చరిత్ర సృష్టించిన సమంత: రూ. 100 కోట్ల క్లబ్‌లో ‘మా ఇంటి బంగారం’!
Maa Inti Bangaaram: టాలీవుడ్ స్టార్ హీరోయిన్ సమంత, దర్శకురాలు నందిని రెడ్డి కాంబినేషన్‌లో వచ్చిన తాజా చిత్రం ‘మా ఇంటి బంగారం’ బాక్సాఫీస్ వద్ద సరికొత్త చరిత్ర సృష్టించింది.
చరిత్ర సృష్టించిన సమంత: రూ. 100 కోట్ల క్లబ్‌లో ‘మా ఇంటి బంగారం’!
Maa Inti Bangaaram: టాలీవుడ్ స్టార్ హీరోయిన్ సమంత, దర్శకురాలు నందిని రెడ్డి కాంబినేషన్‌లో వచ్చిన తాజా చిత్రం ‘మా ఇంటి బంగారం’ బాక్సాఫీస్ వద్ద సరికొత్త చరిత్ర సృష్టించింది. విడుదలై 24 రోజులు పూర్తి చేసుకున్న ఈ చిత్రం, రూ. 100 కోట్ల మార్కును అధిగమించి టాలీవుడ్ చరిత్రలోనే ఒక అరుదైన మైలురాయిని చేరుకుంది.
టాలీవుడ్ చరిత్రలో తొలిసారి..
తెలుగు చిత్ర పరిశ్రమలో ఒక కథానాయిక ప్రధాన పాత్రలో నటించిన చిత్రం, రూ. 100 కోట్ల వసూళ్లను సాధించడం ఇదే మొదటిసారి. ఈ భారీ విజయంతో సమంత తన సత్తా ఏంటో మరోసారి నిరూపించుకున్నారు. ఈ ఘనత భవిష్యత్తులో వచ్చే మహిళా ప్రధాన చిత్రాలకు ఒక పెద్ద సవాలుగా మారనుంది.
సక్సెస్ వెనుక ఉన్న బృందం..
ఈ చిత్రాన్ని సమంత తన సొంత నిర్మాణ సంస్థ ‘ట్రలాలా మూవింగ్ పిక్చర్స్’ బ్యానర్‌పై ప్రతిష్టాత్మకంగా నిర్మించారు. ప్రముఖ దర్శకులు రాజ్ నిడిమోరు ఈ చిత్రానికి సృష్టికర్తగా వ్యవహరించగా, సంతోష్ నారాయణన్ సంగీతం అందించారు. బలమైన కథనం, ప్రేక్షకుల నుంచి వస్తున్న సానుకూల స్పందనతో ‘మా ఇంటి బంగారం’ గ్లోబల్ బాక్సాఫీస్ వద్ద దూసుకుపోతోంది.




