Singer Mangli: నాకు ఎలాంటి ప్రమేయం లేదు.. సుభక్షేత్ర ఇన్వెస్ట్మెంట్స్ వివాదంపై సింగర్ మంగ్లీ సంచలన ప్రకటన!

Singer Mangli: సుభక్షేత్ర ఇన్వెస్ట్మెంట్స్ వివాదంపై సింగర్ మంగ్లీ క్లారిటీ. బాధితులకు అండగా ఉంటానని ప్రకటన. తనపై జరుగుతున్న అసత్య ప్రచారాన్ని ఖండించిన మంగ్లీ.

Arun Chilukuri
Published on: 23 April 2026 1:11 PM IST
Singer Mangli
X

Singer Mangli: నాకు ఎలాంటి ప్రమేయం లేదు.. సుభక్షేత్ర ఇన్వెస్ట్మెంట్స్ వివాదంపై సింగర్ మంగ్లీ సంచలన ప్రకటన!

Singer Mangli: గత కొద్దిరోజులుగా సోషల్ మీడియాలో మరియు కొన్ని వార్తా వేదికల్లో వినిపిస్తున్న మైక్రో ఫైనాన్స్, సుభక్షేత్ర ఇన్వెస్ట్మెంట్స్ వివాదంపై ప్రముఖ గాయని మంగ్లీ సోషల్ మీడియా వేదికగా స్పందించారు. ఈ ఆర్థిక మోసం వెనుక తనకు ఎలాంటి ప్రమేయం లేదని ఆమె కుండబద్దలు కొట్టారు.

తనపై కొందరు కావాలనే పనిగట్టుకొని నిరాధారమైన ఆరోపణలు చేస్తున్నారని ఆమె ఆవేదన వ్యక్తం చేశారు. కేవలం తన ప్రతిష్టను దిగజార్చడానికి, వ్యాపారాన్ని అసహ్యంగా చూపించే కుట్ర జరుగుతోందని ఆమె ఆరోపించారు. మైక్రో ఫైనాన్స్ మరియు సుభక్షేత్ర ఇన్వెస్ట్మెంట్స్ పేరుతో నష్టపోయిన బాధితులకు న్యాయం జరగాలని తాను ఆశిస్తున్నట్లు మంగ్లీ పేర్కొన్నారు. బాధితులకు న్యాయం జరిగే వరకు తాను అండగా ఉంటానని, తన శక్తి మేరకు వారికి సహాయం చేస్తానని హామీ ఇచ్చారు.

"నిజం నిలకడగా తెలుస్తుంది. నాకు న్యాయ వ్యవస్థపై పూర్తి నమ్మకం ఉంది" అని ఆమె స్పష్టం చేశారు. ఈ ఆర్థిక మోసానికి, తనకు మధ్య ఎలాంటి సంబంధం లేదని మరోసారి స్పష్టం చేస్తూ.. తనపై వస్తున్న వార్తలు కేవలం కుట్రలో భాగమేనని పేర్కొన్నారు. ఈ వ్యవహారం ఇప్పుడు సోషల్ మీడియాలో హాట్ టాపిక్‌గా మారింది. ఒకవైపు బాధితులు తమకు జరిగిన అన్యాయంపై ఆందోళన వ్యక్తం చేస్తుండగా, మంగ్లీ చేసిన ఈ తాజా ప్రకటన చర్చనీయాంశమైంది.

Arun Chilukuri

Arun Chilukuri

వెబ్ జర్నలిస్ట్ గా నా కెరీర్ HMTV ద్వారా పదేళ్ల క్రితం ప్రారంభం అయింది. పదేళ్లుగా HMTV లోనే వెబ్సైట్ కు ఆర్టికల్స్ రాస్తున్నాను. దాదాపుగా అన్ని కేటగిరీల్లోనూ ముఖ్యంగా తెలంగాణ, ఆంధ్రప్రదేశ్ రాష్ట్రాల వార్తలతో పాటు వివిధ కేటగిరీల్లో అవసరాన్ని బట్టి ఆర్టికల్స్, బ్రేకింగ్ న్యూస్ ను ఇవ్వడం చేస్తున్నాను.

Next Story