హీరోయిన్ సినిమా ఎవరు చూస్తారు?... సమంత ఎమోషనల్ పోస్ట్

Samantha: టాలీవుడ్ స్టార్ హీరోయిన్ సమంత నటించి, నిర్మించిన ‘మా ఇంటి బంగారం’ బాక్సాఫీస్ వద్ద రూ. 100 కోట్ల క్లబ్‌లో చేరి అద్భుతమైన రికార్డు సృష్టించింది.

Srinivas Rao
Updated on: 13 July 2026 12:09 PM IST
Samantha
X

హీరోయిన్ సినిమా ఎవరు చూస్తారు?... సమంత ఎమోషనల్ పోస్ట్

సమంత: టాలీవుడ్ స్టార్ హీరోయిన్ సమంత నటించి, నిర్మించిన ‘మా ఇంటి బంగారం’ బాక్సాఫీస్ వద్ద రూ. 100 కోట్ల క్లబ్‌లో చేరి అద్భుతమైన రికార్డు సృష్టించింది. ఒక తెలుగు నటి ప్రధాన పాత్రలో నటించిన సినిమా ఈ స్థాయి వసూళ్లు సాధించడం టాలీవుడ్ చరిత్రలో ఇదే మొదటిసారి. మూడేళ్ల విరామం తర్వాత సమంత చేసిన ఈ కమ్ బ్యాక్ మూవీ, ఇండస్ట్రీలో ఉన్న పాత పద్ధతులను, ఆలోచనలను పూర్తిగా మార్చేసింది.

"ఎవరు చూస్తారు?" అని ఎగతాళి చేసిన వారికి..

ఈ అద్భుతమైన విజయం తర్వాత సమంత సోషల్ మీడియా వేదికగా ఒక ఎమోషనల్ నోట్ పంచుకున్నారు. సినిమా విడుదలకు ముందు ఇండస్ట్రీలో ఒక ఎగ్జిబిటర్ తన సినిమా గురించి చేసిన వ్యాఖ్యలను ఆమె గుర్తు చేసుకున్నారు.

సమంత తన స్నేహితుడితో కలిసి ఒక బి-సెంటర్ ఎగ్జిబిటర్‌కు కాల్ చేసినప్పుడు, ఆ ఎగ్జిబిటర్ చాలా నిర్లక్ష్యంగా, "హీరోయిన్ సినిమా ఎవరు చూస్తారు? పెద్ద హీరో సినిమాలో గ్లామర్ కోసం అయితే చూస్తారు, కానీ సోలోగా హీరోయిన్ సినిమా అంటే ఎవరు వస్తారు? అసలు ఎవరూ రారు” అని సమాధానమిచ్చాడు. ఆ మాటలు సమంతను ఎంతగానో బాధించాయి.

రిస్క్ తీసుకుంటేనే ఫలితం..

ఆ రోజు జరిగిన సంఘటనను ప్రస్తావిస్తూ, సమంత ఇలా అన్నారు: "నిజమైన మార్పు రావాలంటే ఎవరో ఒకరు రిస్క్ తీసుకోవాలి. చాలాసార్లు ఆ రిస్క్ ఫలించకపోవచ్చు, కానీ అప్పుడప్పుడు మనం ఊహించని అద్భుతాలు జరుగుతాయి. మా విషయంలో అదే జరిగింది." అని ఆమె తన సంతోషాన్ని వ్యక్తం చేశారు.

"ఇది కేవలం మొదలు మాత్రమే.."

"భవిష్యత్తులో ఎవరైనా ఎగ్జిబిటర్‌ను హీరోయిన్ ఓరియెంటెడ్ సినిమా గురించి అడిగినప్పుడు, 'వద్దు' అని కాకుండా, 'చూద్దాం' అనే సమాధానం రావాలని నేను కోరుకుంటున్నాను. మహిళా ప్రధాన చిత్రాలను చూసే పద్ధతి మారాలని నా ఆకాంక్ష. మా సినిమా విజయం ఒక కొత్త మార్గానికి నాంది కావాలని కోరుకుంటున్నాను," అని సమంత ఆశాభావం వ్యక్తం చేశారు.

నందిని రెడ్డి దర్శకత్వంలో, ‘ట్రలాలా పిక్చర్స్’ బ్యానర్‌పై సమంత, రాజ్ నిడిమోరు, హిమాన్షు ఈ చిత్రాన్ని నిర్మించారు. జూన్ 19న విడుదలైన ఈ చిత్రం, బాక్సాఫీస్ వద్ద సమంత సత్తాను మరోసారి నిరూపించింది.

Srinivas Rao

Srinivas Rao

శ్రీనివాస్ రావు జర్నలిజం రంగంలో దశాబ్దానికి పైగా అనుభవం కలిగిన కంటెంట్ రైటర్, సబ్ ఎడిటర్. రాజకీయాలు, ప్రాంతీయ, జాతీయ, అంతర్జాతీయ, లైఫ్ స్టైల్, క్రైమ్ వంటి విభిన్న అంశాల్లో లోతైన అవగాహనతో స్పష్టమైన, పాఠకులకు సులభంగా అర్థమయ్యే శైలిలో వార్తలను అందిస్తున్నారు. ప్రముఖ మీడియా సంస్థలులో పనిచేసి విలువైన అనుభవాన్ని సంపాదించారు. విశ్లేషణాత్మక దృక్పథంతో వార్తలకు కొత్త కోణాన్ని జోడిస్తూ పాఠకుల విశ్వాసాన్ని పొందుతున్నారు.

Next Story