Bigg Boss: బిగ్ బాస్‌లో సంచలనం.. రెడ్ కార్డ్‌తో హౌస్ నుంచి టాప్ కంటెస్టెంట్ అవుట్!
Bigg Boss: హౌస్‌లోని తోటి కంటెస్టెంట్లు యష్, సౌందర్యలతో గొడవ పడే క్రమంలో మంజ పూర్తిగా అంకుశం కోల్పోయాడు.
Bigg Boss: బిగ్ బాస్‌లో సంచలనం.. రెడ్ కార్డ్‌తో హౌస్ నుంచి టాప్ కంటెస్టెంట్ అవుట్!
Bigg Boss Kannada 13: టెలివిజన్ రియాలిటీ షోలలో ఎప్పుడూ రసవత్తరంగా సాగే ‘బిగ్ బాస్’ హౌస్‌లో ఊహించని సంచలనం చోటుచేసుకుంది. వివాదాలు, గొడవలు బిగ్ బాస్ షోకి కొత్తేమీ కాకపోయినా.. ఈసారి హద్దులు మీరిన ఒక కంటెస్టెంట్ ప్రవర్తన షో చరిత్రలోనే మునుపెన్నడూ లేని కఠిన నిర్ణయానికి దారితీసింది. ప్రస్తుతం ‘కన్నడ బిగ్ బాస్ సీజన్ 13’లో జరిగిన ఈ పరిణామం టెలివిజన్ సర్కిల్స్‌లోనూ, సోషల్ మీడియాలోనూ హాట్ టాపిక్‌గా మారింది.
కన్నడ బిగ్ బాస్ సీజన్ 13లో కామన్ మేన్ కేటగిరీ ద్వారా అడుగుపెట్టిన మోడరన్ మహాకవి మంజునాథ్ .. మొదటి నుంచీ తనదైన శైలిలో ఆటాడుతూ వచ్చాడు. అయితే కొద్ది రోజులుగా అతని ప్రవర్తన తీవ్ర వివాదాస్పదమవుతూ వచ్చింది. ఇటీవలి ఎపిసోడ్లలో భాగంగా హౌస్‌లోని తోటి కంటెస్టెంట్లు యష్ , సౌందర్యలతో గొడవ పడే క్రమంలో మంజ పూర్తిగా అంకుశం కోల్పోయాడు.
మహిళా కంటెస్టెంట్ల వ్యక్తిత్వాన్ని, క్యారెక్టర్‌ను కించపరిచేలా తీవ్రమైన బూతులు, అత్యంత అసభ్య పదజాలాన్ని ఉపయోగించాడు. ఈ ఘటనతో తోటి హౌస్‌మేట్స్‌తో పాటు బయట ప్రేక్షకులు కూడా తీవ్రంగా ఆగ్రహం వ్యక్తం చేశారు. మంజ ప్రవర్తనపై నెటిజన్లు సోషల్ మీడియా వేదికగా మండిపడుతూ.. అతనిపై కఠిన చర్యలు తీసుకోవాలని పెద్ద ఎత్తున డిమాండ్ చేశారు.
ఈ తీవ్ర వివాదంపై వీకెండ్ ఎపిసోడ్‌లో హోస్ట్, అభినయ చక్రవర్తి కిచ్చా సుదీప్ తీవ్రస్థాయిలో మండిపడ్డారు. టెలివిజన్ వేదికగా ఒక మహిళా కంటెస్టెంట్ పట్ల అంత దిగజారి మాట్లాడే హక్కు ఎవరిచ్చారంటూ మంజను గట్టిగా నిలదీశారు. బిగ్ బాస్ ఇప్పటికే పలుమార్లు హెచ్చరించినప్పటికీ అతని తీరులో మార్పు రాకపోవడంపై తీవ్ర అసంతృప్తి వ్యక్తం చేశారు.
అనంతరం బిగ్ బాస్ కన్ఫెషన్ రూమ్‌లో మంజను కూర్చోబెట్టి, అతను ప్రత్యక్ష ప్రసారంలో వాడిన అసభ్యకరమైన మాటల ఆడియో క్లిప్పింగ్స్‌ను సుప్రీంగా వినిపించారు. తాను మాట్లాడిన మాటలను స్వయంగా విన్న మంజ తన తప్పును తెలుసుకుని పశ్చాత్తాపంతో కన్నీరుమున్నీరయ్యాడు. ఎంతగానో క్షమాపణలు కోరినప్పటికీ, మహిళల పట్ల అనుచిత ప్రవర్తన విషయంలో జీరో టాలరెన్స్ పాలసీని పాటిస్తామని నిరూపిస్తూ బిగ్ బాస్ అతనికి ఏకంగా ‘రెడ్ కార్డ్’ జారీ చేసి హౌస్ నుంచి బయటకు పంపేశారు.




