Samantha: సరికొత్త అవతారంలో సమంత ఆ షోకు హోస్ట్‌గా స్టార్ హీరోయిన్..!
Samantha: ‘సెలబ్రిటీ మాస్టర్‌చెఫ్’ తమిళ వెర్షన్‌కు వ్యాఖ్యాతగా మారిన సమంత రుత్ ప్రభు.
Samantha: సరికొత్త అవతారంలో సమంత ఆ షోకు హోస్ట్‌గా స్టార్ హీరోయిన్..!
Celebrity MasterChef: టాలీవుడ్ స్టార్ హీరోయిన్ సమంత రుత్ ప్రభు బుల్లితెరపై సరికొత్త అవతారంలో మెరిసేందుకు సిద్ధమయ్యారు. ఇప్పటివరకు వెండితెరపైనే కాకుండా ఓటీటీ సైతం తన నటనతో ఏలిన సమంత, ఇప్పుడు ఓ డిఫరెంట్ రియాలిటీ షోకి హోస్ట్‌గా మారి ప్రేక్షకులను అలరించబోతున్నారు.
ప్రముఖ గ్లోబల్ కుకింగ్ రియాలిటీ షో 'మాస్టర్‌చెఫ్' కి సంబంధించిన తమిళ వెర్షన్ 'సెలబ్రిటీ మాస్టర్‌చెఫ్'కు ఆమె వ్యాఖ్యాతగా వ్యవహరించనున్నారు. ప్రముఖ ఓటీటీ ప్లాట్‌ఫారమ్ 'సోనీలివ్' తమిళ్లో ఈ ప్రసారం కానుంది. ఈ మేరకు సోనీ పిక్చర్స్ నెట్వర్క్స్ ఇండియా శనివారం అధికారిక ప్రకటన చేస్తూ, గ్రాండ్‌గా డిజైన్ చేసిన ప్రోమోను విడుదల చేసింది.
'బనిజయ్ ఆసియా' అత్యంత ప్రతిష్టాత్మకంగా నిర్మిస్తున్న ఈ కుకింగ్ షోలో తమిళ చలనచిత్ర, టెలివిజన్ పరిశ్రమకు చెందిన పలువురు ప్రముఖ సెలబ్రిటీలు పోటీపడనున్నారు. నిత్యం కెమెరాల ముందు యాక్టింగ్, షూటింగ్‌లతో బిజీగా ఉండే ఈ సెలబ్రిటీలు, కిచెన్‌లో ఎదురయ్యే క్లిష్టమైన వంట సవాళ్లను ఎలా ఎదుర్కొంటారనేది ప్రధాన ఆకర్షణగా నిలవనుంది. అనేక ఉత్కంఠభరిత మలుపుల మధ్య, తమ చేతి వంటలతో కఠినమైన జడ్జీలను మెప్పించి 'మాస్టర్‌చెఫ్' టైటిల్ గెలుచుకోవడానికి ఈ స్టార్లు తీవ్రంగా పోటీపడనున్నారు.
ఈ కొత్త ప్రాజెక్ట్ గురించి సమంత స్పందిస్తూ తన సంతోషాన్ని పంచుకున్నారు. నేను ఇప్పటివరకు నా కెరీర్లో ఇలాంటి భిన్నమైన కుకింగ్ షో ఎప్పుడూ చేయలేదు. అందుకే ఈ ఆఫర్ రాగానే ఎలాంటి ఆలోచన లేకుండా వెంటనే అంగీకరించాను. ఈ షో ద్వారా ప్రేక్షకులకు తమ అభిమాన నటీనటుల అసలు సిసలైన మరో కోణం కనిపిస్తుంది. ఒత్తిడిలో వారు చేసే చిన్న చిన్న పొరపాట్లు, కిచెన్‌లో తీసుకునే రిస్క్‌లు చూస్తుంటే ప్రేక్షకులకు చాలా సరదాగా, ఆసక్తికరంగా అనిపిస్తుంది అని సమంత పేర్కొన్నారు.
గతంలో 'ది ఫ్యామిలీ మ్యాన్ 2', 'సిటాడెల్: హనీ బన్నీ' వంటి బ్లాక్‌బస్టర్ వెబ్ సిరీస్‌లతో డిజిటల్ స్పేస్‌లో సంచలనం సృష్టించిన సమంత, ఒక రియాలిటీ షోకి వ్యాఖ్యాతగా వ్యవహరించడం మాత్రం ఇదే తొలిసారి కావడం విశేషం. మరి కుకింగ్ స్టేజ్‌పై తన మార్క్ గ్లామర్, ఎనర్జీతో సమంత ఎలా సందడి చేస్తారో చూడాలంటే సోనీలివ్ టీమ్ త్వరలోనే ప్రకటించబోయే ప్రసార తేదీ వరకు వేచి చూడాల్సిందే.




