Samantha: "ఆ స్టార్‌డమ్‌కు బానిస అయ్యాను.." సమంత సంచలన వ్యాఖ్యలు!
Samantha: స్టార్ హీరోయిన్ సమంత నటిస్తున్న సరికొత్త యాక్షన్ ఫ్యామిలీ డ్రామా 'మా ఇంటి బంగారం' ఈ శుక్రవారం (జూన్ పందొమ్మిది) ప్రపంచవ్యాప్తంగా విడుదల కానుంది.
Samantha: "ఆ స్టార్‌డమ్‌కు బానిస అయ్యాను.." సమంత సంచలన వ్యాఖ్యలు!
Samantha: స్టార్ హీరోయిన్ సమంత నటిస్తున్న సరికొత్త యాక్షన్ ఫ్యామిలీ డ్రామా 'మా ఇంటి బంగారం' ఈ శుక్రవారం (జూన్ పందొమ్మిది) ప్రపంచవ్యాప్తంగా విడుదల కానుంది. టాలెంటెడ్ డైరెక్టర్ నందినీ రెడ్డి దర్శకత్వంలో తెరకెక్కిన ఈ సినిమా ప్రమోషన్స్ ప్రస్తుతం జోరుగా సాగుతున్నాయి. ఈ నేపథ్యంలో ఇచ్చిన ఒక ఇంటర్వ్యూలో సమంత తన సినీ కెరీర్, గతంలో తాను చేసిన తప్పుల గురించి చేసిన వ్యాఖ్యలు ఇప్పుడు టాలీవుడ్‌లో హాట్ టాపిక్‌గా మారాయి.
కెరీర్ ప్రారంభంలో ఆ తప్పులు చేశానన్న సమంత
తన సుదీర్ఘ సినీ ప్రయాణంపై సమంత స్పందిస్తూ కెరీర్ ఆరంభంలో తాను తీసుకున్న కొన్ని నిర్ణయాల పట్ల అసంతృప్తి వ్యక్తం చేసింది. "నా కెరీర్‌లో నేను చూసి గర్వపడని, నాకు అంతగా నచ్చని సినిమాలు కూడా చాలానే చేశాను. పరిశ్రమలోకి వచ్చిన చాలా తక్కువ సమయంలోనే ప్రేక్షకులు నన్ను విపరీతంగా ప్రేమించడం మొదలుపెట్టారు. థియేటర్లలో నా పేరు వినపడగానే అరవడం, నా సినిమాల కోసం ఆత్రుతగా ఎదురుచూడటం చూసి నేను నిజంగా షాక్‌కు గురయ్యాను" అని సమంత చెప్పుకొచ్చింది.
స్టార్‌డమ్ పిచ్చితో నంబర్ల వెనుక పడ్డాను.. ఆరాటపడ్డాను
విజయం తెచ్చిన ఆ క్రేజ్ తన ఆలోచనలను ఎలా మార్చేసిందో సమంత నిజాయితీగా అంగీకరించింది. "ఆ సమయంలో నేను స్టార్‌డమ్ అనే మాయలో పడిపోయాను. మీడియాలో నా గురించి ఎలాంటి వార్తలు వస్తున్నాయి, నా రేటింగ్స్ ఎలా ఉన్నాయి, అలాగే ఒక సంవత్సరంలో నేను ఎన్ని సినిమాల్లో నటించాననే నంబర్ల గేమ్ వెనుక పరుగెత్తాను. దానికి పూర్తిగా అడిక్ట్ అయిపోయాను. కానీ, వరుస హిట్లు, బ్లాక్‌బస్టర్లు వస్తున్నప్పటికీ.. ఒక నటిగా ఆయా సినిమాలకు నేను ఎంతవరకు న్యాయం చేశాను, నా పాత్రల ద్వారా సినిమాకు ఎలాంటి కాంట్రిబ్యూషన్ అందించాననే విషయాన్ని అప్పట్లో అస్సలు ఆలోచించలేదు" అంటూ ఆవేదన వ్యక్తం చేసింది.
రజనీకాంత్ 'బాషా' తరహాలో మరో హిట్ కొడతారా?
గతంలో సమంత, నందినీ రెడ్డి కాంబినేషన్‌లో వచ్చిన 'ఓ బేబీ' చిత్రం బాక్సాఫీస్ వద్ద ఎంతటి పెద్ద విజయాన్ని సాధించిందో అందరికీ తెలిసిందే. ఇప్పుడు వీరిద్దరి కాంబోలో వస్తున్న రెండో చిత్రం 'మా ఇంటి బంగారం' కావడం విశేషం. ఈ సినిమా కథాంశం సూపర్ స్టార్ రజనీకాంత్ క్లాసిక్ హిట్ 'బాషా' తరహాలో ఉంటుందని,
ఒక సాధారణ గృహిణి వెనుక ఉన్న పవర్‌ఫుల్ ఫ్లాష్‌బ్యాక్ ఎలిమెంట్స్‌తో నందినీ రెడ్డి ఈ చిత్రాన్ని అద్భుతంగా మలిచారని చిత్ర వర్గాలు చెబుతున్నాయి. సమంత తన సొంత బ్యానర్ త్రిలాలా మూవింగ్ పిక్చర్స్ , రాజ్ నిడిమోరు లతో కలిసి నిర్మించిన ఈ చిత్రంపై భారీ అంచనాలు ఉన్నాయి. మరి ఈ శుక్రవారం రాబోతున్న ఈ సినిమాతో ఈ క్రేజీ కాంబినేషన్ మరో బ్లాక్‌బస్టర్ హిట్‌ను తమ ఖాతాలో వేసుకుంటుందో లేదో చూడాలి.




