట్యాగ్ చేయడానికి కూడా ఇష్టపడలేదు. దీన్ని ఏమనాలి? నేను సౌత్ ఇండియన్ నటిని కావడం వల్లే నార్త్ వాళ్లు నాతో ఇలా వ్యవహరించారా? అని ఆమె సూటిగా ప్రశ్నించింది.

ఉత్తర-దక్షిణాది చిత్ర పరిశ్రమల మధ్య విద్వేషాలను రెచ్చగొట్టేలా మాట్లాడే నార్త్ నటీమణుల తీరుపై రెజీనా ఆగ్రహం వ్యక్తం చేసింది. మీపై ఎవరూ అత్యాచారం చేయడం లేదు కదా. కథ లేదా పాత్ర నచ్చకపోతే ఆ ప్రాజెక్ట్ నుంచి సులభంగా తప్పుకునే వెసులుబాటు అందరికీ ఉంటుంది.

అసౌకర్యంగా అనిపిస్తే ముందే తప్పుకోవాలి కానీ, సినిమా పూర్తి చేసి విడుదలయ్యాక విమర్శలు చేయడం ఏమాత్రం సమంజసం కాదు. జాన్వీ కపూర్, రాధికా ఆప్టే ఇద్దరికీ ఆ సినిమాల నుంచి తప్పుకునే స్వేచ్ఛ ఉందని, కానీ వారు పూర్తి చేశాక ఇష్టానుసారంగా మాట్లాడి ప్రాంతీయ విద్వేషాలను రెచ్చగొడుతున్నారని మండిపడింది.

నేనూ ఒక మహిళనే కాబట్టి నటీమణుల పక్షాన నిలబడటం నాకు సులభమే. కానీ ఈ విషయంలో జాన్వీ, రాధికలను నేను ఏమాత్రం సమర్థించలేను. సమస్యను పరిష్కరించుకోవడానికి చాలా మార్గాలు ఉన్నాయి కానీ, ఇది సరైన పద్ధతి కాదు"* అని స్పష్టం చేసింది.

ఒకవైపు నార్త్‌లో సౌత్ నటీనటులకు ఎదురవుతున్న వివక్షను ఎండగడుతూనే, సౌత్ సినిమాలలో నటించి గుర్తింపు తెచ్చుకున్నాక ఇక్కడి పరిశ్రమను తక్కువ చేసి మాట్లాడే నార్త్ నటీమణులకు చెక్ పెడుతూ రెజీనా చేసిన వ్యాఖ్యలు ప్రస్తుతం నెట్టింట వైరల్ అవుతున్నాయి. రెజీనా బోల్డ్ అండ్ స్ట్రైట్ ఫార్వర్డ్ స్టేట్‌మెంట్స్‌ను టాలీవుడ్ ప్రేమికులు, నెటిజన్లు విశేషంగా ప్రశంసిస్తున్నారు.



Gagan kumar

Gagan kumar

2014లో జర్నలిస్ట్‌గా నా కెరీర్ ప్రారంభించాను. పలు వెబ్‌సైట్‌లలో సబ్-ఎడిటర్‌గా పని చేశాను. డిజిటల్‌ రంగాల్లో 11 ఏళ్లకు పైగా అనుభవం ఉంది. బిజినెస్, స్పోర్ట్స్, మూవీస్, నేషనల్ అండ్ ఇంటర్నేషనల్, పాలిటిక్స్ , వైరల్ న్యూస్‌కు సంబంధించిన కంటెంట్‌ను రాయగలను. ముఖ్యంగా బిజినెస్, స్పోర్ట్స్, మూవీస్, బ్రేకింగ్ న్యూస్ రాయడంలో నైపుణ్యం ఉంది.