Sobhan Babu: శోభన్‌బాబు హీరోయిన్‌తో చివరిగా చెప్పిన మాటలు... అందుకే ఆయనంటే గౌరవం
Sobhan Babu: శోభన్‌బాబు అంటే టాలీవుడ్ ఇండస్ట్రీలో సోగ్గాడు అనే పేరుంది. ఆయన కేవలం వెండితెరకు ఓ అలంకారం మాత్రమే కాదు...క్రమశిక్షణకు మారుపేరు కూడా.
Sobhan Babu
Sobhan Babu: శోభన్‌బాబు అంటే టాలీవుడ్ ఇండస్ట్రీలో సోగ్గాడు అనే పేరుంది. ఆయన కేవలం వెండితెరకు ఓ అలంకారం మాత్రమే కాదు...క్రమశిక్షణకు మారుపేరు కూడా. టాలీవుడ్ ఇండస్ట్రీలో నాటి నుంచి నేటి వరకు వయసు మళ్లినా... సినిమాల్లో నటించేందుకు ప్రయత్నిస్తుంటారు. కానీ, శోభన్‌బాబు ఒక ఏజ్ వచ్చాక సినిమాల నుంచి పక్కకు తప్పుకున్నారు. సినీ ఇండస్ట్రీ నుంచి రిటైర్మెంట్ ప్రకటించి ప్రశాంతంగా జీవించాడు. రిటైర్మెంట్ తరువాత కూడా ఆయన తనతో కలిసి నటించినవారితో సంభాషిస్తూనే ఉండేవారు. శోభన్‌బాబు మరణానికి కొన్ని గంటల ముందు తన సహనటి, ఆప్తమిత్రురాలైన రాజశ్రీకి ఫోన్ చేసి మాట్లాడిన మాటలు ప్రస్తుతం సోసల్ మీడియాలో ట్రెండ్ అవుతున్నాయి.
ఆ ఒక్క ఫోన్ కాల్.. ఊహించని విషాదం!
ఆనాటి హీరోయిన్ రాజశ్రీ ఇటీవలే ఓ ఇంటర్వ్యూలో శోభన్‌బాబుకు సంబంధించిన పలు విషయాలను పంచుకున్నారు. శోభన్‌బాబు మరణించే రోజున ఉదయం సమయంలో తనకు ఫోన్ చేసినట్టు గుర్తు చేసుకున్నారు. ఎప్పుడూ వినిపించే అదే గంభీరమైన స్వరం, అదే ఆత్మీయత. "ఎలా ఉన్నావు రాజశ్రీ? ఆరోగ్యం జాగ్రత్త" అని ఎంతో ఆప్యాయంగా పలకరించారట. ఆ సంభాషణలో ఎలాంటి అనారోగ్య ఛాయలు లేవు, కనీసం నీరసం కూడా లేదు. కానీ, ఆ ఫోన్ పెట్టిన కొన్ని గంటలకే ఆయన గుండెపోటుతో కన్నుమూశారన్న వార్త విని రాజశ్రీ దిగ్భ్రాంతికి గురయ్యారు. రాజశ్రీనే కాదు... శోభన్‌బాబు మరణించాడన్న వార్తను ఎందరో జీర్ణించుకోలేకపోయారు. ఆరోగ్యం పట్ల శ్రద్ద, జీవితం పట్ల నిబద్దత ఉన్న వ్యక్థి సడెన్‌గా ఎలా గుండెపోటుకు గురయ్యారన్నది అర్థంగాని విషయం. ఎవరినీ ఇబ్బంది పెట్టకుండా, ఆయన ఇబ్బందులు పడకుండా పండునుంచి తొడిమ విడవడినట్టుగా ఆయన దూరమయ్యారు. ఒకరకంగా ఇలాంటి మరణం అదృష్టమనే చెప్పాలి.
డబ్బు కంటే విలువలకే పెద్దపీట
దీపం ఉండగానే ఇల్లు చక్కబెట్టుకోవాలి అన్న సామెతను అక్షరాల నిజం చేసి చూపించిన నటుడు శోభన్‌బాబు. సినిమా రంగంలో వచ్చిన డబ్బును వృధా చేయకుండా క్రమశిక్షణతో పొదుపు చేయడం, రియల్ ఎస్టేట్‌లో పెట్టుబడులు పెట్టడం చేశాడు. చెన్నై నగరంలో ఆయన భూమిపై పెట్టిన పెట్టుబడులు ఓ విధంగా సంచలనమే. ఇలా రియల్ వ్యాపారంలో పెట్టుబడులు పెట్టడం వెనుక ఓ ఉద్దేశం ఉండేది. నటులకు సంపాదన ఉన్నప్పుడే దాచుకోవాలి. లేదంటే వృద్ధాప్యంలో ఇబ్బందులు పడతారు అని తోటి నటులకు హితబోధ చేయడమే కాకుండా తనకు ఆప్తులైన వారెందరి చేతలో భూమిపై డబ్బులు పెట్టించారు. నేడు ఇబ్బందులు లేకుండా జీవితాన్ని గడుపుతున్న ఎందరో ఆనాటి తారలు...ఇదంతా శోభన్‌బాబు దయే అని చెప్పడం విశేషం. జీవితంలోనే కాదు...అటు షూటింగ్‌ల విషయంలోనూ ఆయన క్రమశిక్షణగా ఉండేవారు. షూటింగ్‌లకు ఎప్పుడూ ఆలస్యంగా వచ్చేవారు కాదు. అందరితోనూ స్నేహంగా, సోదరభావంతో ఉండేవారు.
ఎందుకు ఆయనంటే అంత గౌరవం?
నేటి తరం నటులకు శోభన్ బాబు గారు ఒక పాఠ్యపుస్తకం లాంటివారు. గ్లామర్ ఇండస్ట్రీలో ఉంటూ కూడా ఎలాంటి వివాదాలకు చోటు ఇవ్వకుండా, తన గౌరవాన్ని కాపాడుకుంటూ జీవించడం సామాన్యమైన విషయం కాదు. ఆయన చెప్పిన చివరి మాటల్లో ఉన్న ఆత్మీయత, తోటి వారిపై చూపిన శ్రద్ధే ఆయనను 'మహోన్నత వ్యక్తి'గా నిలబెట్టాయి.




