Carmeni Selvam Trailer: మిడిల్ క్లాస్‌ ఫ్యామిలీస్ కు కనెక్ట్ అయ్యే మూవీ ‘కార్మేని సెల్వం’

Carmeni Selvam Trailer launch: వర్సటైల్ యాక్టర్ సముద్రఖని ప్రధాన పాత్రలో వస్తున్న మూవీ కార్మేని సెల్వం. ఈ మూవీ ట్రైలర్ హైదరాబాద్ లో లాంచ్ చేశారు.

Arun Chilukuri
Updated on: 26 March 2026 8:07 PM IST
Carmeni Selvam Trailer: మిడిల్ క్లాస్‌ ఫ్యామిలీస్ కు కనెక్ట్ అయ్యే మూవీ ‘కార్మేని సెల్వం’
X

Carmeni Selvam Trailer launch: విలక్షణ నటుడు సముద్రఖని ప్రధాన పాత్రలో గౌతమ్ వాసుదేవ్ మీనన్ కీలక పాత్రలో కనిపిస్తున్న మూవీ కార్మేని సెల్వం. ఈ మూవీ ఏప్రిల్ 3న తెలుగు, తమిళ భాషల్లో గ్రాండ్ రిలీజ్ కాబోతోంది. ఈ సందర్భంగా హైదరాబాద్ లో ట్రైలర్ లాంచ్ ఈవెంట్ నిర్వహించారు. ఈ సందర్భంగా సముద్రఖని మాట్లాడుతూ లైఫ్ ను ఎన్నిరకాలుగానైనా చూపించవచ్చు. లైఫ్ ను చూపించడంలో ఇదొక డిఫరెంట్ అవుతుంది. దర్శకుడు రామ్ చక్రి ఇంటెన్స్ క్రియేటర్. ఇలాంటి మంచి కథలో నన్ను ఎంచుకోవడం చాలా సంతోషంగా ఉంది. సినిమా చూసిన ప్రతి ఒక్కరినీ ఇది ఆలోచింపచేసేలా ఉంటుంది. ఈ మూవీలో అందరూ చాలా చక్కగా నటించారు అని చెప్పారు.

దర్శకుడు రామ్ చక్రి మాట్లాడుతూ ‘‘సముద్రఖని ఈ చిత్రంలో డిఫరెంట్ వేరియేషన్స్‌ చూపించారు. ఆయనలోని నటుడ్ని పూర్తిగా ఇందులో చూస్తారు. ఇక మూవీకి సంగీతం ఇచ్చిన రామానుజం ఒక సర్వీస్ లా చేశారు. అలాగే నిర్మాత అరుణ్ ఇచ్చిన సపోర్ట్ కూడా మర్చిపోలేనిది. ప్రతి మిడిల్ క్లాస్ ఫ్యామిలీకు ఈ చిత్రం కనెక్ట్ అవుతుంది. ప్రతి ఒక్కరూ తమ అప్పులను తగ్గించుకుని ఆనందంగా ఉండాలని ఈ చిత్రం ద్వారా చూపించబోతున్నాం”అని చెప్పారు.

నిర్మాత అరుణ్ రంగరాజులు మాట్లాడుతూ..‘‘ఈ మూవీ అందరికీ కనెక్ట్ అవుతుంది. మా డిస్ట్రిబ్యూషన్ పార్టనర్‌‌గా వ్యవహరిస్తున్న పీవీఆర్ ఐనాక్స్ పిక్చర్స్‌కు స్పెషల్ థ్యాంక్స్’’ అని అన్నారు. కార్యక్రమంలో ముఖ్య అతిథిగా పాల్గొన్న విమానం’ దర్శకుడు శివ ప్రసాద్ మాట్లాడుతూ సముద్రఖని మిడిల్ క్లాస్ ఫాదర్ క్యారెక్టర్ కి మరో పేరులా ఉంటారు. ఈ కథ డబ్బు చుట్టూ తిరిగేలా కనిపిస్తోంది. అందరికీ ఇది కనెక్ట్ అవ్వాలని కోరుకుంటున్నా అన్నారు.

తేజ కాకుమాను మాట్లాడుతూ భూమి సూర్యుని చుట్టూ తిరగడం ఎప్పుడో ఆగిపోయింది. ఇప్పుడు అంతా డబ్బు చుట్టూనే తిరుగుతుంది. మిడిల్ క్లాస్ ఫ్యామిలీస్ అందరికీ ఈ సినిమా కచ్చితంగా నచ్చుతుంది అని అన్నారు.

పాత్‌వే ప్రొడక్షన్స్ బ్యానర్‌పై అరుణ్ రంగరాజులు నిర్మాతగా రామ్ చక్రి దర్శకత్వంలో తెలుగు, తమిళ భాషల్లో రూపొందిన ద్విభాషా చిత్రం ‘కార్మేని సెల్వం’. దీనిలో లక్ష్మీ ప్రియా, అభినయ కీలక పాత్రలు పోషించారు. అలాగే రామానుజం సంగీతం అందించారు. ఫోటో గ్రఫీ యువరాజ్ డక్షన్, జగన్ ఆర్వీ , దినేష్ ఎస్ ఎడిటింగ్ బాధ్యతలు చేపట్టారు. మణి అముతవన్, ఉమా దేవి ఈ మూవీలో పాటలు రాయగా రాఘవ్ రమేష్ ఆడియోగ్రఫీ నిర్వహించారు.

Arun Chilukuri

Arun Chilukuri

వెబ్ జర్నలిస్ట్ గా నా కెరీర్ HMTV ద్వారా పదేళ్ల క్రితం ప్రారంభం అయింది. పదేళ్లుగా HMTV లోనే వెబ్సైట్ కు ఆర్టికల్స్ రాస్తున్నాను. దాదాపుగా అన్ని కేటగిరీల్లోనూ ముఖ్యంగా తెలంగాణ, ఆంధ్రప్రదేశ్ రాష్ట్రాల వార్తలతో పాటు వివిధ కేటగిరీల్లో అవసరాన్ని బట్టి ఆర్టికల్స్, బ్రేకింగ్ న్యూస్ ను ఇవ్వడం చేస్తున్నాను.

Next Story