సోషల్ మీడియాను షేక్ చేసిన ‘జిమ్ జిమ్ తార’ ఫుల్ సాంగ్ వచ్చేసింది!
Jim Jim Tara: హారర్ కామెడీ చిత్రం ‘పర్ణశాల’ నుంచి సోషల్ మీడియా సెన్సేషన్ ‘జిమ్ జిమ్ తార’ పూర్తి పాటను ఆదిత్య మ్యూజిక్ ద్వారా విడుదల చేశారు.
సోషల్ మీడియాను షేక్ చేసిన ‘జిమ్ జిమ్ తార’ ఫుల్ సాంగ్ వచ్చేసింది!
Jim Jim Tara: వినూత్న ప్రచార వ్యూహాలతో ప్రేక్షకుల్లో ఆసక్తిని రేకెత్తిస్తున్న హారర్ కామెడీ థ్రిల్లర్ చిత్రం ‘పర్ణశాల’. ఈ సినిమా నుంచి ఇప్పటికే సోషల్ మీడియాను షేక్ చేస్తున్న ‘జిమ్ జిమ్ తార’ పాట పూర్తి వెర్షన్‌ను ప్రముఖ ఆడియో సంస్థ ఆదిత్య మ్యూజిక్ ద్వారా చిత్ర యూనిట్ అధికారికంగా విడుదల చేసింది.
జి. లక్ష్మిదేవి గారు స్వయంగా రాసి పాడిన ఈ పాట ప్రోమోలు, బిట్స్ అధికారికంగా రాకముందే నెట్టింట విపరీతంగా ట్రెండ్ అయ్యాయి. ఇన్స్టాగ్రామ్ రీల్స్, యూట్యూబ్ షార్ట్స్‌లో నెటిజన్లతో పాటు సెలబ్రిటీలు సైతం ఈ పాటకు స్టెప్పులేస్తూ రచ్చ చేశారు. ఇప్పుడు పూర్తి పాట విడుదల కావడంతో సినిమాపై అంచనాలు తారాస్థాయికి చేరాయి.
ఈ పాట ఒక విభిన్నమైన మాస్ ట్యూన్, క్యాచీ ఫోక్ లిరిక్స్‌తో సాగే ఎనర్జెటిక్ డ్యాన్స్ నంబర్. గ్రామీణ నేపథ్యం ఉన్న జానపద శైలి, యువతను ఊపేసే రీతిలో సాగే మాస్ బీట్స్ ఈ పాటలో ప్రధాన ఆకర్షణగా నిలిచాయి.
ఈ సందర్భంగా చిత్ర దర్శకుడు వై.జి. భరత్ మాట్లాడుతూ ..మా 'పర్ణశాల' సినిమా కోసం జి.లక్ష్మిదేవి రాసి పాడిన 'జిమ్ జిమ్ తార' పాటకు ప్రేక్షకుల నుంచి వస్తున్న స్పందన నిజంగా మమ్మల్ని ఎంతో మురిపిస్తోంది. పూర్తి పాట విడుదలైన తర్వాత రెస్పాన్స్ మరింత అనూహ్యంగా పెరిగింది. ప్రముఖ ఆదిత్య మ్యూజిక్ ద్వారా దీనిని గ్రాండ్‌గా రిలీజ్ చేయడం సంతోషంగా ఉంది. థియేటర్లలో కూడా ఈ పాటకు ప్రేక్షకులు విపరీతంగా ఎంజాయ్ చేస్తారని ఆశిస్తున్నాం అని ఆశాభావం వ్యక్తం చేశారు.
ఎస్ఎల్టీ ఫిలిమ్స్ బ్యానర్‌పై నిర్మాత మంచి వెంకట్ నిర్మాణంలో వై.జి. భరత్ ఈ చిత్రాన్ని తెరకెక్కిస్తున్నారు. హారర్ కామెడీతో పాటు రొమాన్స్, సస్పెన్స్ థ్రిల్లర్ అంశాలను మేళవిస్తూ రూపొందిస్తున్న ఈ సినిమా, ప్రచార చిత్రాలతోనే మంచి పాజిటివ్ బజ్ తెచ్చుకుంది. తాజాగా ‘జిమ్ జిమ్ తార’ పాట తెచ్చిపెట్టిన క్రేజ్‌తో ‘పర్ణశాల’ సినిమా కోసం సినీ ప్రియులు ఆసక్తిగా ఎదురుచూస్తున్నారు.




