Sonu Sood: దేవుడిలా వచ్చిన సోనూసూద్.. చావు అంచుల్లో ఉన్న పాప సేఫ్!

Sonu Sood: రియల్ హీరో సోనూసూద్ మరోసారి తన ఉదారతను చాటుకున్నారు. ప్రాణాపాయ స్థితిలో ఉన్న చిన్నారి 'నీరా'కు ఖరీదైన శస్త్రచికిత్స చేయించి కొత్త జీవితాన్ని ప్రసాదించారు.

Arun Chilukuri
Published on: 21 April 2026 10:32 AM IST
Sonu Sood
X

Sonu Sood: దేవుడిలా వచ్చిన సోనూసూద్.. చావు అంచుల్లో ఉన్న పాప సేఫ్!

Sonu Sood: వెండితెరపై విలన్‌గా మెప్పించినా, నిజ జీవితంలో మాత్రం కోట్లాది మందికి ఆయనో ఆపద్బాంధవుడు. ఆయనే సోనూసూద్. తాజాగా నీరా అనే చిన్నారికి ప్రాణదానం చేసి మరోసారి తన గొప్ప మనసును చాటుకున్నారు.

తీవ్ర అనారోగ్యంతో బాధపడుతున్న తన కుమార్తె నీరాను కాపాడుకోవడానికి ఆ తల్లి చేయని ప్రయత్నం లేదు. ఎందరో వైద్యులను కలిసినా 'రిస్క్ ఎక్కువ, బ్రతికే అవకాశాలు తక్కువ' అనే సమాధానమే ఎదురైంది. ఆఖరి ప్రయత్నంగా సోనూసూద్ ఇంటి తలుపు తట్టిన ఆ తల్లికి నిరాశ ఎదురుకాలేదు. పాప మెడికల్ రిపోర్టులను పరిశీలించిన సోనూసూద్, వెంటనే తన ట్రస్ట్ సభ్యులతో పాటు జూపిటర్ ఆస్పత్రి వైద్యులతో మాట్లాడి అత్యవసర శస్త్రచికిత్సకు ఏర్పాట్లు చేశారు.

డాక్టర్ ఖాలిద్ షేక్, డాక్టర్ అశుతోష్ నేతృత్వంలోని బృందం నీరాకు విజయవంతంగా సర్జరీ పూర్తి చేసింది. ఆపరేషన్ తర్వాత చిన్నారిని తన చేతుల్లోకి తీసుకున్న సోనూసూద్, చాక్లెట్లు ఇచ్చి కాసేపు ఆడుకున్నారు. అనంతరం స్వయంగా పాపను తల్లికి అప్పగించి ఆ కుటుంబంలో వెలుగులు నింపారు.

ఈ ఘటనకు సంబంధించిన వీడియోను సోషల్ మీడియాలో షేర్ చేస్తూ సోనూసూద్ భావోద్వేగానికి గురయ్యారు. "కొన్నిసార్లు అసాధ్యం అనుకున్నవి కూడా పట్టుదలతో సాధించవచ్చు. నీరా విషయంలో జూపిటర్ హాస్పిటల్ వైద్యులు అద్భుతం చేశారు. ఎవరూ జీవితంపై ఆశ వదులుకోవద్దు. మనం ఐక్యంగా ఉంటే ఎలాంటి కష్టాన్నైనా జయించవచ్చు" అని ఆయన పేర్కొన్నారు. ప్రస్తుతం ఈ వీడియో నెట్టింట వైరల్ అవుతుండగా, నెటిజన్లు "రియల్ హీరో అంటే మీరే సార్" అంటూ ప్రశంసలతో ముంచెత్తుతున్నారు.


Arun Chilukuri

Arun Chilukuri

వెబ్ జర్నలిస్ట్ గా నా కెరీర్ HMTV ద్వారా పదేళ్ల క్రితం ప్రారంభం అయింది. పదేళ్లుగా HMTV లోనే వెబ్సైట్ కు ఆర్టికల్స్ రాస్తున్నాను. దాదాపుగా అన్ని కేటగిరీల్లోనూ ముఖ్యంగా తెలంగాణ, ఆంధ్రప్రదేశ్ రాష్ట్రాల వార్తలతో పాటు వివిధ కేటగిరీల్లో అవసరాన్ని బట్టి ఆర్టికల్స్, బ్రేకింగ్ న్యూస్ ను ఇవ్వడం చేస్తున్నాను.

Next Story