Sharwanand: శర్వా, శ్రీను వైట్ల కాంబోలో 'జార్జ్ క్రిష్'.. రిలీజ్ డేట్ ఖరారు.!

Sharwanand: శర్వానంద్, శ్రీను వైట్ల కాంబినేషన్‌లో వస్తున్న 'జార్జ్ క్రిష్' చిత్రానికి విడుదల తేదీని మేకర్స్ ప్రకటించారు.

Ravi
By Ravi
Published on: 14 Aug 2026 3:35 PM IST
Sharwanand
X

Sharwanand: శర్వా, శ్రీను వైట్ల కాంబోలో 'జార్జ్ క్రిష్'.. రిలీజ్ డేట్ ఖరారు.!

Sharwanand: శర్వానంద్, శ్రీను వైట్ల కాంబినేషన్‌లో వస్తున్న 'జార్జ్ క్రిష్' చిత్రానికి విడుదల తేదీని మేకర్స్ ప్రకటించారు. వచ్చే ఏడాది రిలీజ్ చేయనున్నట్టు అధికారిక ప్రకటన విడుదల చేశారు. ఎన్నో రోజులుగా ఎదురుచూస్తున్న ఈ ప్రాజెక్ట్ గురించి మరిన్ని విశేషాలు ఇక్కడ ఉన్నాయి.

టాలీవుడ్ ఇండస్ట్రీలో తనకంటూ ఒక ప్రత్యేకమైన గుర్తింపు తెచ్చుకున్న నటుడు శర్వానంద్, విభిన్నమైన కథా చిత్రాలను ఎంచుకుంటూ ప్రేక్షకులను అలరిస్తున్నారు. అదేవిధంగా కామెడీ చిత్రాలకు కేరాఫ్ అడ్రస్‌గా నిలిచిన దర్శకుడు శ్రీను వైట్ల, చాలా కాలం తర్వాత శర్వానంద్‌తో కలిసి ఒక ప్రాజెక్ట్ చేస్తున్నారు. ఈ క్రేజీ కాంబినేషన్ కోసం చాలా కాలంగా ఎదురుచూస్తున్న అభిమానులకు శుభవార్త అందింది.

వీరిద్దరి కలయికలో వస్తున్న చిత్రానికి 'జార్జ్ క్రిష్' అనే ఆసక్తికరమైన టైటిల్‌ను ఖరారు చేశారు. దర్శకుడు శ్రీను వైట్ల తన సినిమాలలో కామెడీని పండించడంలో దిట్ట. శర్వానంద్ నటనలో ఉన్న సహజత్వం, శ్రీను వైట్ల కామెడీ టైమింగ్ తోడైతే వెండితెరపై నవ్వుల విందు గ్యారెంటీ అని సినీ వర్గాలు భావిస్తున్నాయి. 'జార్జ్ క్రిష్' అనే టైటి‌ల్‌తోనే ఈ సినిమాకు పాజిటివ్ బజ్ క్రియేట్ చేశారు మేకర్స్.

ప్రస్తుతం ఈ సినిమా షూటింగ్ పనులు వేగంగా జరుగుతున్నాయి. చిత్ర బృందం ఈ సినిమాను వచ్చే ఏడాది సంక్రాంతి కానుకగా జనవరి 14న విడుదల చేయాలని ప్లాన్ చేస్తోంది. శర్వానంద్ కెరీర్‌లో ఇదొక ప్రత్యేకమైన సినిమాగా నిలిచిపోతుందని ఆయన అభిమానులు నమ్ముతున్నారు. ఇప్పటికే బైకర్, నారీ నారీ నడుమ మురారీ చిత్రాలతో వరుస హిట్స్ దక్కించుకున్న శర్వానంద్.. ఈ సినిమాతో మరో హిట్ తన ఖాతాలో వేసుకోవాలని తహతహలాడుతున్నారు.

అనూప్ రూబెన్స్ ఈ చిత్రానికి సంగీతం అందించనున్నారు. ఈ సినిమాలో ఇతర నటీనటులు ఎవరు అనే విషయం మీద త్వరలోనే స్పష్టత రానుంది. నటి నటుల ఎంపికపై మేకర్స్ చాలా జాగ్రత్తలు తీసుకుంటున్నారు. త్వరలోనే అధికారిక ప్రకటన విడుదల కానుంది. ఏకే ఎంటర్టైన్మెంట్స్ బ్యానర్ మీద అనిల్ సుంకర నిర్మిస్తున్న ఈ సినిమా పట్ల చిత్ర బృందం చాలా పాజిటివ్‌గా ఉంది. మొత్తానికి శర్వానంద్, శ్రీను వైట్ల కాంబినేషన్‌లో వస్తున్న 'జార్జ్ క్రిష్' సినిమా మీద టాలీవుడ్ అందరూ ఆసక్తిగా ఎదురుచూస్తున్నారు. కాగా, ఈ సినిమాతో శ్రీను వైట్ల కూడా తిరిగి ఫామ్‌లోకి రావాలని చూస్తున్నారు.


Ravi

Ravi

2017లో వెబ్ జర్నలిస్ట్‌గా నా కెరీర్ ప్రారంభించాను. పలు వెబ్‌సైట్స్‌లో కంటెంట్ రైటర్‌గా పని చేశాను. డిజిటల్ మీడియాలో 7 ఏళ్ళకుపైగా అనుభవం ఉంది. ట్రెండింగ్, బిజినెస్, ఆంధ్రప్రదేశ్ & తెలంగాణకు సంబంధించి బ్రేకింగ్ కంటెంట్ రాస్తుంటాను.

Next Story