Robert Pattinson's: డిఫరెంట్ క్రైమ్ థ్రిల్లర్‌తో రానున్న రాబర్ట్ పాటిన్సన్...రిలీజ్ డేట్ ఫిక్స్!
Robert Pattinson's: హాలీవుడ్ స్టార్ హీరో రాబర్ట్ పాటిన్సన్ నటిస్తున్న తాజా క్రైమ్ డ్రామా చిత్రం ‘ప్రైమ్‌టైమ్’ విడుదలకు ముహూర్తం ఖరారైంది.
Robert Pattinson's: డిఫరెంట్ క్రైమ్ థ్రిల్లర్‌తో రానున్న రాబర్ట్ పాటిన్సన్...రిలీజ్ డేట్ ఫిక్స్!
Robert Pattinson's: హాలీవుడ్ స్టార్ హీరో రాబర్ట్ పాటిన్సన్ నటిస్తున్న తాజా క్రైమ్ డ్రామా చిత్రం ‘ప్రైమ్‌టైమ్’ విడుదలకు ముహూర్తం ఖరారైంది. ఈ చిత్రాన్ని ప్రముఖ నిర్మాణ సంస్థ ఏ24 (A24) సెప్టెంబర్ 25న ప్రపంచవ్యాప్తంగా థియేటర్లలో గ్రాండ్‌గా విడుదల చేయనున్నట్లు అధికారికంగా ప్రకటించింది.
'ప్రైమ్‌టైమ్' కథాంశం … నటీనటులు
ప్రముఖ డాక్యుమెంటరీ ఫిలింమేకర్ లాన్స్ ఒపెన్‌హైమ్ దర్శకత్వంలో తెరకెక్కిన ఈ చిత్రానికి అజోన్ సింగ్ రచయితగా వ్యవహరించారు. 2006 నాటి సంచలనాత్మక టెలివిజన్ చరిత్ర ఆధారంగా ఈ సినిమా రూపుదిద్దుకుంది. ఇందులో రాబర్ట్ పాటిన్సన్ ప్రముఖ ఎన్‌బీసీ డేట్‌లైన్ కరెస్పాండెంట్ క్రిస్ హాన్సన్ పాత్రలో కనిపించనున్నారు. లా ఎన్‌ఫోర్స్‌మెంట్ సహాయంతో ఆన్‌లైన్‌లో మైనర్లుగా నటించి అనుమానిత నేరస్థులను పట్టుకునే రియల్ ఇన్సిడెంట్స్ ఆధారంగా ఈ కథ సాగుతుంది. రాబర్ట్ పాటిన్సన్‌తో పాటు మెరిట్ వీవర్, స్కైలర్ గిసోండో, ఫోబీ బ్రిడ్జర్స్ తదితరులు కీలక పాత్రలు పోషిస్తున్నారు.
బాక్సాఫీస్ వద్ద క్రిస్టోఫర్ నోలన్ ‘ది ఒడిస్సీ’ సునామీ
ఇదిలాఉంటే, రాబర్ట్ పాటిన్సన్ ఇటీవల క్రిస్టోఫర్ నోలన్ దర్శకత్వంలో తెరకెక్కిన విజువల్ వండర్ ‘ది ఒడిస్సీ’ చిత్రంలో నటించిన విషయం తెలిసిందే. మాట్ డామన్ ప్రధాన పాత్రలో నటించిన ఈ గ్రీకు పురాణగాథ చిత్రం బాక్సాఫీస్ వద్ద సరికొత్త రికార్డులను సృష్టిస్తోంది. విడుదలైన తొలి వారాంతంలోనే ఏకంగా 264 మిలియన్ డాలర్లకు పైగా వసూళ్లను రాబట్టి, నోలన్ కెరీర్‌లోనే బిగ్గెస్ట్ గ్లోబల్ ఓపెనింగ్‌గా నిలిచింది. పూర్తిగా ఐమ్యాక్స్ కెమెరాలతో తెరకెక్కిన ఈ సినిమా ప్రస్తుతం థియేటర్లలో విజయవంతంగా ప్రదర్శించబడుతోంది.




