RB Choudary: సినీ పరిశ్రమలో తీరని విషాదం.. రోడ్డు ప్రమాదంలో ప్రముఖ నిర్మాత ఆర్.బి. చౌదరి దుర్మరణం!
RB Choudary: ప్రముఖ సినీ నిర్మాత, సూపర్ గుడ్ ఫిల్మ్స్ అధినేత ఆర్.బి. చౌదరి రాజస్థాన్‌లో జరిగిన రోడ్డు ప్రమాదంలో మరణించారు. ఉదయ్‌పూర్ వద్ద కారు ప్రమాదానికి గురవడంతో ఆయన కన్నుమూశారు.
RB Choudary: సినీ పరిశ్రమలో తీరని విషాదం.. రోడ్డు ప్రమాదంలో ప్రముఖ నిర్మాత ఆర్.బి. చౌదరి దుర్మరణం!
RB Choudary: సినీ ఇండస్ట్రీలో విషాదం చోటుచేసుకుంది. సూపర్ గుడ్ ఫిల్మ్స్ సంస్థ అధినేత, ప్రముఖ సినీనిర్మాత ఆర్‌బీ చౌదరి దుర్మరణం చెందారు. రాజస్థాన్‌లో జరిగిన రోడ్డుప్రమాదంలో ఆయన మృతి చెందారు. ఆయన ప్రయాణిస్తున్న కారు.. ఉదయ్‌పూర్‌లో అదుపుతప్పి డివైడర్‌ను బలంగా ఢీకొట్టింది. ఈ ఘటనలో తీవ్రగాయాలు కావడంతో ఆర్‌బీ చౌదరి అక్కడికక్కడే మృతి చెందారు. ఆర్‌బీ చౌదరి పూర్తిపేరు రతన్‌లాల్ భగత్‌రామ్ చౌదరి కాగా.. ఆయన పలు భాషల్లో 90కి పైగా సినిమాలు నిర్మించారు.
తెలుగులో రాజా, సూర్యవంశం, నిన్నే ప్రేమిస్తా, సంక్రాంతి, సుస్వాగతం, శీను, సింహరాశి లాంటి సూపర్ హిట్ చిత్రాలు నిర్మించారు. తెలుగులో చివరిగా చిరంజీవితో గాడ్‌ఫాదర్ సినిమాను నిర్మించారు. నిర్మాతగా 3 ఫిల్మ్‌ఫేర్ అవార్డులు అందుకున్న ఆర్‌బీ చౌదరికి నలుగురు కుమారులు ఉన్నారు. వీరిలో జీవా.. తమిళ, తెలుగు భాషల్లో ప్రముఖ నటుడుగా రాణిస్తున్నారు. ఆర్‌బీ చౌదరి మృతికి సినీ, రాజకీయ ప్రముఖుల సంతాపం ప్రకటించారు. రేపు చెన్నైలో ఆర్‌బీ చౌదరి అంత్యక్రియలు జరగనున్నట్టు కుటుంబసభ్యులు స్పష్టం చేశారు.




