Silk Smitha: సిల్క్‌ పైకి కనిపించేంత సున్నితం కాదు...కొడితే బొక్కలిరగాల్సిందే

మత్తెక్కించే కళ్లతో, యంత్రముగ్దులను చేసే అందచందాలతో ఆకట్టుకున్న సిల్క్‌స్మిత నిజంగానే షకీలాను కొట్టిందా. ఇలా చేయడం వెనుక సిల్క్‌స్మిత అసలు ఉద్దేశం ఏంటి?

Balachander
Published on: 28 May 2026 4:08 PM IST
Silk Smitha: సిల్క్‌ పైకి కనిపించేంత సున్నితం కాదు...కొడితే బొక్కలిరగాల్సిందే
X

Silk Smitha: ఒకప్పుడు సినీలవర్స్‌ను గ్లామర్‌తో తనవైపు తిప్పుకొని, కళ్లతో మంత్రముగ్దులను చేసిన నటి సిల్క్‌స్మిత. సినీ ఇండస్ట్రీతో సంబంధం లేకుండా దక్షిణ భారత ఇండస్ట్రీని తన అందచందాలతో ఆకట్టుకుంది. వెండితెరపై కనిపించి డ్యాన్స్‌ చేస్తే చాలు సినిమా బంపర్‌ హిట్‌ అయ్యేది. థియేటర్లు హౌస్‌ఫుల్‌ కలెక్షన్లతో మారుమ్రోగిపోయేది. ఇండస్ట్రీని ఇంతలా ప్రేరేపించిన ఈ ముద్దుగుమ్మ జీవితం కేవలం గ్లామర్‌ మాత్రమే కాదు... వ్యక్తిగత జీవితంలో ఎవరికీ తెలియని ఎన్నో కోణాలు ఉన్నాయి. సిల్క్‌స్మిత గురించి ప్రముఖ నటి షకీలా ఇటీవల కొన్ని విషయాలను పంచుకున్నది. సిల్క్‌స్మితతో కలిసి ఓ సినిమా చేసిన సమయంలో ఆమె నటనలో భాగంగా తనను కొట్టాల్సి ఉంది. కానీ, రియల్‌గానే సిల్క్‌స్మిత షకీలను కొట్టిందట. ఈ విషయాన్ని స్వయంగా షకీలా చెప్పుకొచ్చింది. ఆ దెబ్బకు ఎముకలు విరిగినంత పనికావడంతో సెట్స్‌లోనే ఏడ్చేసినట్టు తెలియజేసింది.

సెట్స్‌లో ఏం జరిగింది?

షకీలా తన కెరీర్ ప్రారంభ దశలో ఉన్నప్పుడు, అప్పటికే స్టార్‌డమ్‌లో ఉన్న సిల్క్ స్మితతో కలిసి ఒక సినిమాలో నటించే అవకాశం వచ్చింది. ఆ సినిమాలో ఒక సీన్‌లో సిల్క్ స్మిత, షకీలాను కొట్టాల్సి ఉంది. సాధారణంగా ఇలాంటి యాక్షన్ సీన్లకు డూప్‌లను వాడటం లేదా కెమెరా యాంగిల్స్ మార్చి కొట్టినట్లు నటిస్తారు. ఇలాంటి సీన్స్‌ బాగా రావడం కోసం పెద్ద ఎత్తున రిహాల్సిస్‌ కూడా చేయిస్తారు. కానీ, ఆ రోజు మాత్రం సీన్ ప్రారంభం కాగానే సిల్క్ స్మిత నిజంగానే చాలా బలంగా షకీలా చెంపపై కొట్టింది. ఆ దెబ్బకు బిత్తరపోయిన షకీలా నొప్పితో అక్కడే కన్నీళ్లు పెట్టుకుంది. ఆ ఘటనతో తీవ్ర మనస్తాపానికి గురై రెండు మూడు రోజులపాటు షూటింగ్‌ కూడా వెళ్లలేదట. ఆ తర్వాత నిర్మాతలు వచ్చి సర్దిచెప్పి, ఇకపై సిల్క్ స్మితతో సీన్లు ఉండవని హామీ ఇవ్వడంతోనే ఆమె తిరిగి సెట్స్‌కు వెళ్లినట్టు తెలియజేసింది.

చాక్లెట్ బాక్స్

కొద్దిరోజుల తరువాత సిల్క్ స్మిత స్వయంగా షకీలా వద్దకు వచ్చి ఒక చాక్లెట్ బాక్స్ ఇచ్చి మాట్లాడింది. తాను అంత గట్టిగా ఎందుకు కొట్టాల్సి వచ్చిందో సిల్క్ ఒక వివరణ ఇచ్చిందని చెప్పుకొచ్చింది. సీన్‌ చేస్తున్న సమయంలో షకీల టవల్‌ మాత్రమే కట్టుకొని నిలబడి ఉందట. సెట్స్‌లో ఉన్నవారంతా షకీలానే చూస్తున్నారు. రిహార్సిల్‌ ఆలస్యం అయితే ఆ టవల్‌ కట్టుకొని అలాగే నిలబడి ఉండాలి. ఒక్కటేక్‌లో అయిపోసే సీన్‌ కోసం గంటల తరబడి అర్థనగ్నంగా ఉండటం నచ్చకపోవడంతో సిల్క్‌స్మిత అలా చేసినట్టు చెప్పుకొచ్చింది. సిల్క్‌స్మిత వివరణ ఇచ్చిన తరువాత షకీలా కాస్త కుదుటపడినా... తనను అంత బలంగా కొట్టడం వెనుక నటన కోసమేనా లేదంటే వ్యక్తిగతంగా ఇంకేమైనా కోపం ఉందా అన్న సందేహం ఇప్పటికీ తనకు అలానే ఉండిపోయిందని చెప్పుకొచ్చింది.

Balachander

Balachander

బాలచందర్ పెళ్లూరి తెలుగు మీడియా రంగంలో 12 ఏళ్లకు పైగా అనుభవం కలిగిన సీనియర్ న్యూస్, పొలిటికల్, భక్తి కంటెంట్ రైటర్, ఎడిటర్. హైదరాబాద్ కేంద్రంగా టీవీ, డిజిటల్ జర్నలిజంలో పనిచేశారు. పొలిటికల్ విశ్లేషణ, ఆధ్యాత్మిక రచనల్లో నైపుణ్యం కలిగి, పొలిటికోస్, ఎన్‌టీవీ డిజిటల్, మల్లెమాల ఎంటర్‌టైన్‌మెంట్‌లో సేవలందించారు. ఎడిటోరియల్ లీడర్‌షిప్, కథనం చెప్పే శైలిలో ప్రత్యేక గుర్తింపు పొందారు.

Next Story