Singer Mangli: సింగర్ మంగ్లీ తమ్ముడి అకౌంట్‌లోకి భారీగా డబ్బులు..రంగంలోకి పోలీసులు..బిగుసుకుంటున్న ఉచ్చు

Singer Mangli: మైక్రో ఫైనాన్స్ స్కామ్ కేసులో సింగర్ మంగ్లీ సోదరుడు శివ చౌహాన్ ఖాతాలోకి నిందితుడు రమావత్ మధు నుంచి మూడుసార్లు నగదు బదిలీ అయినట్లు పోలీసులు గుర్తించారు.

Naresh.k
Published on: 1 May 2026 8:38 AM IST
Singer Mangli
X

Singer Mangli: సింగర్ మంగ్లీ తమ్ముడి అకౌంట్‌లోకి భారీగా డబ్బులు..రంగంలోకి పోలీసులు..బిగుసుకుంటున్న ఉచ్చు

Micro Finance Scam: ప్రముఖ జానపద గాయని మంగ్లీ , ఆమె సోదరుడు శివ చౌహాన్‌ను చుట్టుముట్టిన మైక్రో ఫైనాన్స్ స్కామ్ వివాదం ఇప్పుడు క్లైమాక్స్‌కు చేరుకున్నట్లు కనిపిస్తోంది. ఇప్పటి వరకు కేవలం ఆరోపణలకే పరిమితమైన ఈ కేసులో, తాజాగా పోలీసుల దర్యాప్తులో వెలుగుచూసిన కొన్ని బ్యాంక్ స్టేట్‌మెంట్స్ సంచలనం సృష్టిస్తున్నాయి. ఈ కేసును దర్యాప్తు చేస్తున్న పోలీసులు నిందితుల ఆర్థిక మూలాలను వెలికితీసే పనిలో పడ్డారు. ఈ క్రమంలోనే మంగ్లీ తమ్ముడు శివ చౌహాన్ బ్యాంక్ అకౌంట్లను పరిశీలించగా షాకింగ్ విషయాలు బయటపడ్డాయి. ప్రధాన నిందితుడిగా భావిస్తున్న రమావత్ మధు అకౌంట్ నుంచి శివ చౌహాన్ ఖాతాలోకి మూడుసార్లు భారీగా డబ్బులు బదిలీ అయినట్లు పోలీసులు గుర్తించారు. దీనితో రంగంలోకి దిగిన పోలీసులు రమావత్ మధు బ్యాంక్ ఖాతాలను వెంటనే సీజ్ చేశారు. మధు, హిమకాంత్ రెడ్డి ,శివ చౌహాన్ ఖాతాల పూర్తి హిస్టరీని ఇవ్వాలంటూ బ్యాంక్ అధికారులకు లేఖలు రాశారు.

లాయర్ సుబ్బారావు వర్సెస్ మంగ్లీ

మైక్రో ఫైనాన్స్ పేరుతో మంగ్లీ బృందం సామాన్యులను కోట్లలో మోసం చేశారంటూ న్యాయవాది సుబ్బారావు పంజాగుట్ట పోలీసులకు ఫిర్యాదు చేయడంతో ఈ రచ్చ మొదలైంది. బాధితుల పక్షాన తాను మంగ్లీని సంప్రదించగా, ఆమె తనను బెదిరించిందని సుబ్బారావు ఆరోపించారు. దీనిని మంగ్లీ తీవ్రంగా ఖండించారు. తనపై కావాలనే దుష్ప్రచారం చేస్తున్నారని, పాపులారిటీ కోసమే లాయర్ ఇలా చేస్తున్నారని ఆమె తిరుగు ఫిర్యాదు చేశారు. కొన్ని నెలల క్రితమే మంగ్లీకి సంబంధించినవంటూ కట్టల కొద్దీ కరెన్సీ నోట్ల వీడియోలు సోషల్ మీడియాలో కలకలం రేపాయి.

మంగ్లీ క్లారిటీ

ఈ వివాదంపై మంగ్లీ ఇప్పటికే ఓ ప్రకటన విడుదల చేశారు. నాకు మైక్రో ఫైనాన్స్ వ్యాపారంతో ఎలాంటి సంబంధం లేదు. నా ప్రొఫెషనల్ ఈవెంట్స్ తప్ప నాకు గానీ, నా తమ్ముడికి గానీ ఇతర బిజినెస్‌లు లేవు. అన్యాయంగా నా పేరును వాడుకుంటున్నారు అని ఆమె వాపోయారు. కానీ, ఇప్పుడు తమ్ముడి ఖాతాలోకి నిందితుల నుంచి డబ్బులు వచ్చినట్లు పోలీసులు నిర్ధారించడంతో ఆమె వాదన ఇరకాటంలో పడింది. ఒకవైపు మంగ్లీ తనకేం సంబంధం లేదని చెబుతుంటే, మరోవైపు బ్యాంకు లావాదేవీలు ఆమె సోదరుడి వైపు వేలెత్తి చూపిస్తున్నాయి. పోలీసుల విచారణలో ఆ డబ్బులు దేనికి సంబంధించినవని తేలితే తప్ప, ఈ స్కామ్‌లో అసలు నిజాలు బయటపడవు. ఈ వ్యవహారం టాలీవుడ్‌లో ఇప్పుడు హాట్ టాపిక్ గా మారింది.

Naresh.k

Naresh.k

2014లో జర్నలిస్ట్‌గా నా కెరీర్ ప్రారంభించాను. పలు వెబ్‌సైట్‌లలో సబ్-ఎడిటర్‌గా పని చేశాను. డిజిటల్‌ రంగాల్లో 11 ఏళ్లకు పైగా అనుభవం ఉంది. బిజినెస్, స్పోర్ట్స్, మూవీస్, నేషనల్ అండ్ ఇంటర్నేషనల్, పాలిటిక్స్ , వైరల్ న్యూస్‌కు సంబంధించిన కంటెంట్‌ను రాయగలను. ముఖ్యంగా బిజినెస్, స్పోర్ట్స్, మూవీస్, బ్రేకింగ్ న్యూస్ రాయడంలో నైపుణ్యం ఉంది.

Next Story