SS Rajamouli: ఆ ఒక్క మాటతో ‘వారణాసి’పై అంచనాలు పెంచేసిన రాజమౌళి

SS Rajamouli: రాజమౌళి, మహేష్ బాబు కాంబినేషన్ మూవీ ‘వారణాసి’.

Gagan kumar
Published on: 7 Sept 2026 4:08 PM IST
SS Rajamouli
X

SS Rajamouli: ఆ ఒక్క మాటతో ‘వారణాసి’పై అంచనాలు పెంచేసిన రాజమౌళి

Varanasi: దర్శకధీరుడు ఎస్.ఎస్. రాజమౌళి, సూపర్‌స్టార్ మహేష్ బాబుల మైండ్ బ్లోయింగ్ గ్లోబల్ అడ్వెంచరస్ వండర్ ‘వారణాసి’. ఈ సినిమాకు సంబంధించిన ప్రతీ అప్‌డేట్ సినీ ప్రియుల్లో మైండ్ బ్లాకింగ్ అంచనాలను పెంచేస్తోంది. ‘వారణాసి’ కేవలం ఒక ప్రాంతానికో, పరిమిత కాలానికో సంబంధించిన కథ కాదని రాజమౌళి వెల్లడించారు.

ఆఫ్రికా దట్టమైన అడవులు, అంటార్కిటికా మంచు కొండలు, ప్రాచీన రోమ్ నగరం మీదుగా సాగే అడ్వెంచరస్ ట్రావెల్. కాలంలో వెనక్కి పయనిస్తూ త్రేతాయుగంలోని శ్రీరాముడి కాలం నాటి విశేషాలను, దైవిక రూపాలను సరికొత్త లోకాన్ని ఆవిష్కరించే విజువల్ వండర్ అని రాజమౌళి తెలిపారు. సూపర్ స్టార్ మహేష్ బాబు (రుద్ర) హీరోగా నటిస్తుండగా, గ్లోబల్ బ్యూటీ ప్రియాంక చోప్రా (మందాకిని) కథానాయికగా, మలయాళ వర్సటైల్ యాక్టర్ పృథ్వీరాజ్ సుకుమారన్ (కుంభ) కీలక పాత్రలో కనిపించనున్నారు.

ఎన్ని హాలీవుడ్ స్థాయి విజువల్ ఎఫెక్ట్స్, భారీ అడ్వెంచర్ సీన్స్ ఉన్నప్పటికీ.. ఈ సినిమాకి అసలైన మూలం ఒక తండ్రి-కొడుకుల మధ్య ఉండే బలమైన ఎమోషనల్ బాండింగ్ అని రాజమౌళి తెలిపారు. దీంతో ఈ సినిమాపై అంచనాలు భారీగా పెరిగాయి. ఆస్కార్ విజేత ఎం.ఎం. కీరవాణి సంగీతం అందిస్తుండగా, కె.ఎల్. నారాయణ, ఎస్.ఎస్. కార్తికేయ నిర్మిస్తున్నారు. అంతర్జాతీయ స్థాయిలో ఐమాక్స్ ఫార్మాట్‌లో రూపుదిద్దుకుంటున్న ఈ గ్లోబల్ చిత్రం బాక్సాఫీస్ వద్ద సరికొత్త చరిత్ర సృష్టించడం ఖాయంగా కనిపిస్తోంది.

Gagan kumar

Gagan kumar

2014లో జర్నలిస్ట్‌గా నా కెరీర్ ప్రారంభించాను. పలు వెబ్‌సైట్‌లలో సబ్-ఎడిటర్‌గా పని చేశాను. డిజిటల్‌ రంగాల్లో 11 ఏళ్లకు పైగా అనుభవం ఉంది. బిజినెస్, స్పోర్ట్స్, మూవీస్, నేషనల్ అండ్ ఇంటర్నేషనల్, పాలిటిక్స్ , వైరల్ న్యూస్‌కు సంబంధించిన కంటెంట్‌ను రాయగలను. ముఖ్యంగా బిజినెస్, స్పోర్ట్స్, మూవీస్, బ్రేకింగ్ న్యూస్ రాయడంలో నైపుణ్యం ఉంది.

Next Story