Samantha: సమంత కంబ్యాక్ మూవీ ఇదేనా? ఆ హీరోకి జోడిగా రీ-ఎంట్రీ పక్కా.!
Samantha: సినిమాల్లోకి సమంత రీఎంట్రీ 'అభిమన్యుడు 2'తోనే ఉండే అవకాశం ఉందని టాక్ వినిపిస్తోంది, ఆమె ఓకే చెప్పగానే షూటింగ్ మొదలుపెట్టేందుకు దర్శకుడు మిత్రన్, హీరో విశాల్ సిద్ధంగా ఉన్నారని సమాచారం.
Samantha: సమంత కంబ్యాక్ మూవీ ఇదేనా? ఆ హీరోకి జోడిగా రీ-ఎంట్రీ పక్కా.!
Samantha: ఇటీవల కొడుకుకు జన్మనిచ్చిన సమంత సినిమాల్లోకి రీఎంట్రీపై అప్పుడే చర్చ మొదలైంది. గతంలో విశాల్‌తో కలిసి నటించిన 'అభిమన్యుడు'కు సీక్వెల్‌తోనే రెండో ఇన్నింగ్స్ ప్రారంభించనున్నారని టాక్ వినిపిస్తోంది. ఇప్పటికే డైరెక్టర్ మిత్రన్ సామ్‌ను సంప్రదించినట్లు తెలుస్తోంది. ఆమె ఎప్పుడు ఓకే చెబితే అప్పుడే షూటింగ్ ప్రారంభించేందుకు సిద్ధంగా ఉన్నట్లు సమాచారం.
సీక్వెల్ కోసం సమంతను మార్చే ఆలోచన మేకర్స్‌కు లేదని, ఆమె తిరిగి వచ్చే వరకు వేచి చూడాలనుకుంటున్నారని చెబుతున్నారు. దీంతో సమంత రీఎంట్రీ 'అభిమన్యుడు 2' అయ్యే అవకాశం ఉంది.
'అభిమన్యుడు' తమిళంలో 'ఇరుంబు తిరై' పేరుతో 2018 మే 11న విడుదలైంది. తెలుగు వెర్షన్ అదే ఏడాది జూన్ 1న థియేటర్లకు వచ్చింది. ఇందులో విశాల్, సమంత జంటగా నటించగా, యాక్షన్ కింగ్ అర్జున్ విలన్ పాత్రలో కనిపించారు. పీఎస్ మిత్రన్ ఈ సినిమాతోనే దర్శకుడిగా అరంగేట్రం చేశారు.
సైబర్ వార్ఫేర్, డేటా చోరీ నేపథ్యంలో సాగే ఈ యాక్షన్ థ్రిల్లర్‌ను విశాల్ తన విశాల్ ఫిల్మ్ ఫ్యాక్టరీ బ్యానర్‌పై నిర్మించారు. యువన్ శంకర్ రాజా సంగీతం అందించారు. తన కెరీర్లోనే అతిపెద్ద హిట్ ఇదేనని విశాల్ అప్పట్లో చెప్పారు. సినిమా విడుదలకు ముందే సీక్వెల్ చేయాలని నిర్ణయించుకున్నట్లు విశాల్ గతంలో తెలిపారు. సాంకేతికత మనల్ని ఎలా బలహీనులను చేస్తుందనే దానిపై మిత్రన్ దగ్గర చాలా ఆలోచనలు ఉన్నాయని, వాటిలో కొన్నింటినే తొలి భాగంలో చూపించారని ఆయన పేర్కొన్నారు.
సీక్వెల్ ప్రాజెక్ట్ కోసం కొన్ని నిర్మాణ సంస్థలతో చర్చలు జరుగుతున్నాయని నివేదికలు చెబుతున్నాయి. అయితే దీనిపై అధికారిక ప్రకటన ఇంకా రాలేదు. విశాల్, మిత్రన్ లేదా నిర్మాణ సంస్థ నుంచి ప్రకటన కోసం అభిమానులు ఎదురుచూస్తున్నారు.




