'పెద్ది' నుంచి సర్‌ప్రైజ్: శివ రాజ్‌కుమార్ పవర్‌ఫుల్ లుక్ విడుదల!
సూపర్ స్టార్ శివ రాజ్‌కుమార్ పోషిస్తున్న 'గౌరనాయుడు' పాత్రకు సంబంధించిన ఒక ప్రత్యేక గ్లింప్స్‌ను విడుదల చేసి అభిమానులకు సర్‌ప్రైజ్ ఇచ్చింది
మెగా పవర్ స్టార్ రామ్ చరణ్ హీరోగా బుచ్చిబాబు సన దర్శకత్వంలో రూపొందుతున్న భారీ క్రీడా నేపథ్య చిత్రం 'పెద్ది' (Peddi) నుండి చిత్ర యూనిట్ అదిరిపోయే అప్‌డేట్ ఇచ్చింది. ఈ సినిమా ట్రైలర్ లాంచ్‌కు ముందే కన్నడ సూపర్ స్టార్ శివ రాజ్‌కుమార్ పోషిస్తున్న 'గౌరనాయుడు' పాత్రకు సంబంధించిన ఒక ప్రత్యేక గ్లింప్స్‌ను విడుదల చేసి అభిమానులకు సర్‌ప్రైజ్ ఇచ్చింది.
గురువుగా శివ రాజ్‌కుమార్.. క్రికెటర్ నుంచి రెజ్లర్‌గా పెద్ది!
ఈ స్పోర్ట్స్ యాక్షన్ డ్రామాలో శివ రాజ్‌కుమార్ ఒక పవర్‌ఫుల్ రెజ్లింగ్ శిక్షకుడి (కోచ్) పాత్రలో కనిపిస్తున్నారు. ఒక సాధారణ క్రికెటర్ అయిన పెద్దిని తన కఠినమైన శిక్షణతో మొరటు రెజ్లర్‌గా ఎలా తీర్చిదిద్దారు అనేది ఈ గ్లింప్స్‌లో ప్రధానంగా చూపించారు. తాజాగా విడుదలైన వీడియోలో శిక్షణా దృశ్యాలతో పాటు సెట్స్‌లోని తెరవెనుక సన్నివేశాలను (బిహైండ్ ది సీన్స్) కూడా జోడించి సినిమాపై అంచనాలను పెంచారు.
మే 18న ట్రైలర్ సందడి
చిత్ర బృందం ప్రకటించిన సమాచారం ప్రకారం, 'పెద్ది' సినిమా ట్రైలర్‌ను మే 18వ తేదీన ఘనంగా విడుదల చేయనున్నారు. రామ్ చరణ్ గత చిత్రాలకు భిన్నంగా ఈ సినిమాలో పూర్తి ఊర మాస్ లుక్‌లో కనిపిస్తుండటంతో, ట్రైలర్ కోసం మెగా అభిమానులు వేయి కళ్లతో ఎదురుచూస్తున్నారు.
భారీ తారాగణం , సాంకేతిక నిపుణులు
వృద్ది సినిమాస్ బ్యానర్‌పై వెంకట సతీష్ కిలారు నిర్మిస్తున్న ఈ చిత్రంలో జాన్వీ కపూర్ కథానాయికగా నటిస్తోంది. అలాగే దివ్యేందు శర్మ, జగపతి బాబు, బోమన్ ఇరానీ వంటి హేమాహేమీలు కీలక పాత్రలు పోషిస్తున్నారు. ఆస్కార్ విజేత ఏఆర్ రెహమాన్ సంగీతం అందిస్తుండటం ఈ సినిమాకు మరో ప్రధాన ఆకర్షణ. బుచ్చిబాబు సన మార్క్ భావోద్వేగాలతో కూడిన యాక్షన్ డ్రామాగా ఈ చిత్రం తెరకెక్కుతోంది.




