SSS: 'సాంప్రదాయిని సుప్పిని సుద్దపూసని' ఓటీటీ డేట్ ఫిక్స్.. ఎక్కడ చూడాలంటే ?
Desscription : శివాజీ, లయ నటించిన క్రైమ్ కామెడీ ‘సాంప్రదాయిని సుప్పిని సుద్దపూసని’ ఏప్రిల్ 3 నుంచి ఓటీటీలో స్ట్రీమింగ్.
SSS: 'సాంప్రదాయిని సుప్పిని సుద్దపూసని' ఓటీటీ డేట్ ఫిక్స్.. ఎక్కడ చూడాలంటే ?
SSS:టాలీవుడ్‌లో ఒకప్పుడు తమకంటూ ప్రత్యేక గుర్తింపు తెచ్చుకున్న శివాజీ, లయ మళ్లీ కలిసి నటించిన చిత్రం 'సాంప్రదాయిని సుప్పిని సుద్దపూసని'. మార్చి 6న థియేటర్లలో విడుదలైన ఈ సినిమాకి బాక్సాఫీసు వద్ద మిశ్రమ స్పందన లభించినా, తనదైన స్టైల్‌లో ప్రేక్షకులను ఎంటర్టైన్ చేసింది. మొదట ఈ మూవీని నేరుగా ఓటీటీలో విడుదల చేయాలని భావించిన మేకర్స్, తర్వాత థియేట్రికల్ రిలీజ్ చేయడం ఆసక్తికరంగా మారింది. ఇక ఇప్పుడు ఏప్రిల్ 3 నుంచి ఈ సినిమా నెట్ ఫ్లిక్స్ ఓటీటీ ప్లాట్‌ఫామ్‌పై అందుబాటులోకి రానుంది.
ఈ సినిమా కథ చిత్తూరు జిల్లా మదనపల్లి సమీపంలోని ఒక మధ్యతరగతి కుటుంబం చుట్టూ తిరుగుతుంది. శ్రీరామ్ (శివాజీ) ఒక నిజాయితీ గల పంచాయితీ సెక్రటరీగా తన కుటుంబంతో ప్రశాంతంగా జీవిస్తుంటాడు. అయితే స్థానిక ఎస్సై విక్రమ్ హత్యకు గురవ్వడంతో అతని జీవితంలో అనూహ్యమైన మలుపు తిరుగుతుంది. ఆ హత్యకు శ్రీరామ్ కుటుంబంతో ఉన్న సంబంధం ఏమిటి? ఆ సమస్యల నుంచి వారు ఎలా బయటపడ్డారు? అనే అంశాలను క్రైమ్, కామెడీ, ఫ్యామిలీ డ్రామా మేళవింపుతో ఆసక్తికరంగా చూపించారు.
దర్శకుడు సుధీర్ శ్రీరామ్ ఈ కథను సింపుల్‌గా, ఆసక్తికరంగా చెప్పేందుకు ప్రయత్నించారు. ప్రిన్స్, ధనరాజ్, మాస్టర్ రోహన్ వంటి నటులు తమ పాత్రలకు న్యాయం చేశారు. రంజన్ రాజ్ సంగీతం కథకు సరిపోయేలా ఉంది. థియేటర్లలో ఆశించిన స్థాయిలో మెప్పించలేకపోయిన ఈ చిత్రం, ఓటీటీలో మాత్రం మంచి ఆదరణ దక్కించుకునే అవకాశాలు కనిపిస్తున్నాయి. ముఖ్యంగా ఫ్యామిలీతో కలిసి చూసే సినిమా కోసం చూస్తున్నవారికి ఇది ఒక సరైన ఆప్షన్ అవుతుంది.




