'రావు బహదూర్' ఓటీటీ డీల్ ఫిక్స్.. భారీ ధరకే!
Rao Bahadur: సత్యదేవ్ ప్రధాన పాత్రలో, వెంకటేష్ మహా దర్శకత్వంలో వస్తున్న సైకలాజికల్ డ్రామా 'రావు బహదూర్'.
'రావు బహదూర్' ఓటీటీ డీల్ ఫిక్స్.. భారీ ధరకే!
Rao Bahadur: సత్యదేవ్ ప్రధాన పాత్రలో, వెంకటేష్ మహా దర్శకత్వంలో వస్తున్న సైకలాజికల్ డ్రామా 'రావు బహదూర్'. ఇప్పటికే టీమ్ చేసిన బోల్డ్ కామెంట్స్‌తో ఈ సినిమాపై ప్రేక్షకుల్లో భారీ అంచనాలు నెలకొన్నాయి. తాజాగా అందుతున్న సమాచారం ప్రకారం, ఈ సినిమా ఓటీటీ హక్కులను ప్రముఖ సంస్థ నెట్‌ఫ్లిక్స్ దక్కించుకుంది. రూ. 7 కోట్ల భారీ ధరకే ఈ ఒప్పందం కుదిరినట్లు తెలుస్తోంది.
మహేష్ బాబు అండతో..
సాధారణంగా చిన్న సినిమాలకు ఓటీటీ సంస్థల నుండి మంచి ఆఫర్లు రావడం ప్రస్తుత పరిస్థితుల్లో కష్టతరంగా మారింది. అయితే, ఈ సినిమాకు సూపర్ స్టార్ మహేష్ బాబు , నమ్రతా శిరోద్కర్ నిర్మాతలుగా ఉండటంతో, సినిమా విడుదలకంటే ముందే నెట్‌ఫ్లిక్స్ నుండి భారీ డీల్ దక్కడం విశేషం.
అంతేకాకుండా, థియేటర్లలో ఈ చిత్రం మంచి ప్రదర్శన కనబరిస్తే, అదనపు మొత్తం ఇచ్చేలా 'పర్ఫార్మెన్స్ బేస్డ్ క్లాజ్'ను కూడా ఒప్పందంలో చేర్చినట్లు సమాచారం. జీఎంబీ ఎంటర్‌టైన్‌మెంట్, ఏ+ఎస్ మూవీస్ , శ్రీ చక్ర ఎంటర్‌టైన్‌మెంట్స్ సంయుక్తంగా ఈ చిత్రాన్ని నిర్మిస్తున్నాయి.
జూలై 3న ప్రేక్షకుల ముందుకు..
ఈ సినిమాలో దీపా థామస్ కథానాయికగా నటిస్తుండగా, వికాస్ ముప్పల, బాల పరాశర్, ఆనంద్ భారతి, ప్రణయ్ వాక , మాస్టర్ కిరణ్ కీలక పాత్రల్లో కనిపించనున్నారు. ఇప్పటికే ప్రచార కార్యక్రమాలతో ప్రేక్షకులను ఆకట్టుకుంటున్న ఈ సైకలాజికల్ డ్రామా, జూలై 3న థియేటర్లలో విడుదల కానుంది.
మహేష్ బాబు నిర్మాణ భాగస్వామ్యం , వెంకటేష్ మహా దర్శకత్వ ప్రతిభ తోడవడంతో, ఈ సినిమా బాక్సాఫీస్ వద్ద ఎలాంటి ప్రభావాన్ని చూపుతుందో చూడాలి.




