Toxic: యశ్ 'టాక్సిక్' నుంచి రొమాంటిక్ మెలోడీ 'మనసాగదే' వచ్చేసింది.

Toxic: కన్నడ రాకింగ్ స్టార్ యశ్ హీరోగా, టాలెంటెడ్ డైరెక్టర్ గీతు మోహన్‌దాస్ దర్శకత్వంలో తెరకెక్క్కుతున్న మోస్ట్ అంటెసిపేటెడ్ పాన్ ఇండియా మూవీ 'టాక్సిక్' .

Srinivas Rao
Published on: 21 July 2026 1:27 PM IST
Toxic
X

Toxic: యశ్ 'టాక్సిక్' నుంచి రొమాంటిక్ మెలోడీ 'మనసాగదే' వచ్చేసింది.

Toxic: కన్నడ రాకింగ్ స్టార్ యశ్ హీరోగా, టాలెంటెడ్ డైరెక్టర్ గీతు మోహన్‌దాస్ దర్శకత్వంలో తెరకెక్క్కుతున్న మోస్ట్ అంటెసిపేటెడ్ పాన్ ఇండియా మూవీ 'టాక్సిక్' . ఇప్పటికే విడుదలైన 'తబాహీ' పాట బాక్సాఫీస్ వద్ద చార్ట్‌బస్టర్‌గా నిలవగా, తాజాగా మేకర్స్ ఈ సినిమా నుంచి రెండో సింగిల్ 'మనసాగదే' పాటను విడుదల చేశారు. రొమాంటిక్ అండ్ ఎమోషనల్ ఎలిమెంట్స్‌తో సాగే ఈ గీతం అన్ని ప్రధాన భాషల్లో శ్రోతలను అలరిస్తోంది.

పాట ప్రత్యేకతలు … సంగీతం

'తబాహీ' మాస్ అండ్ హై-ఎనర్జీ సాంగ్ అయితే, 'మనసాగదే' పూర్తిగా ప్రేమ, భావోద్వేగాలతో కూడిన మెలోడీ ట్రాక్. ఈ పాటకు తనిష్క్ బాగ్చి, అర్సలాన్ నిజామి , ఫహీమ్ అబ్దుల్లా సంగీతం అందించగా, తెలుగు వెర్షన్‌కు ప్రముఖ గీత రచయిత రామజోగయ్య శాస్త్రి చక్కటి సాహిత్యాన్ని అందించారు. సిద్దార్థ్ బస్రూర్ తన ఆలాపనతో పాటను మరింత అందంగా మలిచారు.

యశ్, తారా సుతారియా ఆన్-స్క్రీన్ కెమిస్ట్రీ

ఈ రొమాంటిక్ సాంగ్‌లో యశ్ , తారా సుతారియా జంట మధ్య ఆన్-స్క్రీన్ కెమిస్ట్రీ చాలా ఇంప్రెసివ్‌గా ఉంది. వీరితో పాటు ఈ పాట వీడియోలో కియారా అద్వానీ , నయనతార కూడా ప్రత్యేకంగా కనిపించి సర్ప్రైజ్ చేశారు. మొదటి వినడానికి సామాన్యంగా అనిపించినా, ఈ మ్యూజికల్ మెలోడీ రిపీటెడ్ వినడంలో ప్రేక్షకులకు మరింత దగ్గరవుతుంది.

విడుదల తేదీ … నిర్మాణం

కెవిఎన్ ప్రొడక్షన్స్ , మాన్స్టర్ మైండ్ క్రియేషన్స్ సంస్థలు సంయుక్తంగా ఈ భారీ బడ్జెట్ యాక్షన్ డ్రామాను నిర్మిస్తున్నాయి. భారీ అంచనాల మధ్య రూపొందుతున్న 'టాక్సిక్' సినిమా ప్రపంచవ్యాప్తంగా ఆగస్టు 26, 2026 న భారీ ఎత్తున థియేటర్లలో విడుదల కానుంది.

Srinivas Rao

Srinivas Rao

శ్రీనివాస్ రావు జర్నలిజం రంగంలో దశాబ్దానికి పైగా అనుభవం కలిగిన కంటెంట్ రైటర్, సబ్ ఎడిటర్. రాజకీయాలు, ప్రాంతీయ, జాతీయ, అంతర్జాతీయ, లైఫ్ స్టైల్, క్రైమ్ వంటి విభిన్న అంశాల్లో లోతైన అవగాహనతో స్పష్టమైన, పాఠకులకు సులభంగా అర్థమయ్యే శైలిలో వార్తలను అందిస్తున్నారు. ప్రముఖ మీడియా సంస్థలులో పనిచేసి విలువైన అనుభవాన్ని సంపాదించారు. విశ్లేషణాత్మక దృక్పథంతో వార్తలకు కొత్త కోణాన్ని జోడిస్తూ పాఠకుల విశ్వాసాన్ని పొందుతున్నారు.

Next Story