Divorce: ప్రభాస్ హీరోయిన్ విడాకులు.. ఐదేళ్ల బంధానికి గుడ్ బై..!
Divorce: ప్రభాస్ సాహో సినిమా హీరోయిన్ ఎవలీన్ శర్మ తన భర్త తుషాన్ బిందీ నుంచి విడిపోతున్నట్లు ప్రకటించారు.
Divorce: ప్రభాస్ హీరోయిన్ విడాకులు.. ఐదేళ్ల బంధానికి గుడ్ బై..!
Evelyn Sharma: సినిమా ఇండస్ట్రీలో విడాకుల పరంపర ఆగడం లేదు. నిన్న మొన్నటి వరకు ఎంతో అన్యోన్యంగా ఉన్నారనుకున్న జంటలు కూడా తమ బంధానికి ముగింపు పలుకుతూ షాక్ ఇస్తున్నాయి. తాజాగా, యంగ్ రెబల్ స్టార్ ప్రభాస్ సరసన మెరిసిన ఒక నటి, తన ఐదేళ్ల వైవాహిక బంధానికి స్వస్తి పలుకుతున్నట్లు ప్రకటించడం ఇప్పుడు సోషల్ మీడియాలో హాట్ టాపిక్ అయ్యింది. ప్రభాస్ నటించిన భారీ యాక్షన్ ఎంటర్టైనర్ 'సాహో' గుర్తుందా? అందులో తన గ్లామర్‌తో మెప్పించిన జర్మన్ భామ ఎవలీన్ శర్మ ఇప్పుడు వార్తల్లో నిలిచారు. తన భర్త, డెంటల్ సర్జన్ తుషాన్ బిందీతో ఆమె విడాకులు తీసుకున్నట్లు అధికారికంగా వెల్లడించారు.
ప్రేమ వివాహం.. ముద్దుల పిల్లలు
మోడలింగ్ రంగం నుంచి సినిమాల్లోకి వచ్చిన ఎవలీన్ శర్మ, బాలీవుడ్ సినిమాలతో మంచి గుర్తింపు తెచ్చుకున్నారు. కెరీర్ పీక్స్‌లో ఉన్నప్పుడే 2021, మే 15న తుషాన్ బిందీని ఆమె వివాహం చేసుకున్నారు. వీరికి ఇద్దరు పిల్లలు కూడా ఉన్నారు. ఎంతో సంతోషంగా సాగుతోందనుకున్న వీరి కాపురంలో మనస్పర్థలు రావడంతో, తాజాగా విడిపోవాలని నిర్ణయించుకున్నారు. తమ విడాకులపై ఎవలీన్ స్పందిస్తూ.. ఇది అకస్మాత్తుగా తీసుకున్న నిర్ణయం కాదని, స్నేహపూర్వకంగానే తాము విడిపోతున్నామని తెలిపారు. మేము భార్యాభర్తలుగా విడిపోయినా, పిల్లల విషయంలో మాత్రం ఎప్పుడూ కలిసే ఉంటాం. వారి బాధ్యతను ఇద్దరం పంచుకుంటాం అని ఆమె స్పష్టం చేశారు. ఒక ఇంటర్వ్యూలో ఆమె ఈ విషయాన్ని వెల్లడించడంతో బాలీవుడ్ ,టాలీవుడ్ వర్గాల్లో చర్చ మొదలైంది.
2012లో హిందీ సినిమాతో ఎవలీన్ కెరీర్ మొదలైంది. 2013లో వచ్చిన 'యే జవానీ హై దివానీ' సినిమా ఆమెకు మంచి బ్రేక్ ఇచ్చింది. ప్రభాస్ హీరోగా వచ్చిన 'సాహో' సినిమాలో ఒక కీలక పాత్రలో నటించి తెలుగు ప్రేక్షకులకు చేరువయ్యారు. 'యారియాన్', 'మై తేరా హీరో' వంటి హిందీ చిత్రాల్లో ఆమె నటించారు. పెళ్లయ్యాక సినిమాలకు దూరంగా ఉన్న ఎవలీన్, ఇప్పుడు విడాకుల తర్వాత మళ్లీ మేకప్ వేసుకునే అవకాశం ఉందని సమాచారం. సెకండ్ ఇన్నింగ్స్ మొదలుపెట్టి మళ్లీ వెండితెరపై మెరవాలని ఆమె అభిమానులు కోరుకుంటున్నారు.




