Shah Rukh Khan: టికెట్లు అమ్మిన దగ్గర నుంచి సూపర్‌స్టార్ వరకు.. కింగ్ ఖాన్ గురించి 5 ఆసక్తికర విషయాలు!

Shah Rukh Khan: షారుఖ్ ఖాన్‌కు ఫ్రాన్స్ అత్యున్నత పురస్కారం లభించింది, లక్కీ నంబర్ 555, DDLJ స్క్రిప్ట్ చదవకుండానే సైన్ చేయడం వంటి ఆసక్తికర విశేషాలు ఇప్పుడు తెలుసుకుందామా.!

Ravi
By Ravi
Published on: 1 Nov 2026 6:40 PM IST
Shah Rukh Khan
X

Shah Rukh Khan: టికెట్లు అమ్మిన దగ్గర నుంచి సూపర్‌స్టార్ వరకు.. కింగ్ ఖాన్ గురించి 5 ఆసక్తికర విషయాలు!

Shah Rukh Khan: బాలీవుడ్ కింగ్ షారుఖ్ ఖాన్ గురించి ఆయన అభిమానులకు కూడా తెలియని కొన్ని ఆసక్తికర విశేషాలు ఇవి. నవంబర్ 2న 61వ పుట్టినరోజు జరుపుకుంటున్న ఈ సూపర్‌స్టార్‌కు సంబంధించిన ఈ విషయాలు ఇప్పుడు తెగ వైరల్ అయ్యాయి. భారతీయ సినిమాకు చేసిన సేవలు, ప్రపంచవ్యాప్తంగా ఉన్న ఫ్యాన్ ఫాలోయింగ్ కారణంగా షారుఖ్‌కు ఫ్రాన్స్ ప్రతిష్టాత్మక లీజియన్ ఆఫ్ హానర్ పురస్కారం దక్కింది. స్కాట్లాండ్‌లోని యూనివర్సిటీ ఆఫ్ ఎడిన్‌బర్గ్ ఆయనకు గౌరవ డాక్టరేట్ ప్రదానం చేసింది. దాతృత్వం, మానవతా సేవలు, నటుడిగా ప్రపంచవ్యాప్తంగా ఫ్యాన్ ఫాలోయింగ్‌కు ఈ గౌరవం ఇచ్చారు. షారుఖ్ లక్కీ నంబర్ 555 అని, తన కార్ నంబర్ ప్లేట్లపై ఈ నంబర్‌నే వాడతారని తెలుస్తోంది.

1994లో 'కభీ హాన్ కభీ నా' రిలీజైనప్పుడు షారుఖ్ బుకింగ్ కౌంటర్ దగ్గర తానే టిక్కెట్లు అమ్మారట. ఆ సినిమాకు ఆయనకు ఇచ్చిన పారితోషికం కేవలం రూ. 25 వేలు. అలాగే బాలీవుడ్‌లోని ఐకానిక్ రొమాంటిక్ మూవీ DDLJకి స్క్రిప్ట్ చదవకుండానే ఓకే చెప్పారని వార్తలు ఉన్నాయి. దర్శకుడు ఆదిత్య చోప్రా ప్రాజెక్ట్ పట్ల చూపిన ఉత్సాహాన్ని నమ్మి ఆయన ఈ నిర్ణయం తీసుకున్నారని సమాచారం.

ఇక షారుఖ్ నెక్స్ట్ మూవీ 'కింగ్' డిసెంబర్ 24న థియేటర్లలోకి రానుంది. సిద్ధార్థ్ ఆనంద్ దర్శకత్వంలో తెరకెక్కుతున్న ఈ చిత్రంతో కూతురు సుహానా ఖాన్ థియేట్రికల్ డెబ్యూ చేస్తున్నారు. దీపికా పదుకొణె, అభిషేక్ బచ్చన్, అనిల్ కపూర్, జాకీ ష్రాఫ్, అర్షద్ వార్సీ, రాణీ ముఖర్జీ కీలక పాత్రల్లో నటిస్తున్నారు.

Ravi

Ravi

2017లో వెబ్ జర్నలిస్ట్‌గా నా కెరీర్ ప్రారంభించాను. పలు వెబ్‌సైట్స్‌లో కంటెంట్ రైటర్‌గా పని చేశాను. డిజిటల్ మీడియాలో 7 ఏళ్ళకుపైగా అనుభవం ఉంది. ట్రెండింగ్, బిజినెస్, ఆంధ్రప్రదేశ్ & తెలంగాణకు సంబంధించి బ్రేకింగ్ కంటెంట్ రాస్తుంటాను.