Renu Desai: రేణూ దేశాయ్ షాకింగ్ పోస్ట్.. అది ఆనందం కాదు.. పక్కా మూర్ఖత్వం!
Renu Desai: దీపావళి పండుగ ముగిసినా అర్ధరాత్రి దాటినా భారీ శబ్దాలతో టపాసులు కాల్చడంపై నటి రేణూ దేశాయ్ తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేశారు.
Renu Desai: రేణూ దేశాయ్ షాకింగ్ పోస్ట్.. అది ఆనందం కాదు.. పక్కా మూర్ఖత్వం!
Renu Desai: దీపావళి పండుగ పూర్తయినా అర్ధరాత్రి వేళల్లో భారీ శబ్దాలు వచ్చే టపాసులు కాల్చడంపై ప్రముఖ నటి రేణూ దేశాయ్ (Renu Desai) తీవ్ర అసహనం వ్యక్తం చేశారు. ఎదుటివారి ఇబ్బందులను పట్టించుకోకుండా ప్రవర్తించడం కేవలం మూర్ఖత్వమేనంటూ సోషల్ మీడియా వేదికగా సుదీర్ఘ పోస్ట్ పెట్టారు.
దీపావళి పండుగ సమయం నుండి తాను మౌనంగా ఉండటానికి గల కారణాన్ని రేణూ దేశాయ్ తన పోస్ట్‌లో వెల్లడించారు. "రాత్రి 11 గంటలవుతోంది.. అయినా ప్రజలు ఇంకా పెద్ద శబ్దాలు వచ్చే టపాసులు కాలుస్తూనే ఉన్నారు. దీపావళి రోజున నేను ఏమైనా మాట్లాడి ఉంటే నన్ను హిందూ వ్యతిరేకి అని ముద్ర వేసేవారు. అందుకే ఆ రోజు మౌనంగా ఉండిపోయాను. కానీ పండుగ అయిపోయిన తర్వాత కూడా రాత్రి 11 గంటలకు ఇంత పెద్ద శబ్దాలతో టపాసులు కాల్చడానికి ఇప్పుడు ఏ పండుగ ఉంది?" అని ఆమె ప్రశ్నించారు.
సమాజంలో వృద్ధులు, చిన్నపిల్లలు, అనారోగ్యంతో బాధపడుతున్న వారు ఉంటారనే కనీస స్పృహ లేకుండా ప్రవర్తిస్తున్నారని ఆమె ఆవేదన వ్యక్తం చేశారు. "మన ఆనందమే ముఖ్యం అనుకుని ఇతరుల బాధలను పట్టించుకోకపోవడం ఎదుటివారి పట్ల కనీస సానుభూతి లేకపోవడమే. దీపాల పండుగను ఆనందంగా జరుపుకోండి తప్పులేదు.. కానీ దాన్ని శబ్దాల పోటీగా మార్చకండి" అని హితవు పలికారు.
కనీసం రాత్రి 10 గంటల లోపల టపాసులు కాల్చడం పూర్తి చేసి, ఆ తర్వాతైనా ప్రజలను ప్రశాంతంగా ఉండనివ్వాలని కోరారు. "మీ ఆనందం కోసం తోటి మనుషులను హింసించకండి, కొంచెం దయ చూపించండి" అని విజ్ఞప్తి చేశారు. ఇక కాలుష్యం విషయానికొస్తే.. ఏడాదిలోని 364 రోజుల పాటు వాహనాలు, పరిశ్రమల వల్ల ఎలాగో కాలుష్యం ఉంటోందని, దాని గురించి ప్రత్యేకంగా మాట్లాడి ప్రయోజనం లేదని ఆమె అభిప్రాయపడ్డారు. ప్రస్తుతం రేణూ దేశాయ్ చేసిన ఈ వ్యాఖ్యలు సోషల్ మీడియాలో వైరల్‌గా మారాయి.




