Rishab Shetty : ఆ ఇద్దరితో రిషబ్‌కు చెడిందా? రాజ్ బి శెట్టి, రుక్మిణి వసంత్‌లను అన్‌ఫాలో చేసిన స్టార్ హీరో!

Rishab Shetty :కన్నడ స్టార్ హీరో రిషబ్ శెట్టి సంచలన నిర్ణయం తీసుకున్నారు. తనకి లైఫ్ ఇచ్చిన 'హోంబలే ఫిల్మ్స్'తో పాటు సన్నిహితులు రాజ్ బి శెట్టి, రుక్మిణి వసంత్‌లను ఆయన ఇన్‌స్టాగ్రామ్‌లో అన్‌ఫాలో చేయడం ఇప్పుడు కన్నడ ఇండస్ట్రీలో తీవ్ర చర్చకు దారితీసింది.

Ganesh
Published on: 28 March 2026 2:00 PM IST
Rishab Shetty
X

Rishab Shetty : ఆ ఇద్దరితో రిషబ్‌కు చెడిందా? రాజ్ బి శెట్టి, రుక్మిణి వసంత్‌లను అన్‌ఫాలో చేసిన స్టార్ హీరో!

Rishab Shetty : ‘కాంతార’ సినిమాతో పాన్ ఇండియా స్థాయిలో సంచలనం సృష్టించిన నటుడు, దర్శకుడు రిషబ్ శెట్టి ఇప్పుడు కన్నడ పరిశ్రమలో చర్చకు దారితీశారు. తన సన్నిహితులను, తనకి లైఫ్ ఇచ్చిన నిర్మాణ సంస్థను ఆయన ఇన్‌స్టాగ్రామ్‌లో అన్‌ఫాలో చేయడం పలు అనుమానాలకు తావిస్తోంది. ఇటీవల రిషబ్ శెట్టి తన ఇన్ స్టా ఖాతాలో సన్నిహితుడైన రాజ్ బి శెట్టితో పాటు, హీరోయిన్ రుక్మిణి వసంత్‌లను అన్‌ఫాలో చేశారు. అయితే అందరినీ ఆశ్చర్యానికి గురి చేసిన విషయం ఏంటంటే.. ‘కాంతార’ వంటి భారీ చిత్రాన్ని నిర్మించిన ప్రతిష్టాత్మక నిర్మాణ సంస్థ ‘హోంబలే ఫిల్మ్స్’ అధికారిక ఖాతాను కూడా ఆయన అన్‌ఫాలో చేయడం.

నిర్మాణ సంస్థను అన్‌ఫాలో చేసినప్పటికీ, ఆ సంస్థ అధినేత విజయ్ కిరగందూర్‌నూ మాత్రం రిషబ్ ఇంకా ఫాలో అవుతూనే ఉన్నారు. దీంతో ‘కాంతార’ టీమ్, నిర్మాణ సంస్థ మధ్య ఏవో అంతర్గత విభేదాలు ఉన్నాయంటూ వస్తున్న వార్తలకు మరింత బలం చేకూరినట్లయింది. సోషల్ మీడియాలో ఇంత రచ్చ జరుగుతున్నా.. అటు రిషబ్ శెట్టి గానీ, ఇటు హోంబలే ఫిల్మ్స్ గానీ ఇప్పటివరకు ఎటువంటి అధికారిక వివరణ ఇవ్వలేదు. మరోవైపు రిషబ్ తన తదుపరి భారీ ప్రాజెక్ట్ అయిన ‘జై హనుమాన్’ కోసం రెడీ అవుతున్నారు. ప్రశాంత్ వర్మ దర్శకత్వంలో తెరకెక్కుతున్న ఈ సినిమాలో ఆయన హనుమంతుడి పాత్రలో కనిపిస్తారని ఇప్పటికే ప్రకటించిన సంగతి తెలిసిందే.

Ganesh

Ganesh

2022లో జర్నలిస్ట్‌గా నా కెరీర్ ప్రారంభించాను. పలు వెబ్‌సైట్‌లలో కంటెంట్ రైటర్‌గా పని చేశాను. డిజిటల్‌ రంగాల్లో 4 ఏళ్లకు పైగా అనుభవం ఉంది. లైఫ్ స్టైల్, బిజినెస్‌, మూవీస్, స్పోర్ట్స్, టెక్నాలజీ, ఆటోమొబైల్స్, పాలిటిక్స్, సంబంధించిన కంటెంట్‌ను రాయగలను. ముఖ్యంగా సినిమా గురించి ప్రత్యేక కథనాలు రాయడంలో నైపుణ్యం ఉంది.

Next Story