Sobhita Dhulipala: మీరు అసలు పడుకోరా ? ఎంత క్యూట్‌గా అడిగింది మామ
Sobhita Dhulipala: విదేశీ పర్యటన ముగించుకుని అర్ధరాత్రి హైదరాబాద్ ఎయిర్‌పోర్ట్‌లో ల్యాండ్ అయిన నాగచైతన్య, శోభిత ధూళిపాళ.
Sobhita Dhulipala: మీరు అసలు పడుకోరా ? ఎంత క్యూట్‌గా అడిగింది మామ
Naga Chaitanya: అక్కినేని వారసుడు నాగచైతన్య, అందాల తార శోభిత ధూళిపాళ జంట ఎక్కడ కనిపించినా ఆ సందడే వేరు. నిశ్చితార్థం తర్వాత ఈ జంటకు సంబంధించిన చిన్న అప్‌డేట్ వచ్చినా సోషల్ మీడియాలో అది క్షణాల్లో వైరల్ అయిపోతోంది. తాజాగా ఈ క్యూట్ కపుల్ హైదరాబాద్ ఎయిర్‌పోర్ట్‌లో సందడి చేశారు. అయితే అక్కడ శోభిత ఇచ్చిన రియాక్షన్ ఇప్పుడు అందరినీ నవ్వుల్లో ముంచెత్తుతోంది.
అర్ధరాత్రి విమానాశ్రయంలో అక్కినేని జంట
విదేశీ పర్యటన ముగించుకుని తిరిగొచ్చిన నాగచైతన్య, శోభిత ధూళిపాళ నిన్న అర్ధరాత్రి 12 గంటల సమయంలో హైదరాబాద్‌లోని రాజీవ్ గాంధీ అంతర్జాతీయ విమానాశ్రయంలో అడుగుపెట్టారు. సాధారణంగా సెలబ్రిటీలు ఎప్పుడు ఎయిర్‌పోర్ట్‌కు వస్తున్నారో తెలుసుకుని మీడియా ప్రతినిధులు అక్కడికి చేరుకోవడం సహజం. ఈ క్రమంలోనే చై-శోభిత జంటను తమ కెమెరాల్లో బంధించేందుకు కెమెరామెన్లు పోటీ పడ్డారు.
మీరు అస్సలు నిద్రపోరా?
ముసిముసి నవ్వులు చిందిస్తూ చైతన్యతో కలిసి వస్తున్న శోభితను చూడగానే మీడియా వాళ్లు క్లిక్కులతో స్వాగతం పలికారు. అయితే సమయం అర్ధరాత్రి దాటడం, అప్పటికే అక్కడ మీడియా వారు వేచి ఉండటం చూసి శోభిత ఆశ్చర్యపోయారు. కెమెరాల వైపు చూస్తూ.. అసలు మీరు పడుకోరా? అంటూ ఎంతో క్యూట్ గా, సరదాగా ప్రశ్నించారు. ఆ మాట అనగానే పక్కనే ఉన్న నాగచైతన్య కూడా చిరునవ్వు చిందించారు. శోభిత అడిగిన తీరుకు అక్కడున్న వారంతా ఒక్కసారిగా నవ్వుకున్నారు. ఆ తర్వాత చిన్న స్మైల్ ఇచ్చి ఈ జంట తమ కారులో వెళ్లిపోయారు.
ఈ సరదా సంభాషణకు సంబంధించిన వీడియో ప్రస్తుతం ఇంటర్నెట్‌ను ఊపేస్తోంది. శోభిత చాలా ప్రాక్టికల్‌గా అడిగారు, మీడియా వాళ్ల కష్టాలను కూడా ఆమె అర్థం చేసుకున్నారు అంటూ నెటిజన్లు కామెంట్స్ చేస్తున్నారు. తెనాలి అమ్మాయిగా తనదైన ముద్ర వేసుకున్న శోభిత, మోడలింగ్‌లో రాణించి బాలీవుడ్ వరకు వెళ్లడమే కాకుండా.. ఇప్పుడు అక్కినేని కోడలిగా తెలుగు వారి మనసు గెలుచుకుంటున్నారు. చైతన్యతో పెళ్లి తర్వాత చాలా సెలెక్టివ్‌గా సినిమాలు చేస్తూనే, ఇలా పర్సనల్ లైఫ్‌ను ఎంజాయ్ చేస్తున్న ఈ జంట అన్యోన్యతను చూసి అక్కినేని అభిమానులు ఫుల్ ఖుషీ అవుతున్నారు.




