Sreeleela: అలాంటి మొగుడే కావాలి.. శ్రీలీల బోల్డ్ కామెంట్స్

Sreeleela: టాలీవుడ్ సెన్సేషన్ శ్రీలీల తన కాబోయే జీవిత భాగస్వామిలో ఉండాల్సిన మూడు ముఖ్యమైన లక్షణాల గురించి ఆసక్తికర వ్యాఖ్యలు చేసింది.

Naresh.k
Published on: 5 July 2026 11:18 AM IST
Sreeleela
X

Sreeleela: అలాంటి మొగుడే కావాలి.. శ్రీలీల బోల్డ్ కామెంట్స్

Sreeleela Interview: టాలీవుడ్‌లో ఒకప్పుడు వరుస సినిమాలతో, బ్యాక్-టు-బ్యాక్ షూటింగ్‌లతో క్షణం తీరిక లేనంత బిజీగా గడిపింది హీరోయిన్ శ్రీలీల. ఆ మధ్య కొంచెం గ్యాప్ వచ్చిన మాట నిజమే అయినా, ఈ బ్యూటీ క్రేజ్ మాత్రం తగ్గలేదు. ప్రస్తుతం బాలీవుడ్‌పై కన్నేసిన ఈ ముద్దుగుమ్మ.. చాక్లెట్ బాయ్ కార్తీక్ ఆర్యన్ హీరోగా, స్టార్ డైరెక్టర్ అనురాగ్ బసు కాంబినేషన్‌లో వస్తోన్న ‘తు మేరీ జిందగీ హై’ సినిమాలో హీరోయిన్‌గా నటిస్తోంది. శ్రీలీల ఈ ప్రాజెక్ట్‌పైనే తన ఆశలన్నీ పెట్టుకోగా.. ఈ మూవీ షూటింగ్ షెడ్యూల్స్ ఎప్పటికప్పుడు వాయిదా పడుతూ వస్తున్నాయి.

అయితే సినిమాల సంగతి కాసేపు పక్కన పెడితే.. శ్రీలీల పర్సనల్ లైఫ్‌కు సంబంధించిన ఒక ఇంట్రెస్టింగ్ న్యూస్ ఇప్పుడు సోషల్ మీడియాలో తెగ వైరల్ అవుతోంది. తాజాగా ఓ ఇంటర్వ్యూలో పాల్గొన్న ఈ లక్కీ బ్యూటీ.. తన కాబోయే లైఫ్ పార్ట్‌నర్ గురించి మనసులో మాట బయటపెట్టింది. తనకు కాబోయే మొగుడు కేవలం అందంగా ఉంటే సరిపోదని, అంతకంటే ముఖ్యంగా మంచి మనసు, వ్యక్తిత్వం ఉండాలని శ్రీలీల స్పష్టం చేసింది. ముఖ్యంగా అతనిలో ఈ మూడు క్వాలిటీస్ ఖచ్చితంగా ఉండాలని కండిషన్స్ పెట్టింది.

జీవిత భాగస్వామిగా వచ్చే వ్యక్తి చాలా ప్రాక్టికల్‌గా, బాధ్యతగా , వివేకంతో ఆలోచించేవాడై ఉండాలి.ఎదుటివారి బాధను, భావాలను అర్థం చేసుకుని.. వాటిని గౌరవించే గుణం ఉండాలి. వీటన్నింటికంటే మోస్ట్ ఇంపార్టెంట్ క్వాలిటీ.. అతనికి మంచి టైమింగ్‌తో నవ్వించే గుణం ఉండాలి. ఎప్పుడూ సీరియస్‌గా కాకుండా లైఫ్‌ను సరదాగా మార్చేసే హ్యూమర్ ఉండాలని శ్రీలీల చెప్పుకొచ్చింది.

లుక్స్ అనేవి ఈ రోజు ఉంటాయి, రేపు పోతాయి.. కానీ వ్యక్తిత్వమే జీవితాంతం తోడుంటుంది అనే రేంజ్‌లో శ్రీలీల ఇచ్చిన క్లారిటీ చూసి కుర్రాళ్ళు ఫిదా అవుతున్నారు. మరి టాలీవుడ్ సెన్సేషన్ మనసులోని ఈ క్వాలిటీస్ మ్యాచ్ అయ్యే ఆ 'మిస్టర్ పర్ఫెక్ట్' ఎవరో.. ఆమె బాలీవుడ్ ఎంట్రీతో పాటు పర్సనల్ లైఫ్‌లో కూడా ఎప్పుడు గుడ్ న్యూస్ చెప్తుందో చూడాలి.

Naresh.k

Naresh.k

2014లో జర్నలిస్ట్‌గా నా కెరీర్ ప్రారంభించాను. పలు వెబ్‌సైట్‌లలో సబ్-ఎడిటర్‌గా పని చేశాను. డిజిటల్‌ రంగాల్లో 11 ఏళ్లకు పైగా అనుభవం ఉంది. బిజినెస్, స్పోర్ట్స్, మూవీస్, నేషనల్ అండ్ ఇంటర్నేషనల్, పాలిటిక్స్ , వైరల్ న్యూస్‌కు సంబంధించిన కంటెంట్‌ను రాయగలను. ముఖ్యంగా బిజినెస్, స్పోర్ట్స్, మూవీస్, బ్రేకింగ్ న్యూస్ రాయడంలో నైపుణ్యం ఉంది.

Next Story