నేను ఎవరినీ కలవడానికి ఇంత ఎగ్జైట్ అవ్వలేదు.. సమంత
Samantha: స్టార్ బ్యూటీ సమంత తన మాజీ కో-స్టార్, ప్రస్తుత తమిళనాడు ముఖ్యమంత్రి సి. జోసెఫ్ విజయ్ ని మర్యాదపూర్వకంగా కలిశారు.
నేను ఎవరినీ కలవడానికి ఇంత ఎగ్జైట్ అవ్వలేదు.. సమంత
Samantha: స్టార్ బ్యూటీ సమంత తన మాజీ కో-స్టార్, ప్రస్తుత తమిళనాడు ముఖ్యమంత్రి సి. జోసెఫ్ విజయ్ ని మర్యాదపూర్వకంగా కలిశారు. బుధవారం జరిగిన ఈ ప్రత్యేక భేటీకి సంబంధించిన ఫోటోలను సమంత తన సోషల్ మీడియా వేదికగా పంచుకున్నారు.
విజయ్ కేవలం వెండితెరపైనే కాకుండా, అంతకంటే పెద్ద లక్ష్యాల కోసమే పుట్టారని తనకు ముందే తెలుసంటూ ఆమె చేసిన కామెంట్స్ ఇప్పుడు ఇంటర్నెట్‌ను షేక్ చేస్తున్నాయి. తన తాజా చిత్రం ‘మా ఇంటి బంగారం’ ప్రమోషన్స్ కోసం చెన్నై వెళ్లిన సమయంలో ఈ ఆసక్తికర సమావేశం జరిగింది.
"నేను ఎవరినీ కలవడానికి ఇంత ఎగ్జైట్ అవ్వలేదు"..
సీఎం విజయ్‌ని కలవడానికి ముందు ప్రముఖ మీడియా ఛానెల్ ఇంటర్వ్యూలో సమంత తన ఆనందాన్ని పంచుకున్నారు. "నేను సాధారణంగా ఎవరినీ కలవడానికి అంతగా ఉత్సాహం చూపించను. కానీ ఈసారి నిజంగా చాలా ఎగ్జైట్‌మెంట్‌గా ఉంది. ఆయనతో కలిసి నేను మూడు బ్లాక్‌బస్టర్ సినిమాల్లో నటించాను. అందరూ ఇదే మాట చెప్పొచ్చు.. కానీ ఆయన అందరికంటే భిన్నమైన వ్యక్తి, చాలా స్పెషల్ అని నాకు మొదటి నుండే తెలుసు" అని సమంత పేర్కొన్నారు.
ఇది హఠాత్తుగా తీసుకున్న నిర్ణయం కాదు..
రాజకీయాల్లోకి రావడం, సీఎం పదవిని చేపట్టడం అనేది విజయ్ హఠాత్తుగా తీసుకున్న నిర్ణయం కాదని సమంత స్పష్టం చేశారు. "ఈ పొలిటికల్ జర్నీ వెనుక ఎన్నో ఏళ్ల నిశ్శబ్ద శ్రమ, స్పష్టమైన ఫోకస్ ఉన్నాయి. ఈరోజు ఆయన ముఖ్యమంత్రి పదవికి వంద శాతం అర్హుడు. అందరిలాగే నేను కూడా ఆయన్ని చాలా దగ్గరగా గమనిస్తూ వచ్చాను.
ఆయన గెలవాలని మేమంతా ప్రార్థించాం. అందుకే ఈ విజయం నాకు ఎంతమాత్రం ఆశ్చర్యాన్ని కలిగించలేదు" అని సమంత చెప్పుకొచ్చారు. గతంలో విజయ్, సమంత కాంబినేషన్‌లో వచ్చిన కత్తి (2014), తేరి (2016), మెర్సల్ (2017) చిత్రాలు బాక్సాఫీస్ వద్ద భారీ విజయాలు సాధించిన సంగతి తెలిసిందే.
ఎక్స్ (X) వేదికగా సమంత ఎమోషనల్ నోట్
విజయ్‌తో భేటీ అనంతరం సమంత తన అధికారిక ఎక్స్ (ట్విటర్) ఖాతాలో ఒక పవర్‌ఫుల్ పోస్ట్ పెట్టారు. "మన జీవితంలో ఏదో ఒక దశలో, సమాజం కోసం ఇంతకంటే ఎక్కువ చేయాలనే పిలుపు వస్తుంది. మన గురించి మాత్రమే కాకుండా, సమాజానికి మనమెలా ఉపయోగపడతాం అని ఆలోచించాల్సి వస్తుంది.
కానీ చాలా తక్కువ మంది మాత్రమే ఆ పిలుపునకు సమాధానమిస్తారు. విజయ్ సర్ తనను నమ్మిన వారిని కూడా ఆశ్చర్యపరిచేలా అద్భుతంగా పనిచేస్తారని నాకు అనిపిస్తోంది. అది ఆయనకున్న పవర్ వల్ల కాదు.. ఆయన మనసులో ఉన్న నిఖార్సైన సంకల్పం వల్ల సాధ్యమవుతుంది" అని ఆమె రాసుకొచ్చారు.
సమంత నటిస్తూ, స్వయంగా నిర్మించిన మోస్ట్ అవేటెడ్ తెలుగు యాక్షన్ ఫ్యామిలీ డ్రామా ‘మా ఇంటి బంగారం’ రేపు (జూన్ 19, శుక్రవారం) థియేటర్లలోకి రాబోతోంది. నందినీ రెడ్డి దర్శకత్వం వహించిన ఈ సినిమాలో గుల్షన్ దేవయ్య, దిగంత్ మంచాలే, గౌతమి కీలక పాత్రలు పోషించారు. ఈ సినిమా ప్రమోషన్స్ సమయంలోనే సమంత, సీఎం విజయ్‌ని కలవడం సినిమా హైప్‌కు మరింత ప్లస్ అయ్యింది.




