Shriya Saran: శ్రియా శరన్ ఎద అందాలపై నెటిజన్ అసభ్య కామెంట్.. భర్త ఏమన్నాడంటే?

Shriya Saran: నటి శ్రియా శరన్ శరీర అందాలపై ఇన్‌స్టాగ్రామ్‌లో అసభ్యకరంగా కామెంట్ చేసిన ఒక ఆకతాయి.

Naresh.k
Published on: 4 July 2026 10:55 AM IST
Shriya Saran
X

Shriya Saran: శ్రియా శరన్ ఎద అందాలపై నెటిజన్ అసభ్య కామెంట్.. భర్త ఏమన్నాడంటే?

Andrei Koscheev: నటీనటులు సోషల్ మీడియాలో యాక్టీవ్‌గా ఉంటూ తమ వ్యక్తిగత, వృత్తిపరమైన విషయాలను అభిమానులతో పంచుకోవడం ఈ రోజుల్లో సర్వసాధారణం అయిపోయింది. అయితే, కొందరు ఆకతాయి నెటిజన్లు మాత్రం నటీమణుల దుస్తులపై, వారి శరీర భాగాలపై అసభ్యకరమైన కామెంట్లు చేస్తూ పరిధులు దాటుతుంటారు. తాజాగా టాలీవుడ్ సీనియర్ స్టార్ హీరోయిన్ శ్రియా శరన్ విషయంలోనూ సరిగ్గా ఇలాంటి ఘటనే ఎదురైంది. కానీ, ఈసారి ఆమె భర్త ఆండ్రీ కోస్చీవ్ సదరు నెటిజన్‌కు ఇచ్చిన అదిరిపోయే కౌంటర్ ఇప్పుడు సోషల్ మీడియాలో హాట్ టాపిక్‌గా మారింది.

నటి శ్రియా శరన్ తరచూ తన భర్త ఆండ్రీతో కలిసి దిగిన రొమాంటిక్ ఫొటోలు, వీడియోలను, అలాగే తన గ్లామరస్ షూట్స్ విశేషాలను ఇన్‌స్టాగ్రామ్ వేదికగా పంచుకుంటూ ఉంటుంది. ఇటీవల ఆమె సోషల్ మీడియాలో అభిమానులతో ముచ్చటిస్తున్న సమయంలో, ఓ ఆకతాయి నెటిజన్ ఆమె శరీర అందాలను ఉద్దేశిస్తూ అత్యంత అసభ్యకరంగా, నొప్పించేలా ఒక కామెంట్ చేశాడు.

సాధారణంగా సెలబ్రిటీలు ఇలాంటి చీప్ కామెంట్లను చూసీచూడనట్లు వదిలేస్తారు లేదా డిలీట్ చేసి పక్కన పెడతారు. కానీ శ్రియా భర్త ఆండ్రీ కొస్చీవ్ మాత్రం ఈసారి లైట్ తీసుకోలేదు. కోపంతో ఊగిపోకుండా, సదరు నెటిజన్ నోరు మూయించేలా అత్యంత వ్యంగ్యంగా, హుందాగా సమాధానమిచ్చి అందరినీ ఆశ్చర్యపరిచాడు.

అసభ్యకరంగా కామెంట్ చేసిన వ్యక్తికి ఆండ్రీ చాలా కూల్‌గా, అంతే పవర్ ఫుల్‌గా రిప్లై ఇచ్చాడు. నువ్వు చెప్పింది నిజమే భయ్యా.. ఆమె అందాన్ని చూసి నేను కూడా మురిసిపోతున్నా. శ్రియా అందాలపై నీకున్న ప్రేమాభిమానాలకు ధన్యవాదాలు. నీలాంటి వాళ్లు ఇంకా మరిన్ని కామెంట్లు చేయాలని కోరుకుంటున్నా అని అన్నాడు. భార్య శరీరంపై ఒకరు అంత అసభ్యంగా కామెంట్ చేసినా.. ఆవేశపడి బూతులు తిట్టకుండా, క్లాస్‌గా తిప్పికొట్టిన ఆండ్రీ సమయస్ఫూర్తికి నెటిజన్లు ఫిదా అయిపోతున్నారు.

ప్రస్తుతం ఆండ్రీ ఇచ్చిన ఈ రిప్లై సోషల్ మీడియాలో విపరీతంగా వైరల్ అవుతోంది. దీనిపై స్పందిస్తున్న నెటిజన్లు.. ఒక భర్తగా తన భార్యను సమాజంలో ఉండే ఇలాంటి నెగెటివిటీ నుంచి ఎంత హుందాగా కాపాడుకోవాలో ఆండ్రీ నిరూపించాడు, ట్రోలర్స్ నోరు మూయించడానికి ఇంతకంటే బెస్ట్ కౌంటర్ ఉండదు"అంటూ ఆండ్రీని ప్రశంసలతో ముంచెత్తుతున్నారు.

Naresh.k

Naresh.k

2014లో జర్నలిస్ట్‌గా నా కెరీర్ ప్రారంభించాను. పలు వెబ్‌సైట్‌లలో సబ్-ఎడిటర్‌గా పని చేశాను. డిజిటల్‌ రంగాల్లో 11 ఏళ్లకు పైగా అనుభవం ఉంది. బిజినెస్, స్పోర్ట్స్, మూవీస్, నేషనల్ అండ్ ఇంటర్నేషనల్, పాలిటిక్స్ , వైరల్ న్యూస్‌కు సంబంధించిన కంటెంట్‌ను రాయగలను. ముఖ్యంగా బిజినెస్, స్పోర్ట్స్, మూవీస్, బ్రేకింగ్ న్యూస్ రాయడంలో నైపుణ్యం ఉంది.

Next Story