Sai Pallavi: డబ్బు కోసం వేరొకరిని ముద్దు పెట్టుకోవాలా?
Sai Pallavi: సినిమాల్లో ముద్దు సీన్లు, సన్నిహిత సన్నివేశాల్లో నటించడంపై నేచురల్ బ్యూటీ సాయి పల్లవి ఆసక్తికర వ్యాఖ్యలు చేసింది.
Sai Pallavi: డబ్బు కోసం వేరొకరిని ముద్దు పెట్టుకోవాలా?
Bold scenes: సినిమా ఇండస్ట్రీలో గ్లామర్ షో, ముద్దు సీన్లు, సన్నిహిత సన్నివేశాలు అనేవి చాలా కామన్‌గా మారిపోయాయి. కథ డిమాండ్ చేస్తే లిప్‌లాక్ సీన్స్‌లో నటించడానికి నేటి తరం హీరోయిన్లు పెద్దగా వెనుకాడటం లేదు. కానీ, ఇండస్ట్రీలో ఎంత క్రేజ్ ఉన్నా, కోట్లు కుమ్మరిస్తామన్నా... తనదైన పద్ధతులు, విలువలకు కట్టుబడి ఉండే ఏకైక నటి నేచురల్ బ్యూటీ సాయి పల్లవి. ప్రస్తుతం టాలీవుడ్‌తో పాటు బాలీవుడ్‌లోనూ వరుస క్రేజీ ప్రాజెక్టులతో బిజీగా ఉన్న సాయి పల్లవి.. తాజాగా ఒక ఇంటర్వ్యూలో పాల్గొని సినిమాల్లో కిస్సింగ్ సీన్స్‌లో నటించడంపై చేసిన వ్యాఖ్యలు ఇప్పుడు సోషల్ మీడియాలో విపరీతంగా వైరల్ అవుతున్నాయి.
ఇంటర్వ్యూలో సాయి పల్లవి మాట్లాడుతూ.. తాను ముద్దు సన్నివేశాల్లో నటించనని తెలిసినా చాలా మంది దర్శకులు ఇప్పటికీ తనను అడుగుతూనే ఉంటారని చెప్పుకొచ్చింది. ఈ విషయంపై తనకున్న స్పష్టమైన అభిప్రాయాన్ని ఆమె చాలా బోల్డ్‌గా పంచుకుంది. నాకో భాగస్వామి ఉంటే.. అది నటన కోసమే అయినా సరే, స్క్రీన్ మీద వేరొకరిని ముద్దు పెట్టుకోవడం కరెక్ట్ కాదు కదా అనేది నా ఫీలింగ్. ఒక మనిషి ప్రశాంతమైన జీవితాన్ని గడపడానికి ఏం కావాలి..? ఒక సంతోషకరమైన కుటుంబం, ఒక ఇల్లు, ఒక కారు.. అంతే కదా. ఇప్పటికే భగవంతుడి దయ వల్ల అవన్నీ నా దగ్గర ఉన్నాయి అని సాయి పల్లవి చెప్పుకొచ్చింది.
డబ్బు, లగ్జరీ జీవితంపై తనకున్న దృక్పథాన్ని వివరిస్తూ సాయి పల్లవి చేసిన వ్యాఖ్యలు అందరి హృదయాలను గెలుచుకుంటున్నాయి. నా దగ్గర ఆల్రెడీ కార్లు, ఇల్లు ఉన్నాయి. కేవలం ఇంకొక కొత్త కారు కొనడం కోసమో, బ్యాంక్ బ్యాలెన్స్ పెంచుకోవడం కోసమో నేను స్క్రీన్ మీద వేరొకరిని ముద్దు పెట్టుకోవాల్సిన అవసరం నాకు లేదు. నాకున్న దానితో నేను చాలా సంతోషంగా ఉన్నాను. నా నటన చూసి నన్ను సినిమాలో తీసుకోవాలనుకుంటే తీసుకోండి. ఒకవేళ సన్నిహిత సన్నివేశాల కోసమే అయితే నాకంటే వేరే వాళ్ళను ఎంపిక చేసుకోండి, నాకు ఎలాంటి అభ్యంతరం లేదు అంటూ సాయి పల్లవి కుండబద్దలు కొట్టినట్లు చెప్పేసింది.
ప్రస్తుతం సాయి పల్లవి చేసిన ఈ కామెంట్స్ నెట్టింట తెగ హల్‌చల్ చేస్తున్నాయి. కేవలం డబ్బు కోసమే కాకుండా, తన వ్యక్తిగత విలువల కోసమే బ్రతికే సాయి పల్లవి వ్యక్తిత్వాన్ని చూసి నెటిజన్లు, అభిమానులు ప్రశంసల వర్షం కురిపిస్తున్నారు. ఈ రోజుల్లో డబ్బు కంటే సొంత విలువలకే ప్రాధాన్యత ఇచ్చే ఇలాంటి హీరోయిన్‌ను చూడటం చాలా అరుదు. అందుకే నువ్వు నేచురల్ బ్యూటీవి మాత్రమే కాదు.. రియల్ బ్యూటీవి అంటూ ఫ్యాన్స్ సోషల్ మీడియాలో కామెంట్స్ పెడుతున్నారు.




