Anudeep Katikala: మెగా ఫ్యాన్స్ దెబ్బకి దిగొచ్చిన స్టాండప్ కమెడియన్..ఏమన్నాడంటే?
Anudeep Katikala: ప్రముఖుల వ్యక్తిగత జీవితాలపై అసభ్య వ్యాఖ్యలు చేసిన స్టాండప్ కమెడియన్ అనుదీప్ కటికాలపై మెగా, నందమూరి అభిమానులు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు.
Anudeep Katikala: మెగా ఫ్యాన్స్ దెబ్బకి దిగొచ్చిన స్టాండప్ కమెడియన్..ఏమన్నాడంటే?
Mega Fans: నవ్వించడం ఒక భోగం.. నవ్వించగలగడం ఒక యోగం. కానీ, ఆ నవ్వు ఎదుటివారిని కించపరిచేలా ఉంటే అది రోగం అవుతుందని నెటిజన్లు మండిపడుతున్నారు. ప్రముఖ స్టాండప్ కమెడియన్ అనుదీప్ కటికాల చేసిన వ్యాఖ్యలు ఇప్పుడు తెలుగు రాష్ట్రాల్లో సెగలు రేపుతున్నాయి. సెలబ్రిటీల వ్యక్తిగత జీవితాలపై ఆయన చేసిన అసభ్య జోకులు టాలీవుడ్ పెద్దన్నల అభిమానుల ఆగ్రహానికి కారణమయ్యాయి.
ఇటీవల ఒక స్టాండప్ షోలో అనుదీప్ కటికాల మెగా డాటర్ నిహారిక విడాకుల అంశంపై అత్యంత దారుణమైన వ్యాఖ్యలు చేశారు. అంతటితో ఆగకుండా ఏపీ డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్, నారా లోకేష్ వంటి రాజకీయ ప్రముఖులను లక్ష్యంగా చేసుకుని చేసిన బాడీ షేమింగ్, పర్సనల్ కామెంట్స్ దుమారం రేపాయి. నవ్వు పేరుతో హద్దులు దాటి మాట్లాడటంపై మెగా, నందమూరి అభిమానులు ఏకమయ్యారు.
భయంతో షోలు బంద్.. పరారైన కమెడియన్
అనుదీప్ తీరుపై ఆగ్రహించిన అభిమానులు జూబ్లీహిల్స్‌లోని ది స్ట్రీట్ కామెడీ క్లబ్‌ను ముట్టడించారు. పరిస్థితి ఉద్రిక్తంగా మారడంతో అనుదీప్ తన ఫోన్ స్విచ్ ఆఫ్ చేసి అజ్ఞాతంలోకి వెళ్లారు. ఈ గొడవ ప్రభావంతో హైదరాబాద్‌లోని ప్రధాన కామెడీ క్లబ్స్ తమ షోలను తాత్కాలికంగా నిలిపివేయాల్సి వచ్చింది.
తప్పనిసరి పరిస్థితుల్లో క్షమాపణ
నలుమూలల నుండి నిరసనలు వెల్లువెత్తడం, చట్టపరమైన చర్యలు తప్పవని అర్థం కావడంతో అనుదీప్ ఎట్టకేలకు సోషల్ మీడియా వేదికగా ఒక వీడియో విడుదల చేశారు. నా వ్యాఖ్యలు ఎవరినైనా నొప్పించి ఉంటే క్షమించండి అంటూ వేడుకున్నారు. అయితే, తప్పు చేసేటప్పుడు లేని వివేకం, తన్నులు తగిలేటప్పుడు గుర్తొచ్చిందా? అంటూ నెటిజన్లు చురకలు అంటిస్తున్నారు.
ఈ ఘటన తెలుగు స్టాండప్ కామెడీ రంగంలో చర్చకు దారితీసింది. కేవలం టికెట్ల ఆదాయం కోసమే కమెడియన్ల అసభ్య ప్రసంగాలను ప్రోత్సహిస్తున్నారా? అనే విమర్శలు వస్తున్నాయి. చౌకబారు విమర్శలతో ఫేమ్ సంపాదించాలనుకోవడం వల్ల, నిజమైన ప్రతిభ ఉన్న ఇతర కమెడియన్లకు కూడా చెడ్డపేరు వస్తోంది.




