Divya: పిల్లల్ని కనడానికి పెళ్లితో పనేముంది....కూతురి మాటలకు స్టార్ నటుడు మద్ధతు
Divya: వివాహం ఒక ముద్ర మాత్రమేనని, పెళ్లి లేకుండానే కలిసి ఉండవచ్చని దివ్య సత్యరాజ్ చేసిన వ్యాఖ్యలు వైరల్ అవుతున్నాయి.
Divya: పిల్లల్ని కనడానికి పెళ్లితో పనేముంది....కూతురి మాటలకు స్టార్ నటుడు మద్ధతు
Divya Sathyaraj: సినీ ఇండస్ట్రీలో విలక్షణ నటుడిగా గుర్తింపు పొందిన సత్యరాజ్ కుమార్తె, ప్రముఖ న్యూట్రిషనిస్ట్ , డీఎంకే నాయకురాలు దివ్య సత్యరాజ్ వివాహ వ్యవస్థపై షాకింగ్ కామెంట్స్ చేశారు. సాధారణంగా సెలబ్రిటీలు పెళ్లి గురించి గొప్పగా చెబుతుంటారు, కానీ దివ్య మాత్రం దానికి భిన్నంగా తన అభిప్రాయాన్ని కుండబద్దలు కొట్టినట్లు చెప్పడంతో నెట్టింట చర్చ మొదలైంది.
వివాహం ఒక సర్టిఫికెట్ మాత్రమే!
వివాహ బంధంపై దివ్య తనకున్న వ్యక్తిగత అభిప్రాయాన్ని పంచుకున్నారు. నాకు వివాహ వ్యవస్థపై గౌరవం ఉంది, కానీ వ్యక్తిగతంగా నేను దానిని నమ్మను. కేవలం ఒక మంగళసూత్రం కట్టుకోవడం లేదా ఉంగరాలు మార్చుకోవడం వల్లే ఇద్దరు వ్యక్తుల మధ్య బంధం బలపడుతుందని నేను అనుకోను. ఇద్దరు వ్యక్తులు మనస్పూర్తిగా ఇష్టపడితే, పరస్పర అంగీకారంతో కలిసి జీవించవచ్చు. దాని కోసం సమాజం ఇచ్చే పెళ్లి అనే ముద్ర లేదా ఒక కాగితపు ధృవపత్రం అవసరం లేదని ఆమె చెప్పుకొచ్చారు.
కూతురికి అండగా సత్యరాజ్
కూతురి వ్యాఖ్యలపై సోషల్ మీడియాలో నెగిటివ్ ట్రోల్స్ మొదలవడంతో, తండ్రిగా సత్యరాజ్ రంగంలోకి దిగి ఆమెకు పూర్తి మద్దతు ప్రకటించారు. నేను పెరియార్ సిద్ధాంతాలను నమ్ముతాను. కులమతాలకు, మూఢనమ్మకాలకు నేను వ్యతిరేకం. పెళ్లి అనేది పూర్తిగా ఒక వ్యక్తిగత ఇష్టం అని సత్యరాజ్ పేర్కొన్నారు.
నేటి ఆధునిక వైద్య సాంకేతికతతో పెళ్లి చేసుకోకుండానే సంతానాన్ని పొందే అవకాశాలు ఉన్నాయని, తన కుమార్తె ఆలోచనలను తాను గౌరవిస్తానని ఆయన స్పష్టం చేశారు. దివ్య చేసిన ఈ వ్యాఖ్యలు ప్రస్తుతం నెట్టింట వైరల్ అవుతున్నాయి. కొందరు ఆమెను ఆధునిక ఆలోచనాపరురాలిగా ప్రశంసిస్తుంటే, మరికొందరు మాత్రం భారతీయ సంప్రదాయాలను తక్కువ చేస్తున్నారంటూ విమర్శిస్తున్నారు. ఏది ఏమైనా, తన అభిప్రాయాన్ని ధైర్యంగా చెప్పడంలో దివ్య సత్యరాజ్ మరోసారి తన ప్రత్యేకతను చాటుకున్నారు.




