Sreeleela: స్టార్ క్రికెటర్‌తో శ్రీలీల ప్రేమాయణం.. ఎట్టకేలకు నోరు విప్పిన బ్యూటీ
Sreeleela: యంగ్ క్రికెటర్ తిలక్ వర్మ, టాలీవుడ్ హీరోయిన్ శ్రీలీల డేటింగ్‌లో ఉన్నారంటూ వస్తున్న వార్తలపై శ్రీలీల టీమ్ అధికారికంగా స్పందించింది.
Sreeleela: స్టార్ క్రికెటర్‌తో శ్రీలీల ప్రేమాయణం.. ఎట్టకేలకు నోరు విప్పిన బ్యూటీ
Tilak Varma : టాలీవుడ్ సెన్సేషనల్ హీరోయిన్ శ్రీలీల , టీమిండియా యంగ్ క్రికెటర్ తిలక్ వర్మ .. గత కొన్ని రోజులుగా సోషల్ మీడియాలో ఎక్కడ చూసినా ఈ ఇద్దరి పేర్లే మారుమోగిపోతున్నాయి. వీరిద్దరూ డేటింగ్‌లో ఉన్నారంటూ నెట్టింట రకరకాల వార్తలు తెగ షికారు చేశాయి. అయితే, ఈ రూమర్లకు శ్రీలీల టీమ్ గట్టిగా ఫుల్‌స్టాప్ పెట్టేసింది.
ధర్మశాలలో పంజాబ్ కింగ్స్, ముంబై ఇండియన్స్ మధ్య జరిగిన ఐపీఎల్ మ్యాచ్ సందర్భంగా హీరోయిన్ శ్రీలీల తల్లి డాక్టర్ స్వర్ణలత స్టేడియంలో సందడి చేశారు. ముంబై తరఫున ఆడుతున్న తెలుగు కుర్రాడు తిలక్ వర్మ కోసమే ఆమె మ్యాచ్‌కు వచ్చారంటూ అప్పుడే కొందరు సోషల్ మీడియాలో కథనాలు అల్లేశారు. ఇదే సమయంలో తిలక్ వర్మ ప్రేమలో ఉన్నాడంటూ టీమిండియా స్టార్ బ్యాటర్ సూర్యకుమార్ యాదవ్ సరదాగా మాట్లాడిన ఒక పాత వీడియో మళ్లీ తెరపైకి వచ్చింది. ఈ రెండింటినీ లింక్ చేస్తూ.. తిలక్ వర్మ మనసు దోచుకున్న ఆ లక్కీ గర్ల్ శ్రీలీలనే అంటూ నెటిజన్లు, కొన్ని వెబ్‌సైట్లు పెద్ద ఎత్తున ప్రచారం సాగించాయి.
ఈ వార్తలు కాస్తా ముదిరి పాకాన పడటంతో.. చివరకు శ్రీలీల బృందం రంగంలోకి దిగింది. ఈ డేటింగ్ రూమర్లను వారు పూర్తిగా ఖండించారు. ఈ ప్రచారంలో ఎలాంటి నిజం లేదు. శ్రీలీల, తిలక్ వర్మ ఇప్పటివరకు కనీసం ఒకరినొకరు ప్రత్యక్షంగా కలుసుకోలేదు.. మాట్లాడుకోలేదు కూడా. కేవలం ఊహాగానాలతో వస్తున్న ఇలాంటి అబద్ధపు వార్తలను నమ్మకండి అని శ్రీలీల పిఆర్ టీమ్ స్పష్టం చేసింది. ఈ అధికారిక ప్రకటనతో గత కొన్ని రోజులుగా సోషల్ మీడియాను ఊపేస్తున్న ఒక సెలబ్రిటీ లవ్ స్టోరీ రూమర్‌కు ఒక్కసారిగా చెక్ పడినట్లయింది.
ప్రస్తుతం ఈ ఇద్దరు స్టార్స్ కూడా తమ కెరీర్లపైనే పూర్తి ఫోకస్ పెట్టారు. టాలీవుడ్‌లో వరుస క్రేజీ ప్రాజెక్టులతో, స్టార్ హీరోల సినిమాలతో శ్రీలీల ఫుల్ బిజీగా గడుపుతోంది. తన డాన్స్, యాక్టింగ్‌తో ప్రేక్షకులను అలరిస్తూ ముందుకు దూసుకుపోతోంది. అటు అంతర్జాతీయ క్రికెట్‌లో తిలక్ వర్మ భారత జట్టులో కీలక సభ్యుడిగా ఎదుగుతూనే.. ఇటు ఐపీఎల్‌లో ముంబై ఇండియన్స్ తరఫున నిలకడైన ప్రదర్శనతో అదరగొడుతున్నాడు. ఏదేమైనా, సెలబ్రిటీల మధ్య ఎలాంటి చిన్న లింక్ దొరికినా గాసిప్స్ ఎలా పుట్టుకొస్తాయో చెప్పడానికి ఈ శ్రీలీల తిలక్ వర్మ ఎపిసోడే ఒక బెస్ట్ ఎగ్జాంపుల్.




