Slum Dog: స్లమ్ డాగ్ రిలీజ్‌కు ఫైనాన్షియల్ ప్రాబ్లమ్స్.. ఇంతకీ అసలు నిజమేంటి.?
Slum Dog: డైరెక్టర్ పూరీ జగన్నాథ్ తెరకెక్కించిన స్లమ్ డాగ్ టీజర్ విడుదల చేసి 4 నెలలు గడుస్తున్నా సినిమా విడుదలపై క్లారిటీ లేదు.
Slum Dog: స్లమ్ డాగ్ రిలీజ్‌కు ఫైనాన్షియల్ ప్రాబ్లమ్స్.. ఇంతకీ అసలు నిజమేంటి.?
Slum Dog: భారతీయ సినీ పరిశ్రమలో అత్యంత ప్రతిష్టాత్మకంగా తెరకెక్కుతున్న చిత్రాలకు సంబంధించి సోషల్ మీడియాలో జరిగే చర్చలు అలాగే వివాదాలు ఎప్పుడూ హాట్ టాపిక్‌గా మారుతుంటాయి. ముఖ్యంగా భారీ బడ్జెట్‌తో రూపొందే చిత్రాల టీజర్లు లేదా ట్రైలర్లు విడుదలైన వెంటనే నెటిజన్లు రకరకాలుగా స్పందిస్తుంటారు.
ప్రస్తుతం, డైరెక్టర్ పూరీ జగన్నాథ్ తెరకెక్కిస్తున్న స్లమ్ డాగ్ సినిమాకు సంబంధించి వస్తున్న వార్తలు ప్రస్తుతం సోషల్ మీడియాలో తెగ హల్చల్ చేస్తున్నాయి. పూరీ జగన్నాథ్ తెరకెక్కించిన స్లమ్ డాగ్ టీజర్ విడుదల చేసి 4 నెలలు గడుస్తున్నా సినిమా విడుదలపై క్లారిటీ లేదు. దీనికి ఫైనాన్షియల్ ప్రాబ్లమ్స్ కారణమని తెలుస్తోంది. లైగర్, డబుల్ ఇస్మార్ట్ సినిమాల బకాయిలు ఇంకా తీరిపోలేదని సమాచారం అందుతోంది. అందుకే స్లమ్ డాగ్ పోస్ట్ ప్రొడక్షన్ పనులు చివరి దశకు చేరుకున్నా రిలీజ్ డేట్‌పై నిర్మాతలు పూరీ, ఛార్మి సైలెంట్‌గా ఉంటున్నారని సినీ వర్గాలు వెల్లడిస్తున్నాయి.
ఈ భారీ చిత్రానికి సంబంధించిన షూటింగ్ పనులు ఇప్పటికే చాలా వరకు పూర్తయ్యాయి. అయితే ఆర్థికపరమైన లావాదేవీలు అలాగే బకాయిల అంశం కొలిక్కి రాకపోవడం వల్లనే విడుదల తేదీ ప్రకటనలో జాప్యం జరుగుతోందని ట్రేడ్ వర్గాలు వివరిస్తున్నాయి. సినిమా విడుదలకు ముందే ఇబ్బందులు తొలగిపోవాలని అభిమానులు కోరుకుంటున్నారు. చిత్ర యూనిట్ ఈ అంశంపై త్వరలోనే స్పష్టత ఇస్తుందని విశ్లేషకులు భావిస్తున్నారు.




