Organic Farming: సేంద్రీయ వ్యవసాయం చేస్తున్న స్టార్ హీరో
Organic Farming: బాలీవుడ్ సీనియర్ నటుడు సునీల్ శెట్టి తన ఫామ్‌హౌస్‌లో సేంద్రీయ పద్ధతిలో అవకాడో చెట్లను పెంచుతున్న వీడియోను పంచుకున్నారు.
Organic Farming: సేంద్రీయ వ్యవసాయం చేస్తున్న స్టార్ హీరో
Organic Farming: 60 ప్లస్‌లోనూ కుర్ర హీరోలకు పోటీనిచ్చే ఫిట్‌నెస్‌తో మెరిసిపోయే బాలీవుడ్ సీనియర్ నటుడు సునీల్ శెట్టి రూటే వేరు. సినిమా గ్లామర్ ప్రపంచానికి దూరంగా, పచ్చని ప్రకృతి ఒడిలో ప్రశాంతమైన జీవితాన్ని గడుపుతున్నారు. ఆరోగ్యకరమైన జీవనశైలి కోసం సేంద్రీయ బాట పట్టిన ఆయన.. తాజాగా తన ఫామ్‌హౌస్‌లో పండిన పంటను చూపిస్తూ అభిమానులతో పంచుకున్న వీడియో ఇప్పుడు నెట్టింట వైరల్‌గా మారింది.
సునీల్ శెట్టి తన ఇన్‌స్టాగ్రామ్ ఖాతాలో తన సొంత ఫామ్‌హౌస్‌కు సంబంధించిన ఒక అందమైన వీడియోను షేర్ చేశారు. అందులో ఆయన స్వయంగా సాగు చేస్తున్న సేంద్రీయ అవకాడో చెట్లను, వాటికి కాసిన కాయలను చూపించారు. నిజమైన సంపద బ్యాంక్ ఖాతాల్లో కాదు.. ఇలా చెట్లపైనే పెరుగుతుంది. ఇంట్లో పండించిన స్వచ్ఛమైన అవకాడోలు. ఇదొక గ్రీన్ థెరపీ.. నాకు స్వచ్ఛమైన ఆనందాన్ని ఇస్తోంది అంటూ ప్రకృతిపై తనకున్న ప్రేమను చాటుకున్నారు. గత కొంతకాలంగా కేవలం ఆర్గానిక్ ఫుడ్ మాత్రమే తీసుకుంటూ, రసాయనాల్లేని కూరగాయలు, పండ్లను స్వయంగా పండిస్తూ సునీల్ శెట్టి అందరికీ ఆదర్శంగా నిలుస్తున్నారు.
మనవరాలు వచ్చాక మారిన ప్రాధాన్యతలు
సునీల్ శెట్టి ఫిట్‌నెస్ ఫ్రీక్ అన్న సంగతి తెలిసిందే. అయితే ఇటీవల తన మనవరాలు ఎవారా పుట్టిన తర్వాత ఆయన తన ఆరోగ్యం, లైఫ్ స్టైల్ పట్ల మరింత శ్రద్ధ పెంచినట్లు బాలీవుడ్ టాక్. సునీల్ శెట్టి కుమార్తె అతియా శెట్టి, భారత స్టార్ క్రికెటర్ కేఎల్ రాహుల్ దంపతుల ముద్దుల కూతురే ఈ ఎవారా. మనవరాలితో ఎక్కువ కాలం ఆరోగ్యంగా గడపాలనే ఉద్దేశంతోనే ఆయన పూర్తిగా ఈ ప్రకృతి వ్యవసాయం వైపు మొగ్గు చూపినట్లు తెలుస్తోంది.




